BigTV English
Advertisement

Anil Ravipudi: అప్పుడే మొదలు.. చిరంజీవితో సినిమాపై అనిల్ రావిపూడి క్రేజీ అప్డేట్..

Anil Ravipudi: అప్పుడే మొదలు.. చిరంజీవితో సినిమాపై అనిల్ రావిపూడి క్రేజీ అప్డేట్..

Anil Ravipudi: మెగాస్టార్ చిరంజీవి గత కొన్నిరోజులుగా తన రూటు మార్చారు. సీనియర్ దర్శకులతో కాకుండా యంగ్ డైరెక్టర్స్ అయితేనే తనకు హిట్లు ఇస్తారని ఫిక్స్ అయిపోయారు. అందుకే బ్యాక్ టు బ్యాక్ యంగ్ డైరెక్టర్స్‌తో వర్క్ చేయడానికి సిద్దమవుతున్నారు. ఆయన చివరిగా హీరోగా నటించిన ‘భోళా శంకర్’ మూవీ ఆయన కెరీర్‌లోనే అతిపెద్ద డిశాస్టర్‌గా నిలిచింది. అందుకే ఇప్పుడు కేవలం యంగ్ డైరెక్టర్స్‌తోనే వర్క్ చేయాలని డిసైడ్ అయ్యారు. అలా మరొక యంగ్ డైరెక్టర్ అయిన అనిల్ రావిపూడికి కూడా ఛాన్స్ ఇచ్చారు చిరు. ఇప్పటికీ వీరి కాంబినేషన్‌లో మూవీ ఉంటుందని కన్ఫర్మ్ అయినా తాజాగా దీని గురించి ఆసక్తికర అప్డేట్ అందించారు అనిల్ రావిపూడి.


ఇద్దరూ బిజీ

అనిల్ రావిపూడి (Anil Ravipudi), చిరంజీవి (Chiranjeevi) కాంబినేషన్‌లో సినిమా ఉంటుందనే విషయం చాలాకాలం క్రితమే బయటపడింది. ఈ విషయాన్ని అనిల్ కూడా చాలాసార్లు దాదాపుగా కన్ఫర్మ్ చేసినట్టుగానే మాట్లాడాడు. కానీ ప్రస్తుతం చిరంజీవితో పాటు అనిల్ రావిపూడికి కూడా కమిట్మెంట్స్ ఉన్నాయి. ప్రస్తుతం తను ‘సంక్రాంతికి వస్తున్నాం’ రిలీజ్‌లో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే వెంకటేశ్, అనిల్ రావిపూడిది హిట్ కాంబినేషన్ అని ప్రేక్షకులు ఫిక్స్ అయిపోయారు. ఇప్పటికే వీరి కాంబోలో ‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’ వంటి రెండు సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు మరో హ్యాట్రిక్ హిట్ రెడీ అవుతుందని ప్రేక్షకులు నమ్ముతున్నారు. ఈ మూవీ ప్రమోషన్స్ సమయంలోనే చిరు సినిమాపై కామెంట్స్ చేశాడు అనిల్ రావిపూడి.


Also Read: చిరంజీవి డైరెక్టర్ గా చేసిన ఒకే ఒక్క సినిమా.. హిట్ కొట్టిందా..?

స్క్రిప్ట్ ఓకే

ప్రస్తుతం చిరంజీవి చేతిలో వశిష్ట దర్శకత్వంలో నటిస్తున్న ‘వశిష్ట’ ఉంది. అలాగే అనిల్ రావిపూడి కూడా ‘సంక్రాంతికి వస్తున్నాం’ విడుదలయ్యే వరకు ఫ్రీ అవ్వలేడు. సంక్రాంతి కానుకగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో వెంకటేశ్, మీనాక్షి చౌదరీ, ఐశ్వర్య రాజేశ్‌తో పాటు అనిల్ రావిపూడి కూడా బిజీ అయ్యాడు. అలా పలు ఇంటర్వ్యూలు ఇస్తూ ‘సంక్రాంతికి వస్తున్నాం’ను ప్రమోట్ చేస్తున్నాడు ఈ దర్శకుడు. అందులో భాగంగానే చిరంజీవితో చేసే సినిమా గురించి అప్డేట్‌ను ప్రేక్షకులతో పంచుకున్నాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయని అన్నాడు.

కామెడీనే బలం

ఇప్పటికే తాను చిరంజీవిని కలిసి ఎలాంటి సినిమా చేస్తే బాగుంటుందని చర్చించానని బయటపెట్టాడు అనిల్ రావిపూడి. అంతే కాకుండా ఈ చర్చలు ఇంకా మొదటి దశలోనే ఉన్నాయని అన్నాడు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ విడుదలయిన తర్వాత దీనిపై ఎక్కువగా ఫోకస్ చేసి, ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్తామని తెలిపాడు. కామెడీ జోనర్‌లో సినిమాలు తెరకెక్కించి హిట్ కొట్టడంలో తనకు తాను సాటి అని నిరూపించుకున్నాడు అనిల్ రావిపూడి. అలాగే బ్యాక్ టు బ్యాక్ తన బలాన్ని వదలకుండా హిట్స్ కొడుతూ వచ్చాడు. ఇప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’పై కూడా ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అయ్యింది. చిరు సినిమా కూడా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుందని ప్రేక్షకులు నమ్ముతున్నారు.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×