BigTV English

Gangs Of Godavari Pre Release Event: మా మోక్షు వస్తున్నాడు.. మీ ముగ్గురే వాడికి ఇన్స్పిరేషన్: బాలయ్య బాబు స్పీచ్ వేరే లెవెల్

Gangs Of Godavari Pre Release Event: మా మోక్షు వస్తున్నాడు.. మీ ముగ్గురే వాడికి ఇన్స్పిరేషన్: బాలయ్య బాబు స్పీచ్ వేరే లెవెల్

Balakrishna about mokshagna entry(Today tollywood news): యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ నటిస్తోన్న కొత్త సినిమా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. ఈ మూవీపై ప్రేక్షకుల్లో ఎనలేని అంచనాలు ఉన్నాయి. దానికి తోడు ఇటీవల ‘గామి’ చిత్రంతో డిఫరెంట్ రోల్‌తో పలకరించిన విశ్వక్ ఇప్పుడు ఫుల్ మాస్ లుక్‌లో వస్తుండటంతో అందరిలోనూ భారీ స్థాయి అంచనాలు ఉన్నాయి. ఈ నెల అంటే మే 31న ఈ సినిమా గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మూవీ మేకర్స్ తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌కి నందమూరి నటసార్వభౌమ్యుడు బాలయ్య బాబు హాజరై తన స్పీచ్‌తో అదరగొట్టేశాడు.


బాలయ్య మాట్లాడుతూ.. ‘‘మా ఇద్దరం ఒక తల్లి కడుపున పుట్టకపోయినా.. ఎవరైనా మమ్మల్ని బయట చూస్తే కవలలే అంటారు. నేను కొంతమందితోనే ఇండస్ట్రీలో సన్నిహితంగా ఉంటాను. ఎందుకంటే మాకు పెద్దగా టైం ఉండదు. నేను విశ్వక్ కంటే వయసులో చాలా చిన్న వాడిని. విశ్వక్ నాకు అన్న అవుతాడు. అంటూ నవ్వుతూ మాట్లాడాడు. విశ్వక్‌కి సినిమా అంటే ఓ ఫ్యాషన్. అతని జర్నీ చూశాం. మొదటి సినిమా నుంచి కూడా డిఫరెంట్ రోల్స్, కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల్ని అలరించాలని చూస్తుంటాడు. నేను కూడా అదే ట్రై చేస్తుంటాను. నాలో ఏదైతే ఉడుకు రక్తం.. దూకుడు తనం ఉందో అదే విశ్వక్‌ సేన్‌లో కూడా ఉంది’’ అంటూ చెప్పుకొచ్చాడు.

ఇక తన కుమారుడు మోక్షజ్ఞ గురించి మాట్లాడుతూ.. ‘‘మా వాడు ఉన్నాడు మోక్షజ్ఞ. వాడు రావాలి రేపు ఇండస్ట్రీకి. వాడు మిమ్మల్ని ఇన్పిరేషన్ తీసుకోవాలి. నేనెప్పుడూ నన్ను ఇన్స్పిరేషన్ తీసుకోవద్దు అని అంటాను. చాలా మంది అభిమానులు బాధ పడొచ్చు. యంగ్ నటుల్ని ఇన్స్పిరేషన్‌గా తీసుకోవాలి. విశ్వక్ సేన్, సిద్ధు, అడవి శేష్ వంటి యంగ్ హీరోల్ని ఇన్ఫిరేషన్‌గా తీసుకోవాలి అని చెప్తాను’’ అని అన్నాడు. అలాగే ‘‘త్వరలో మంచి కాంబో అనౌన్స్ చేయబోతున్నాం. డిజిటల్ అండ్ శాటిలైట్. మంచి కాంబో ఉంది ఒకటి. దానికి సంబంధించిన అప్డేట్ త్వరలో ఇస్తాం’’ అని అన్నాడు.

Also Read: మాస్ కా దాస్ మరో అరాచకం.. అదిరిపోయిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ట్రైలర్

విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఓ సంఘటన గురించి తెలిపాడు. ‘‘నేను జనరల్‌గా ఏడవను. కానీ ఈ సినిమా యాక్షన్ షూటింగ్ సమయంలో లారీ పై నుంచి పడిపోయాను. ఆ సమయంలో నా మోకాలి చిప్ప పగిలి పోయింది. రెండు ఏళ్లు బెడ్ రెస్ట్ పడుతుందని అనుకున్నాను. కానీ ఆ దేవుడి దయ వల్ల ఏమి కాలేదు. ఆ టైంలో బాలయ్య బాబు కాల్ చేసి నాకు దెబ్బ తగిలిందని బాధపడితే.. ఆ టైంలో నాకు చాలా ఏడుపు వచ్చింది. నా కళ్లల్లో నీళ్లు కొన్ని ఏళ్ల తర్వాత తిరిగాయి ఆ రోజు. లవ్ యూ సో మచ్ సర్. నాపై అంత ప్రేమ చూపించిన వాళ్లలో మా ఫ్యామిలీ తర్వాత చాలా తక్కువ మంది నా లైఫ్‌లో’’ అంటూ చెప్పుకొచ్చాడు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×