Kavya Maran: క్రికెట్ మొత్తం ఇప్పుడు వ్యాపారం అయిపోయింది. చాలామంది వ్యాపారస్తులు… క్రికెట్ లో పెట్టుబడులు పెట్టి రాణిస్తున్నారు. దీనికి తగ్గట్టుగానే ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంటులో… ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించడంతో… బిజినెస్ మ్యాన్ లు… జట్లను కొనుగోలు చేసి… డబ్బులు అర్జిస్తున్నారు. ఈ తరుణంలోనే…. సన్ గ్రూప్ ఓనర్ కావ్య పాప… హైదరాబాద్ జట్టును కొనుగోలు చేసి… దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అయితే అలాంటి కావ్య పాప… తాజాగా చోటా అంబానికి హాగ్ ఇచ్చి సందడి చేసింది.
Also Read: IPL 2025: ఐపీఎల్ 2025 నుంచి దూరం కానున్న 5 గురు ప్లేయర్లు వీళ్లే ?
ముఖేష్ అంబానీ పెద్ద కుమారుడు… ఆకాష్ అంబానీతో ( Akash Ambani ) మెరిసిన కావ్య పాప ( Kavya Maran )… అతనికి హాగ్ కూడా ఇచ్చింది. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయీ. వాస్తవంగా… ఈ సంఘటన కావాలని జరగలేదు. సౌత్ ఆఫ్రికా t20 లీగ్ సందర్భంగా జరిగింది. రెండు రోజుల కిందట… సౌత్ ఆఫ్రికా t20 టోర్నమెంట్ ఫైనల్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా… మ్యాచ్ ముంబై విజయం సాధించి ఛాంపియన్ గా నిలిచింది.
కావ్య పాపకు సంబంధించిన సన్రైజర్స్ జట్టుపై… ముంబై విజయం సాధించి చాంపియన్ గా నిలిచింది. ఈ ఫైనల్ మ్యాచ్లో ఏకంగా సన్రైజర్స్ జట్టు పైన 76 పరుగుల తేడాతో విజయం సాధించింది ముంబై. దీంతో మొదటిసారి… సౌత్ ఆఫ్రికా t20 టోర్నమెంట్ ఛాంపియన్గా నిలిచింది ముంబై. ఇక అటు వరుసగా రెండుసార్లు… కప్పు గెలుపొందిన సన్రైజర్స్… ఈసారి ఫైనల్ లో ఓడిపోయింది. దీంతో కావ్య పాప తీవ్ర నిరాశ చెందారు.
ఈ మ్యాచ్ లో ముంబై మొదట బ్యాటింగ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో నిర్ణీత 20 ఓవర్లు వాడిన ముంబై… 8 వికెట్లు నష్టపోయి 181 పరుగులు చేసింది. జట్టు సభ్యులందరూ ఉమ్మడిగా రాణించడంతో ఆ మాత్రం స్కోర్ చేయగలిగింది ముంబై. అయితే ఆ లక్ష్యాన్ని చేదించే క్రమంలో… మర్కరం టీం… దారుణంగా విఫలమైంది. మొదటినుంచి చివరి వరకు ఏ ఒక్క ఆటగాడు కూడా బ్యాటింగ్ చేసేందుకు ఆసక్తి చూపించలేదు. అసలు ఫైనల్ మ్యాచ్ ఆడినట్లే… ఏ ఆటగాడు ఆడలేదు.
Also Read: Rajal Arora: టీమిండియాలో ఉన్న ఈ లేడీ ఎవరు? ఆమె బ్యాగ్రౌండ్ ఇదే !
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్లో కేకేఆర్ చేతిలో సన్రైజర్స్ హైదరాబాద్ ఎలాగో ఓడిపోయిందో… అచ్చం ఇక్కడ కూడా అదే జరిగింది. 18.5 ఓవర్లు ఆడిన సన్రైజర్… 105 పరుగులకు ఆల్ అవుట్ అయింది. దీంతో…. అత్యంత దారుణంగా ఓడిపోయింది కావ్య పాప టీం. 76 పరుగులతో విజయం సాధించిన ముంబై ఛాంపియన్గా అవతరించింది. అయితే ఈ మ్యాచ్ అయిపోయిన తర్వాత… ఆకాష్ అంబానీతో… కాసేపు గడిపారు కావ్య పాప. ఈ సందర్భంగా ఆయనకు హగ్ ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఈ ఫోటోలు కాస్త లేటుగా వైరల్ అయ్యాయి.
Akash Ambani with Kavya Maran. 🫂 pic.twitter.com/EpTtPUgj5p
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 11, 2025