BigTV English

Sankranti release films: అప్పుడు మైత్రి కి టైం వచ్చింది, ఇప్పుడు దిల్ రాజుకు వచ్చింది

Sankranti release films: అప్పుడు మైత్రి కి టైం వచ్చింది, ఇప్పుడు దిల్ రాజుకు వచ్చింది

Sankranti release films: దిల్ రాజు ఈ పేరు గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇంకా మాట్లాడితే ఇది ఒక పేరు కాదు బ్రాండ్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పైన దిల్ రాజు ఇప్పటివరకు ఎన్నో సినిమాలను నిర్మించారు. దాదాపు ఈ బ్యానర్ లో ఇప్పటివరకు 50 సినిమాలుకు పైగా వచ్చాయి. పది నుంచి 20 మంది కొత్త డైరెక్టర్లు ఈ బ్యానర్ నుంచి పరిచయమయ్యారు. సుకుమార్, బొమ్మరిల్లు భాస్కర్, శ్రీకాంత్ అడ్డాల, వంశీ పైడిపల్లి వంటి దర్శకులు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో నేడు ఏ స్థాయిలో ఉన్నారు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక సుకుమార్ అయితే ఇండియన్ సినిమాని రాజమౌళి తర్వాత రూల్ చేస్తున్నారు అని చెప్పాలి. ఒకప్పుడు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ నుంచి ఒక సినిమా వస్తుంది అంటేనే ఏమీ ఆలోచించకుండా ఫ్యామిలీ ఆడియన్స్ అంతా కూడా థియేటర్కు వెళ్లిపోయే వాళ్ళు. రీసెంట్ టైమ్స్ లో ఈ బ్యానర్ నుంచి క్వాలిటీ సినిమాలో రావడం పూర్తిగా తగ్గిపోయింది. ఇప్పుడు తన ప్లేసుని సితార ఎంటర్టైన్మెంట్స్ నాగ వంశీ భర్తీ చేస్తున్నాడు అని దిల్ రాజు కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి.


ఏదేమైనా కూడా ప్రతి సంక్రాంతికి దిల్ రాజు సినిమా ఒకటి వస్తూనే ఉంటుంది. గతేడాది అది బాక్స్ ఆఫీస్ వద్ద మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య, నందమూరి బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమాలు విడుదలయ్యాయి. ఈ రెండు సినిమాలను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది. అయితే మైత్రి మూవీ మేకర్స్ కేవలం సినిమాలను నిర్మించడం మాత్రమే కాకుండా వాళ్లకు థియేటర్స్ ఇష్యూస్ వస్తున్నాయి అని చెప్పి డిస్ట్రిబ్యూషన్ కూడా మొదలుపెట్టింది. వాళ్లకు ఉండాల్సిన థియేటర్స్ కూడా కొన్ని ఉన్నాయి. ఆ థియేటర్స్ లో ఈ రెండు సినిమాలను రిలీజ్ చేశారు. ఇక అదే టైంలో తమిళ్ స్టార్ హీరో విజయ్ వారసుడు అనే సినిమాను చేసి రిలీజ్ చేశాడు దిల్ రాజు. అయితే ఇప్పుడు దిల్ రాజు ఈ సంక్రాంతికి రెండు సినిమాలను ప్లాన్ చేస్తున్నాడు. వాస్తవానికి ఒక సినిమా డిసెంబర్ నెలలో రిలీజ్ అవ్వాల్సిన కూడా దానిని సంక్రాంతికి పోస్ట్ పోన్ చేశాడు దిల్ రాజ్.

Also Read : Meenakshi Choudhary: నా జీవితంలో ఫస్ట్ టైం కామెడీ రోల్ చేస్తున్నాను


శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ తేజ్ హీరోగా నటిస్తున్న గేమ్ చేజర్ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ కానుంది. వాస్తవానికి ఈ డేటుకు మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమా రిలీజ్ కావలసి ఉంది. అయితే గేమ్ చేంజర్ సినిమా వస్తుండడంతో ఆ సినిమా పోస్ట్ పోన్ అయింది. సంక్రాంతికి ఈసారి దిల్ రాజు రెండు సినిమాలతో ప్రేక్షకులు ముందుకు వస్తున్నారు. సంక్రాంతి బరిలో అన్నిటికంటే ముందు ప్రేక్షకులు ముందుకు రానున్న సినిమా గేమ్ చేంజెర్. ఈ సినిమా జనవరి 10న రిలీజ్ కానుంది దాదాపు 70% థియేటర్స్ ఈ సినిమాకు కేటాయించనున్నారు. అలానే నందమూరి బాలకృష్ణ నటిస్తున్న డాకు మహారాజ్ సినిమా, అజిత్ నటిస్తున్న గుడ్ బాడ్ అగ్లీ సినిమా కూడా రిలీజ్ అవుతుంది. అయితే జనవరి 14న సంక్రాంతికి వస్తున్నాం సినిమా రిలీజ్ అవుతుంది. అయితే అప్పటికే గేమ్ చేంజెర్ సినిమా కోసం కేటాయించిన థియేటర్స్ ను ఈ సినిమాకి ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. ఏదేమైనా అప్పుడు మైత్రి మూవీ మేకర్స్ చేసినట్లు ఇప్పుడు రెండు సినిమాలతో దిల్ రాజు సంక్రాంతి బరిలో దిగుతున్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×