BigTV English

Billionaires Living Poor life: పాత బట్టలు.. సెకండ్ హ్యాండ్ వాహనాలు.. పేదల్లా బతుకుతున్న ఈ కోటీశ్వరులు?

Billionaires Living Poor life: పాత బట్టలు.. సెకండ్ హ్యాండ్ వాహనాలు.. పేదల్లా బతుకుతున్న ఈ కోటీశ్వరులు?

Billionaires Living Poor life| బిలియనీర్లంటే భారీ భవంతుల్లో ఉంటారనీ, లగ్జరీ కార్లల్లో ప్రయాణిస్తారని అనుకుంటాం. లక్షల విలువైన దుస్తులు ధరిస్తారని భావిస్తాం. కానీ నేటి తరం బిలియనీర్లు మాత్రం కోట్లు ఉన్నా కూడా మధ్యతరగతి, దిగుమధ్య తరగతి మాదిరిగా జీవిస్తు్న్నారు. హంగూఆర్భాటాలు, దుబారా ఖర్చులు లేకుండా అత్యంత సామాన్యంగా జీవిస్తు్న్నారు. ఇలాంటి వారిలో ముందు వరుసలో ఉండే వ్యక్తి షాంగ్ సావేడ్రా.


నేటి సోషల్ మీడియాలో జనాలు తమ డాబుదర్పాలను ప్రదర్శించడం సాధారణ విషయమైపోయింది. ముఖ్యంగా ఇన్‌ఫ్లుయెన్సర్లు చేసే హంగూఆర్భాటాల కారణంగా వారి ఫాలోవర్లపై తీవ్ర ప్రభావం పడుతోంది. అదే లైఫ్ స్టైల్ ఫాలో కావాలన్న యావలో అనేక మంది నేల విడిచి సాము చేస్తూ కష్టాలపాలవుతున్నారు. ఈ ప్రమాదకర ధోరణికి ముగింపు పలకాలని నడుం కట్టిన కొందరు బిలియనీర్లు ఇలా సాదాసీదా జీవనవిధానాన్ని అనుసరిస్తున్నారు. ఇన్‌ఫ్లుయెన్సర్లకు మించి ఆస్తిపాస్తులున్నా సామాన్యుల్లా ఉంటూ యువతకు సరైన మార్గం చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.

Also Read : డబ్బుల కోసం వ్యభిచారం చేస్తున్న టీచర్లు, డాక్టర్లు.. ఆ దేశంలో దిక్కుతోచని స్థితిలో మహిళలు!


పెద్ద వ్యాపారవేత్త అయిన ‘షాంగ్ సావెడ్రా’ ఇదే మార్గంలో పయనిస్తూ పొదుపు మంత్రం పఠిస్తున్నారు. షాంగ్ సావెడ్రా హార్వార్డ్‌ యూనివర్సిటీలో చదువుకున్నారు. ఆమె ఓ ఫైనాన్స్ బ్లాగర్ కూడా. మిలియన్ల డాలర్ల (వందల రూ.కోట్ల) సంపద సొంతం చేసుకున్నా కూడా ఆమె తన భర్తతో కలిసి కేవలం ఒక 4 బెడ్ రూంలు ఉన్న ఇంట్లో నివసిస్తుంటారు. వారిద్దరూ 16 ఏళ్ల నాటి పాత కారునే వినియోగిస్తున్నారు. వారి పిల్లలు కూడా సెకెండ్ హ్యాండ్ దుస్తులనే ఎక్కువగా వినియోగిస్తారు. ఫేస్‌బుక్ మార్కెట్లో కొనుగోలు చేసిన తక్కువ ధర బొమ్మలతో ఆడుకుంటారు. తమ వద్ద ఉన్న సొమ్మును వారు చిన్న పిల్లల చదువులు, పెట్టుబడులు, దానధర్మాలు వంటివాటిపై ఖర్చు చేస్తున్నారు. అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుంటారు.

‘‘నాకూ ఒక్కోసారి లగ్జరీ ఐటెమ్స్ కొనుగోలు చేయాలనిపిస్తుంది. దీంతో, అప్పుడప్పుడూ ఫ్యాన్సీ డేట్స్‌పై వెళుతుంటాము’’ అని ఆమె చెప్పుకొచ్చారు.

అలాగే ‘ఆనీ కోల్‌’ది కూడా ఇదే పంథా. ఆమె ఓ కాంట్రాక్ట్ రీసెర్చర్. పర్సనల్ ఫైనాన్స్ కోచ్‌గా కూడా పనిచేస్తున్నారు. మహిళలు తమంతట తాముగా ఆర్థిక వ్యవహారాలు చక్కబెట్టుకోవడంలో తర్ఫీదునిస్తుంటారు. ఆమె పేరిట 1 బిలియన్ డాలర్ల ఆస్తులున్నా కూడా అత్యంత సాదాసీదా జీవనశైలి అనుసరిస్తుంటారు. ఆమె నెల ఖర్చు కేవలం 4 వేల డాలర్లు. అక్కడి సగటు ఖర్చుతో పోలిస్తే ఇది స్వల్పమే. అదనపు ఖర్చులు తగ్గించుకోవాలనే ఉద్దేశంతో ఆమె కొన్నేళ్ళ క్రితమే తన కారును అమ్మేశారు. ఇక వారానికోసారి వంట వండుకుని, తన జుట్టును తానే కత్తిరించుకుని వీలైనంతగా పొదుపు చేస్తుంటారు.

ఏటా మూడు సార్లు మాత్రమే షాపింగ్‌‌కు వెళ్లే కోల్.. సాధారణంగా సెకెండ్ హ్యాండ్ దుస్తులనే కొంటారు. హైకింగ్, స్విమ్మింగ్ లాంటి ఖర్చులేని వాటినే తన హాలిడే పర్యటనల్లో భాగం చేసుకుంటారు. ఇక విమానాల్లో భర్తతో ప్రయాణించేటప్పుడు కూడా వీలైనంత వరకూ ఎయిర్‌లైన్స్ సంస్థ ఉచిత ఆఫర్లను వినియోగిస్తుంటారు.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×