Intinti Ramayanam Today Episode January 4th : నిన్నటి ఎపిసోడ్ లో.. చెంచులమ్మ అవని మాయలో పడేసి అసలు నిజం చెప్పకుండా పోయిందని పార్వతి బాధపడుతూ ఉంటుంది. ఇక తన మనసు కుదుటపడేలా లేదని పార్వతి తన అత్తయ్యని తీసుకొని గుడికి పోతుంది. ఇంట్లో అవని చేసే ఆగడాలను ఎవరూ బయట పెట్టలేకున్నారు నేనే ఇంటి బాధ్యతను తీసుకుంటాను అవని మాయలో ఎవరు పడకుండా నా ఇంటిని నేనే కాపాడుకుంటానని దేవుడి దగ్గర మొక్కుకుంటుంది. శ్రీకర్, శ్రీయాలు ఇంటికొస్తే బాగుండని కోరుకుంటుంది. ఇక శ్రీకరు శ్రియాలు గుడికి వస్తారు. గుడికి తీసుకొస్తున్నానని ఒక మాట నాకు ముందే చెప్తే గుడికి ఏదో ఒక ప్రసాదం చేసుకొని వస్తాను కదా అనేసి శ్రియ అంటుంది కానీ నాన్నకు బాగలేదన్న విషయం తెలియగానే నా మనసులో లేదు అందుకే గుడికొద్దామని అనుకున్నాను అని శ్రీకర్ అంటాడు అంతలోకే గుడి నుంచి బయటికి అవని,భానుమతిలు వస్తారు. బయట ఉన్న తన కోడలు కొడుకుని చూసి పార్వతీ సంతోషపడుతుంది.. ఇక ఇంట్లోకి ఎప్పుడు రానిస్తారు అని అడుగుతుంది. ఇక ఇంటికి వస్తుంది. పల్లవికి పార్వతి నగలు ఇవ్వాలని అనుకుంటుంది. అవనిని అవమానిస్తుంది. అవని రూంలోకి వెళ్లి ఏడుస్తుంది. అత్తయ్య ఒకప్పుడు నన్ను బాగా చూసుకొనేది. కానీ ఇప్పుడు పట్టుంచుకోవడం లేదని బాధ పడుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ఒకప్పుడు అత్తయ్య నేనేం చెప్తే అదే అన్నట్టు నా మీద చాలా నమ్మకం ఉండేది నన్ను చాలా ప్రేమగా చూసుకునేది నా మాట కాదని ఏది చేసేది కాదు కానీ ఇప్పుడు నన్ను పట్టించుకోవడమే లేదు నేను చేసిన చిన్న తప్పు గురించి నేను చెప్పాను క్షమాపణ అడిగాను కనీసం నాతో మాట్లాడడానికి కాదు కదా నా మొహం చూడడానికి కూడా అత్తయ్య ఇష్టపడటం లేదండి అని అక్షయకు చెప్తుంది. పనికి అక్షయ్ నువ్వు మా అమ్మ గురించి నాకు కంప్లైంట్స్ ఇస్తున్నావా అని అడుగుతాడు. నేను కంప్లైంట్ ఇవ్వడం లేదండి అత్తయ్య గురించి చెప్తున్నాను అంతే అని అంటుంది. ఒకప్పుడు నీతో మంచిగా ఉందని నువ్వే నాకు చాలాసార్లు చెప్పావు ఇప్పుడు నిన్ను దూరం పెడుతుందని అంటున్నావ్ దానికి కారణం కూడా నువ్వే కదా నువ్వు చేస్తున్న పనిలే మా అమ్మకి నచ్చడం లేదు అందుకే నేను దూరం పెట్టేసిందేమో ఏదైనా ఉంటే మీరు మీరు వెళ్లి చూసుకోవాలి కాని నాకు చెప్పకూడదు అనేసి కోపంగా వెళ్ళిపోతాడు.
బయట కమల్ అక్షయ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు కానీ అక్షయ్ పట్టించుకోకుండా కోపంగా వెళ్ళిపోతాడు. ఎందుకు ఇంత కోపంగా ఉన్నాడు లోపలి నుంచి రావడమే కోపంగా వచ్చాడు కదా ఒకసారి వదినను అడిగి తెలుసుకుందామని లోపలికి వెళ్తాడు. అవని ఏడుస్తూ ఉంటే, ఏమైంది వదినా అని అడుగుతాడు. మీ అన్నయ్య ఎప్పుడు నాది తప్పు అంటాడు కమల్ ఏం చెప్పినా నాదే తప్పు అంటాడు నా గురించి అత్తయ్యకు చాడీలు చెప్తున్నారు అన్న కూడా నాదే తప్పు అని అంటున్నారు అన్నిటికీ నన్నే బాధ్యతలని చేసి బాధ పెడుతున్నాడు అనేసి అంటుంది. నీకు అమ్మకు లేనిపోనివి చెప్తున్నారా చాడీలు చెప్పి మీ ఇద్దరిని దూరం చేస్తున్నారా? ఎవరు వదిన అసలు ఈ రోజు వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు చంపేస్తాను అని బయటకు వస్తాడు. బయట అందర్నీ పిలుస్తాడు. మా వదిన ని ఎవరైనా ఏడిపిస్తే నేను ఊరుకోను చంపేస్తాను అని అనగానే భానుమతి అయితే ఇప్పుడు నువ్వు నన్ను చంపేస్తావని దొరుకుతుంది. కమల్ భానుమతిని ఆట ఆడుకుంటాడు. మా అమ్మకు వదినకు మధ్య పుల్లలు పెడుతున్నావా నువ్వు చంపేస్తాను ఈరోజు నువ్వు ఆపిన ఆగను వదినా అని అంటాడు. ఇక అవని నేను చెప్పిన ఆగవా వెల్లు లోపలికి అనేసి గట్టిగా అరుస్తుంది. కమల్ వెళ్ళిపోతాడు.
పార్వతి శ్రియకు నగ ఇవ్వాలని బయటకు వస్తుంది. అత్తయ్య ఇంకా రాలేదు ఏంటి శ్రీకర్ చాలా సేపు అయింది కదా పిలిచి అని అనగానే నీకు నాకు ఇవ్వాలి కదా అందుకని రమ్మని చెప్పిందేమో అని శ్రీకర్ అంటాడు. అప్పుడే పార్వతి అక్కడికి వచ్చి శ్రియకు నగ ఇస్తుంది. కారులో నెక్లేస్ ఉందని చూసి దొంగతనం చేయాలని అనుకుంటాడు. పోలీసు రావడం చూసి మళ్లీ ఆ కారులోనే దాన్ని వేసేస్తాడు. పార్వతి ఎవరు నువ్వు అని అడిగితే అక్షయకు నేను మేనమామ ని ఈ నిజాన్ని బయట చెప్పకుండా ఉండడానికి మీ ఆయన నాకు ఎంత అడిగితే అంత డబ్బులు ఇస్తున్నాడు ఇక నువ్వు ఇస్తావా లేదా నిజం చెప్పమంటావా అని బెదిరిస్తాడు.. పార్వతి అనాగే ఇచ్చేస్తుంది ఇక పల్లవి చక్రధర్లు దయాకర్ కోసం వెయిట్ చేస్తుంటారు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. సోమవారం ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…