Meenakshi Choudhary: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎవరికి ఎప్పుడు ఎలాంటి అవకాశాలు వస్తాయి అని ఎవరు ఊహించలేరు. కొన్ని సందర్భాలలో హీరోయిన్స్ కి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు పడినా కూడా వాళ్ళకి సరైన అవకాశాలు రావు. ఇంకొంతమందికి ప్లాప్ సినిమాలు పడిన వరుసగా అవకాశాలు వస్తూనే ఉంటాయి. సుశాంత్ నటించిన ఇచట వాహనములు నిలపరాదు సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది మీనాక్షి చౌదరి. వాస్తవానికి ఆ సినిమా వచ్చినట్లు కూడా చాలామందికి తెలియదు. ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ హాజరయ్యారు. సినిమా రిలీజ్ అవ్వకముందే ఆమెను విపరీతంగా పొగిడారు. తమ సినిమాలో కూడా చేయమని అప్పుడే ఆన్ స్టేజ్ పై అడిగాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. సినిమా ఫలితం తేడా కొట్టినా కూడా మీనాక్షి చౌదరికి వరుసగా అవకాశాలు వచ్చాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన గుంటూరు కారం సినిమాలో కూడా కీలక పాత్రలో కనిపించింది మీనాక్షి చౌదరి. కేవలం గుంటూరు కారం మాత్రమే కాకుండా ఇప్పుడు పలు సినిమాలలో కూడా మీనాక్షి చౌదరి కనిపిస్తుంది. మీనాక్షి నటించిన సినిమాలు వరుసగా రిలీజ్ అవుతూనే ఉన్నాయి.
వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన లక్కీ భాస్కర్ సినిమాలో హీరోయిన్ గా నటించిన మీనాక్షి చౌదరి. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించింది. ఇక మీనాక్షి చేసిన మెకానిక్ రాకి సినిమా నవంబర్ 22న రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ సినిమాలతో పాటు అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ నటిస్తున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో కూడా మీనాక్షి చౌదరి ఒక కీలక పాత్రలో కనిపిస్తుంది. అయితే ఈ సినిమాలో మీనాక్షి చౌదరి పోలీస్ ఆఫీసర్గా కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. ఇక రీసెంట్గా జరిగిన ఈ సినిమా ఈవెంట్ లో మీనాక్షి చౌదరి మాట్లాడుతూ నా జీవితంలో ఫస్ట్ ఫుల్ లెన్త్ కామెడీ రోల్ చేస్తున్న అంటూ చెప్పుకొచ్చింది. అనిల్ రావిపూడి ఇదివరకే సుప్రీం అనే సినిమాలో బెల్లం శ్రీదేవి అనే పాత్రను రాశి ఖన్నాతో చేయించి థియేటర్లో నవ్వులు పువ్వులు పూజించాడు. మళ్లీ మీనాక్షి తో అదే స్థాయిలో కామెడీ ఉంటుందని చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అలానే అంతకుమించి అనిల్ ఇంకేమైనా ప్లాన్ చేశాడని కొంతమంది క్యూరియాసిటీ కూడా ఉంది.
Also Read : Actor Prabhas : అనిల్ రావిపూడి అంటే కామెడీ సినిమాలు చేస్తాడు అతనా.?
విక్టరీ వెంకటేష్ ఇప్పటికే అనిల్ రావిపూడి తో చేస్తున్న మూడవ సినిమా ఇది. ఇదివరకే వీరి కాంబినేషన్లో వచ్చిన ఎఫ్2, ఎఫ్3 సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘన విజయాలు సాధించాయి. ఇక ప్రస్తుతం సంక్రాంతికి వస్తున్నాం సినిమా సంక్రాంతి బరిలో దిగుతుంది. మామూలుగా విక్టరీ వెంకటేష్ కి ఉన్న ఫ్యామిలీ ఆడియన్స్ ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాకి మినిమం యావరేజ్ టాక్ వచ్చినా కూడా ఎఫ్2 రేంజ్ లో కలెక్షన్లు రాబట్టడం ఖాయం. ఈ సినిమాను జనవరి 14న రిలీజ్ చేయబోతున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది చిత్ర యూనిట్.