Vishwambhara: ఈరోజుల్లో సినిమాల్లోని ప్రతీ అంశాన్ని ప్రేక్షకులు చాలా శ్రద్ధతో చూస్తున్నారు. ప్రతీ చిన్న విషయాన్ని గమనిస్తున్నారు. అందుకే మేకర్స్ కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ సినిమాలను తెరకెక్కిస్తున్నారు. అదే సీనియర్ హీరోల సినిమాలంటే ఆ జాగ్రత్తలు మరింత ఎక్కువగానే ఉండాలి. కానీ ‘విశ్వంభర’ విషయంలో ఎక్కడో క్లారిటీ మిస్ అయ్యింది. వశిష్ట లాంటి యంగ్ డైరెక్టర్‌తో చిరంజీవి సినిమా అంటే కచ్చితంగా బాగానే ఉంటుందని ప్రేక్షకులు ఫిక్స్ అయిపోయారు. అంతే కాకుండా సోషియో ఫ్యాంటసీ మూవీ అనగానే దీనిపై అంచనాలు పెంచేసుకున్నారు. కానీ కొన్నాళ్ల క్రితం విడుదలయిన టీజర్‌కు నెగిటివ్ రెస్పాన్స్ రావడంతో మేకర్స్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు.
నెగిటివ్ రెస్పాన్స్
కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన ‘బింబిసార’తో దర్శకుడిగా పరిచయమయ్యాడు వశిష్ట (Vassishta). దర్శకుడిగా ఉన్నది ఒక సినిమా అనుభవమే అయినా తన సినిమాను డైరెక్ట్ చేసే ఛాన్స్ ఇచ్చాడు చిరంజీవి (Chiranjeevi). యంగ్ దర్శకులు అయితే సీనియర్ హీరోలను కరెక్ట్‌గా చూపిస్తారని ఈ కాంబినేషన్‌పై ప్రేక్షకులు భారీగానే అంచనాలు పెంచేసుకున్నారు. సోషియో ఫ్యాంటసీ సినిమా అనగానే ఏకంగా ‘అంజి’ రేంజ్‌లో ఊహించుకున్నారు. ‘విశ్వంభర’ (Vishwambhara) నుండి విడుదలయిన పోస్టర్స్ కూడా కాస్త పరవాలేదనే అనిపించాయి. కానీ ఒకేసారి టీజర్ విడుదలయిన తర్వాత మాత్రం ఒక్కసారిగా ప్రేక్షకుల దగ్గర నుండి నెగిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అందుకే గ్రాఫిక్స్ విషయంలో మేకర్స్ ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.
Also Read: అప్పుడే మొదలు.. చిరంజీవితో సినిమాపై అనిల్ రావిపూడి క్రేజీ అప్డేట్..
మంచి నిర్ణయం
మామూలుగా ఫ్యాంటసీ సినిమా అంటే గ్రాఫిక్స్ అనేవి చాలా ముఖ్యం. కానీ ‘విశ్వంభర’లోని గ్రాఫిక్స్ ఎలా ఉంటాయో టీజర్‌తోనే అర్థం చేసుకున్నారు ప్రేక్షకులు. ఈ మూవీలోని గ్రాఫిక్స ఎలా ఉంటాయో క్లారిటీ వచ్చేసింది. టీజర్ విడుదలవ్వగానే దానికి వచ్చిన టాక్‌ను మేకర్స్ సైతం గమనించారు. అందుకే సినిమా విడుదల ఆలస్యం అయినా కూడా ప్రస్తుతం దీనిపై పనిచేస్తున్న సీజీ టీమ్‌ను తొలగించి కొత్త టీమ్‌ను రంగంలోకి దించాలని మేకర్స్ నిర్ణయించుకున్నట్టు టాలీవుడ్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇది విన్న ప్రేక్షకులు చాలా మంచి పని చేశారంటూ మూవీ టీమ్‌ను ప్రశంసిస్తున్నారు. ఇదే కరెక్ట్ అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
వెనక్కి తప్పుకున్నాడు
అసలైతే ‘విశ్వంభర’ సినిమా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ అదే సమయంలో మూవీ ఇంకా పూర్తి కాకపోవడంతో, అంతే కాకుండా రామ్ చరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్’ కూడా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకోవడంతో తానే స్వయంగా వెనక్కి తప్పుకున్నారు చిరంజీవి. ప్రస్తుతం ఇంకా దీని కొత్త రిలీజ్ డేట్‌పై పూర్తిస్థాయిలో క్లారిటీ లేదు. ఎలాగైనా ప్రేక్షకులు మెచ్చేలా గ్రాఫిక్స్‌లో మార్పులు చేసి దీనిని సమ్మర్‌లో అయినా విడుదల చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ‘విశ్వంభర’లో చిరంజీవికి జోడీగా త్రిష నటిస్తోంది. ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతాన్ని అందిస్తుండగా యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది.