BigTV English

Teamindia practice at New york: ప్రాక్టీసులో రోహిత్ సేన, తొలిరోజు కేవలం..

Teamindia practice at New york: ప్రాక్టీసులో రోహిత్ సేన, తొలిరోజు కేవలం..

Teamindia practice at New york: మరో నాలుగు రోజుల్లో టీ20 ప్రపంచకప్ మొదలుకానుంది. అమెరికా-వెస్టిండీస్ వేదికగా ఈ టోర్నీ జరుగుతోంది. కీలక జట్లలో కొన్ని అమెరికాకు, మరికొన్ని వెస్టిండీస్‌కు చేరుకున్నారు.


కొన్ని జట్లు ప్రాక్టీసులో నిమగ్నమయ్యాయి. రోహిత్‌శర్మ టీమ్ సభ్యులు న్యూయార్క్‌లో ప్రాక్టీసు మొదలు పెట్టేశారు. దాదాపు నాలుగు గంటలపాటు ముమ్మరంగా సాధన చేశారు. వాతావరణం కండీషన్ బట్టి తొలి రోజు కేవలం కేవలం రన్నింగ్‌కే పరిమితమయ్యారు.

తొలుత ఐర్లాండ్‌తో ప్రాక్టీసు మ్యాచ్ జరగనుంది. ఇందులో సీనియర్ ఆటగాళ్లు బరిలోకి దించాలని ఆలోచన చేస్తోంది టీమిండియా. ఆటగాళ్లంతా ఇప్పటికే న్యూయార్క్‌కు చేరుకున్నారు. కోహ్లీ, హార్ధిక్ పాండ్యా, సంజు శాంసన్ కూడా ప్రాక్టీసులో ఉన్నారు.


ALSO READ: అంబటి రాయుడు ‘జోకర్ ’ఎందుకయ్యాడు?

వార్మప్ మ్యాచ్‌ని న్యూయార్క్‌లో ఆడాలన్నది టీమిండియా ప్లాన్. ఐసీసీ మాత్రం ఫ్లోరిడాలో వార్మప్ మ్యాచ్ నిర్వహిస్తోంది. టీమిండియా అభ్యర్థనకు ఐసీసీ గ్రీన్‌ సిగ్నల్ ఇవ్వలేదు. ఒకవేళ ఇస్తే జట్టుకు మేలు చేస్తుందని అంటున్నారు. ఇదే మైదానంలో రోహిత్ జట్టు పాకిస్థాన్‌తో తలపడబోతోంది. మ్యాచ్‌కు ముందు పరిస్థితులకు తగ్గట్టుగా భారత ఆటగాళ్లు అలవాటు పడితే గెలుపు సునాయాశమేనని అంచనా వేస్తున్నారు. ఈ మ్యాచ్‌కు సచిన్ టెండూల్కర్ హాజరుకానున్నట్లు తెలుస్తోంది.

Indian cricket team begins preparations. Rohit Sharma others practice session at New York
Indian cricket team begins preparations. Rohit Sharma others practice session at New York

మొత్తం 20 జట్లను నాలుగు గ్రూపులుగా విభజించారు. గ్రూప్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్ 8కు అర్హత సాధిస్తాయి. అక్కడ జట్లను రెండు గ్రూపులుగా విభజిస్తారు. ఇక్కడ తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు, సెమీస్‌లో ప్రవేశిస్తాయి. గ్రూప్-ఏలో భారత్, కెనడా, ఇర్లాండ్, పాకిస్థాన్, అమెరికా జట్లు ఉండనున్నాయి.

Tags

Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×