Donald Trump About Sunita Williams: అమెరికా స్పేస్ ఏజెన్సీ నాసా చేపట్టిన చిన్న మిషన్ లో భాగంగా అతరిక్షంలోకి వెళ్లి.. అనివార్య కారణాలతో అక్కడే చిక్కుకు పోయారు ఆస్ట్రోనాట్స్ సునీతా విలియమ్స్, బుచ్ విల్ మోర్. వీరిద్దరిని త్వరలోనే భూమ్మీదకు తీసుకొచ్చేందుకు కీలక ప్రయత్నాలు కొనసాగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఈ బాధ్యతను స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ కు అప్పగించినట్లు తెలిపారు. త్వరలోనే వారిద్దరు క్షేమంగా భూమ్మీదకు వస్తారని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ట్రంప్ ఏమన్నారంటే?
సునీతా జుట్టుపై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఓవల్ ఆఫీసులో మీడియాతో మాట్లాడిన ప్రెసిడెంట్ ట్రంప్.. అంతరిక్ష కేంద్రంలో ఉండిపోయిన ఇద్దరు హ్యోమగాములను త్వరలోనే భూమ్మీదకు తీసుకొస్తామని చెప్పారు. వారు ఇద్దరు స్పేస్ లోనే ఉండిపోవడానికి కారణంగా అమెరికా గత అధ్యక్షుడు జో బైడెన్ అని విమర్శించారు. అసమర్ధుడైన బైడన్ పాలన కారణంగానే వాళ్లు ఐఎస్‌ఎస్ లో చిక్కుకుపోయారని ఆరోపించారు. వారిని కనీసం పట్టించుకోవడం మానేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిద్దరినీ వీలైనంత త్వరగా కిందికి తీసుకొచ్చేందుకు ఎలన్ మస్క్ సాయం తీసుకుంటున్నట్లు వెల్లడించారు. మరో రెండు వారాల్లో ఆ ఇద్దరు భూమ్మీదకు వచ్చేస్తారని డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఈ సందర్భంగా ట్రంప్ సునీత విలియమ్స్ జుట్టుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సునీత హెయిర్ చాలా బలంగా, వైల్డ్ గా ఉందన్నారు. ఈ విషయంలో తాను ఎలాంటి జోక్ చేయడం లేదన్నారు. సునీతను చూసినప్పుడల్లా ఆమె బలమైన కురులే గుర్తుకు వస్తాయని తెలిపారు.
Trump on two astronauts stuck in space: "Maybe they'll love each other, I don't know. But they've been left up there. Think of it. And I see the woman with the wild hair. Good solid head of hair she's got. There's no kidding. There's no games with her hair." pic.twitter.com/6a2JHVXFNO
— Aaron Rupar (@atrupar) March 6, 2025
Read Also: ఆ అందమైన ఐలాండ్‌లో సిటిజన్‌షిప్ కావాలా? జస్ట్ రూ. 91 లక్షలు చెల్లిస్తే చాలట!
గత ఏడాది జూన్ 6న అతరిక్షంలోకి వెళ్లిన సునీత
సునీతా విలియమ్స్, విల్ బుచ్ మోర్ గత ఏడాది (2024) జూన్ 6న అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. మానవ సహిత యాత్రలో భాగంగా వీరిద్దరు స్టార్ లైనర్ స్పేస్ షిప్ లో అంతరిక్షంలోకి వెళ్లారు. 8 రోజుల తర్వాత వీళ్లు తిరిగి భూమ్మీదికి రావాలి. కానీ, వారు వెళ్లిన స్పేస్ షిప్ లో టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలో వారిద్దరు అక్కడే చిక్కుకుపోయారు. సునీతా విలియమ్స్ , విల్ మోర్ ను తీసుకెళ్లిన స్టార్ లైనర్ స్పేస్ షిప్ మాత్రం 2024 సెప్టెంబర్ లో భూమి మీదకు వచ్చింది. అటు సెప్టెంబర్ 29న స్పేస్ ఎక్స్ క్రూ ప్రయోగించారు. ఇందులో హాక్, గోర్బునోవ్ అనే ఇద్దరు ఆస్ట్రోనాట్స్ ను నాసా అంతరిక్షంలోకి పంపింది. 2025 ఫిబ్రవరిలోనే సునీతా, విల్ కిందికి రావాల్సి ఉంది. కానీ, టెక్నికల్ కారణాలతో వారి రాక వాయిదా పడింది. ఈ నెలలో వారిని ఎలాగైన భూమ్మీదకు తీసుకొచ్చేందుకు నాసా ప్రయత్నిస్తోంది. ఇప్పటికే వారిని తీసుకొచే మిషన్ బాధ్యతలను ట్రంప్ మస్క్ కు అప్పగించారు. స్పేస్ ఎక్స్ టీమ్ వారిని కిందికి తీసుకొచ్చేందుకు అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటున్నారు.
Read Also: గంటకు 400 కిలో మీటర్ల వేగం.. చైనా ఫాస్టెస్ట్ ట్రైన్ ప్రత్యేకతలు చూస్తే మతిపోవాల్సిందే!