IND vs NZ: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ ( Champions Trophy 2025 Tournament ) ఫైనల్ నేపథ్యంలో క్రికెట్ అభిమానులకు అదిరిపోయే శుభవార్త వచ్చింది. చాంపియన్ ట్రోఫీ 2025 ఫైనల్ మ్యాచ్ ను మల్టీప్లెక్స్ లలో ( Multiflex ) ప్రత్యక్ష ప్రసారం చేయబోతున్నారు. చాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ లో భాగంగా… న్యూజిలాండ్ వర్సెస్ టీమిండియా ( New Zealand vs Team India ) మధ్య ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. ఈ తరుణంలోనే… హైదరాబాదులో ఉన్న మల్టీప్లెక్స్ లలో.. చాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్… ప్రదర్శించబోతున్నారు. ఈ మేరకు మల్టీప్లెక్స్ యాజమాన్యాలు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం రోజు కావడం.. దానికి తోడు ఫైనల్ మ్యాచ్ కావడంతో… జనాలందరూ మ్యాచ్ చూసేందుకే ఆసక్తి చూపిస్తారు.
Also Read: Rohit Sharma Retirement: ఫైనల్స్ కు ముందే టీమిండియాకు షాక్.. వన్డే కెప్టెన్సీకి రోహిత్ గుడ్ బై..?
ఈ నేపథ్యంలోనే… హైదరాబాద్ నగరంలో ఉన్న మల్టీప్లెక్స్ థియేటర్లో యాజమాన్యాలు… థియేటర్లలో సినిమా తరహాలో మ్యాచ్ కూడా ప్రసారం చేసేందుకు సిద్ధమయ్యాయి. అయితే ఏ ఏ థియేటర్లలో ఈ మ్యాచ్ ప్రదర్శిస్తారు అనే దాని పైన క్లారిటీ లేదు. ప్రదర్శించేందుకు మాత్రం నిర్ణయం తీసుకున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన కూడా వెలువడింది. దీంతో హైదరాబాద్ నగరంలో ఉన్న క్రికెట్ అభిమానులు సంబరపడిపోతున్నారు.
ఇంట్లో మ్యాచ్ చూసే కంటే థియేటర్లో మ్యాచ్ చూస్తే… ఆ కిక్కే వేరు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే థియేటర్ టికెట్ ధర ఎంత పెడతారు ? అనేది చర్చనీయాంశంగా మారింది. ఉచితంగా ప్రసారం చేస్తే…. జనాలు ఎగబడడం ఖాయమని మరి కొంత మంది అంటున్నారు. కానీ టికెట్లు పెడితేనే అదుపులో పరిస్థితులు ఉంటాయని చెబుతున్నారు. టికెట్ ధరలు పెంచి అమ్మినా కూడా… హౌస్ ఫుల్ అవుతుందని చెబుతున్నారు. ఇది ఇలా ఉండగా.. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్.. ఫైనల్ లో భాగంగా న్యూజిలాండ్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య దుబాయ్ వేదికగా మ్యాచ్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం… ఆదివారం రోజున మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో టాస్ ప్రక్రియ ఉంటుంది. ఈ మేరకు షెడ్యూల్ కూడా ఖరారు అయింది. ఇక ఫైనల్ మ్యాచ్ లో నలుగురు స్పిన్నర్లతో టీమిండియా బరిలోకి దిగే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.
మహమ్మద్ షమీ అలాగే హార్దిక్ పాండ్యా ఇద్దరు పేస్ విభాగం చూసుకుంటారు. అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ తుది జట్టులో ఉండే ఛాన్స్ ఉంది. ఈ నలుగురు స్పిన్ విభాగానికి ప్రాతినిధ్యం వహిస్తారు. అంటే దాదాపుగా తొలి సెమీఫైనల్ మ్యాచ్ లో ఉన్న జట్టు.. ఫైనల్ మ్యాచ్ లో కూడా ఉండే ఛాన్స్ ఉంది. దీంతో రిషబ్ పంత్, అర్షదీప్ సింగ్ ఇద్దరు కూడా రిజర్వు బెంచ్ కు పరిమితమవుతారు. దుబాయ్ స్టేడియం స్పిన్ బౌలింగ్ కు అనుకూలిస్తున్న నేపథ్యంలో స్పిన్నర్లను తీసుకుంటున్నారు.
Also Read: Mohammed Shami: షమీ ఎనర్జీ డ్రింక్స్ వివాదం… మళ్లీ గెలికిన షామా మహ్మద్