BigTV English

Mechanic Rocky Censor Cuts : విశ్వక్ మరో బూతు సినిమా చేసినట్టు ఉన్నాడు… ఆ బూతులు ఏంటి..?

Mechanic Rocky Censor Cuts : విశ్వక్ మరో బూతు సినిమా చేసినట్టు ఉన్నాడు… ఆ బూతులు ఏంటి..?

Mechanic Rocky Censor Cuts: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (vishwak Sen) నుంచి అందరూ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న సినిమా మెకానిక్ రాకీ.. రవితేజ ముళ్ళపూడి దర్శకత్వంలో వస్తోంది ఈ సినిమా. ఇందులో మీనాక్షి చౌదరి(Meenakshi Choudhary), శ్రద్ధా శ్రీనాథ్ (Shraddha Srinath) హీరోయిన్స్ గా నటిస్తున్నారు. రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ సినిమా నవంబర్ 22న విడుదల కాబోతోంది. ఇకపోతే విశ్వక్ సేన్ మూవీ అంటేనే అందులో మాస్ మసాలా ఎంత ఉంటుందో అందరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఈ నేపథ్యంలోనే ‘మెకానిక్ రాకీ’ సినిమాలో కూడా విశ్వక్ భారీగా బూతు పురాణం చేసినట్టు తెలుస్తోంది. ఇక తాజాగా ఈ బూతులు అన్నింటిని సెన్సార్ బోర్డు కట్ చేసినట్లు సమాచారం.


సెన్సార్ కట్ చేసిన పదాలు ఇవే..

సాధారణంగా ఒక సినిమా ప్రేక్షకులకు మంచి మెసేజ్ ఇచ్చేలా ఉండాలి. కానీ ఈ మధ్యకాలంలో బూతులతో పాటు మరెన్నో విషయాలు సినిమాలలో జోడిస్తూ సెన్సార్ కట్ కి గురవుతున్నాయి. ఈ క్రమంలోనే అభ్యంతరకర సన్నివేశాలను అలాగే అసభ్యకర పదజాలాలను ఉపయోగిస్తే మాత్రం కట్ కి గురికాక తప్పదు. ఈ నేపథ్యంలోనే ‘మెకానిక్ రాకీ’ సినిమాలో కూడా విచ్చలవిడిగా అసభ్యకర పదజాలం ఉపయోగించిన నేపథ్యంలో సెన్సార్ బోర్డు కట్ చేసింది. మెకానిక్ రాకీ నుండీ బాడ్*కవ్, దెం*గు, గు*ట్టి*గో*ల్, గు*ర్ద*క*ప్పు*రా*లు లాంటి పదాలను సెన్సార్ కట్ చేసింది.


సెన్సార్ పూర్తీ.. రన్ టైం లాక్..

ఇకపోతే తాజాగా ఈ సినిమా సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది.156.20 నిమిషాల నిడివితో సినిమా రన్ టైం లాక్ చేశారు. ఇకపోతే బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

ప్రెస్ మీట్ లో పలు విషయాలపై స్పందన..

ఇకపోతే తాజాగా ఏర్పాటు చేసిన ఈ సినిమా ప్రెస్ మీట్ లో విశ్వక్ సేన్ మాట్లాడుతూ..” గత నాలుగు ఐదు సంవత్సరాలుగా జరుగుతున్న ఒక బర్నింగ్ పాయింట్ ను ఈ సినిమాలో చూపించాము. అది స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు మీరు సర్ప్రైజ్ అవుతారు. అసలు ఈ పాయింట్ ని ఇంతకాలం ఎందుకు ఎవరూ టచ్ చేయలేదు అనే ప్రశ్న మీలో మొదలవుతుంది. ఈ సినిమాలో మేము మెసేజ్ ఇవ్వడం లేదు.. కానీ కావలసినవారు అందులో నుంచి మెసేజ్ తీసుకోవచ్చు. మొదటి సగం ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. తర్వాత సగం రేసింగ్ గా ఉంటుంది. ఈ సినిమా గురించి ఒక మాటలో చెప్పాలి అంటే అన్ ప్రిడక్టబుల్ మూవీ” అంటూ తెలిపారు విశ్వక్ సేన్. అలాగే డైరెక్టర్ గురించి మాట్లాడుతూ.. “రవితేజ చాలా స్మార్ట్ డైరెక్టర్. ఈ కథని తీయగలుగుతాడని బలంగా నమ్మాను. కాబట్టే ఈ సినిమా అతని చేతిలో పెట్టాను. ఇది ట్రూ ఇన్సిడెంట్ ని బేస్ చేసుకుని తీసిన సినిమా. అయితే ఆ ఇన్సిడెంట్ ఏంటి?అనేది మీకు సినిమాలోనే తెలుస్తుంది” అంటూ తెలిపారు. ఇకపోతే ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం అందించారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×