Vishwak Sen : ఈ మధ్యకాలంలో ప్రయోగాలు చేయడంలో ముందుంటున్న హీరో విశ్వక్ సేన్ (Vishwak sen) అందులో భాగంగానే లైలా (Laila) సినిమాతో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇందులో మొదటిసారి లేడీ గెటప్ తో ఆకట్టుకున్నారు. కానీ కథ, కంటెంట్ ప్రేక్షకులకు కనెక్ట్ కాకపోవడం వల్లే ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఇక ఈ సినిమా డిజాస్టర్ అవడంతో ఆడియన్స్ ఏది అంత త్వరగా యాక్సెప్ట్ చేయరు అనే విషయాన్ని గ్రహించిన విశ్వక్ సేన్ అందులో భాగంగానే కొత్త జానర్లో సినిమాను చేయడానికి సిద్ధం అవుతున్నారు. ఇక కొత్త జానర్ ఎంపిక తోనే హీరో ముఖంలో హిట్ కళ కనిపిస్తోంది అంటూ నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.
మసూద డైరెక్టర్ తో సినిమా..
ఇకపోతే ఆడియన్స్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తానని, ఇకపై లైలా లాంటి సినిమాలు చేయనని లెటర్ ద్వారా అందరికీ తెలిపిన విశ్వక్.. ప్రస్తుతం ‘జాతి రత్నాలు’ సినిమా దర్శకుడు అనుదీప్ కె.వి (Anudeep KV) దర్శకత్వంలో ‘ఫంకీ’ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, ప్రముఖ డైరెక్టర్ త్రివిక్రమ్ (Trivikram ) సతీమణి సాయి సౌజన్య (Sai Soujanya) ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఇందులో కాయదు లోహర్ హీరోయిన్గా ఎంపిక అయింది. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్గా ఈ సినిమా ఉందనున్నట్లు సమాచారం. ఇలా ఒకవైపు ఫంకీ సినిమా చేస్తూనే మరొకవైపు కథలు వింటున్నట్లు తెలుస్తోంది ఇక లైలా సినిమా తర్వాత ఆ కథల ఎంపిక విషయంలో జాగ్రత్త పడుతున్న విశ్వక్ సేన్ రీసెంట్గా మసూద (Masuda) డైరెక్టర్ సాయి కిరణ్ (Sai Kiran) కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.
కొత్త ప్రయోగంతో సక్సెస్ అవుతారా..?
అసలు విషయంలోకి వెళ్తే.. సాయికిరణ్ తాజాగా ఒక యాక్షన్ థ్రిల్లర్ జానర్ లో కథను సిద్ధం చేసుకుని విశ్వక్ దగ్గరికి వెళ్లగా… కథ నచ్చడంతో ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. డైరెక్టర్ సాయికిరణ్ దర్శకత్వంలోనే విశ్వక్ సినిమా చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఇకపోతే ‘మసూద’ లాంటి సూపర్ హిట్ మూవీ అందించిన టాలెంటెడ్ డైరెక్టర్ తో సినిమా అంటే అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఇక ఈ సినిమాతో పాటు ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమా సీక్వెల్ కూడా విశ్వక్ చేయబోతున్నారు మొత్తానికి అయితే ఇప్పుడు అర్జెంట్ గా ఈయన ఖాతాలో హిట్టు పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి.. అందుకు తగ్గట్టుగానే ఆయన కూడా కథలు ఎంపిక చేసుకుంటున్నట్లు సమాచారం.
విశ్వక్ సేన్ కెరియర్..
విశ్వక్ సేన్ విషయానికి వస్తే.. నటుడిగా, రైటర్గా, డైరెక్టర్ గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తనదైన నటనతో ఎప్పటికప్పుడు కొత్త ప్రయోగాలు చేస్తూ ఆడియన్స్ అలరిస్తున్నారు. అయితే ఇప్పటివరకు తీసిన సినిమాలలో..లైలా సినిమా రేంజ్ లో డిజాస్టర్ ని చవిచూడలేదు అని చెప్పాలి. ముఖ్యంగా ఆటిట్యూడ్ హీరోగా పేరు దక్కించుకున్న విశ్వక్ సేన్.. అనూహ్యంగా చేసిన తప్పిదాల వల్లే ఇబ్బందుల్లో పడ్డారని చెప్పవచ్చు. ఇక ఇప్పుడు అన్నింటి నుంచి బయటపడ్డ ఆయన త్వరలోనే ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్ అందించే ప్రయత్నం చేస్తానని చెబుతున్నారు. మరి ఏ మేరకు తన తదుపరి సినిమాతో ఆడియన్స్ ను ఆకట్టుకుంటారో చూడాలి.