BigTV English

Indian doctor arrested: సీక్రెట్ కెమెరాలు.. ఆపై నగ్న చిత్రాలు.. 13000 వేల వీడియోలు.. ఇదీ డాక్టర్ నిర్వాకం

Indian doctor arrested: సీక్రెట్ కెమెరాలు..  ఆపై నగ్న చిత్రాలు.. 13000 వేల వీడియోలు.. ఇదీ డాక్టర్ నిర్వాకం

Indian doctor arrested: ఫారెన్‌లో చదవాలని, జాబ్ చేయాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. కొందరేమో డబ్బులు సంపాదించాలని ఫారెన్ వెళ్తారు. మరికొందరేమో మాంచి లైఫ్‌ అనుభవించాలని వెళ్తారు. ఇంకొందరు తమ పైత్యాన్ని బయటపెట్టుకుంటారు. అలాంటివారిలో ఈ ఎన్నారై డాక్టర్ ఒమెయిర్ అజాజ్ ఒకడు.


40 ఏళ్ల ఒమెయిర్ అజాజ్ వృత్తి రీత్యా డాక్టర్. అతగాడి మనసులో ఏముందో ఎవరికీ తెలీదు. కాకపోతే ఇండియా కంటే ఫారెన్ బెటరనుకున్నాడు. ఏ విషయంలో తెలీదు. అందుకు తగ్గట్టుగా 2011లో అమెరికా వెళ్లాడు. మిషిగన్ రాష్ట్రంలోని ఓక్లాండ్ కౌంటీలో ఉంటున్నాడు. జాబ్ అంతా బాగున్న తర్వాత.. తన ఆలోచనను ఇంప్లిమెంట్ చేయడం మొదలుపెట్టాడు.

ఇంతకీ కామాంధుడి డాక్టర్ ఆలోచన ఏంటో తెలుసా? సీక్రెట్‌గా పిల్లలు, మహిళలు నగ్నచిత్రాలు తీసేవాడు. వాటితో ఎంజాయ్ చేసేవాడు. ముఖ్యంగా స్నానాల గదులు, ఆసుపత్రిల గదులు, దుస్తుల మార్చుకునే ప్రాంతాల్లో సీక్రెట్ కెమెరాలను ఏర్పాటు చేసి ఎంజాయ్ చేసేవాడు. చివరికి తన ఇంట్లో కూడా.


ALSO READ: షేక్ హసీనాను మాకు అప్పగించండి.. భారత్‌కు ఆ పార్టీ డిమాండ్

చెడు చేసినవాడికీ తొలుత అంతా అనుకూలంగానే ఉంటుంది. ఆ తర్వాతే సీన్ రివర్స్ అవుతుంది. అజాజ్ విషయంలోనూ అదే జరిగింది. ఒకరు ఇద్దరు కాదు ఏకంగా 13 వేల మంది బాలికలు, మహిళలపై  తన పైత్యాన్ని ప్రదర్శించాడు. ఆసుపత్రికి వచ్చినవారిపై ఘాతుకాలకు పాల్పడ్డాడు. అపస్మారక స్థితిలో ఉన్న సమయంలో లైంగిక వేధింపులకు పాల్పడేవాడు.

అందుకు సంబందించిన వీడియోలను జాగ్రత్తగా భద్రపరుచుకునేవాడు. దాదాపు 13000 వేల వీడియోలు అతడి దగ్గర ఉన్నాయంటూ ఎలాంటి కామాంధుడో అర్థమవుతుంది. రోజురోజుకూ భర్త వ్యవహారం శృతిమించడంతో పాపం ఆ ఇల్లాలు మాత్రం ఎంతకని భరిస్తుంది. నేరుగా పోలీసులకు సమాచారం ఇచ్చింది.

రంగంలోకి దిగిన పోలీసులు తొలుత డాక్టర్ అజాజ్‌ను అదుపులోకి తీసుకుని విచారించడంతో అసలు గుట్టు బయటపడింది. అతడి నివాసం నుంచి 13 వేల వీడియోలున్న హార్డ్ డ్రైవర్, 15 ఎక్స్ టర్నల్ డివైజ్‌లను స్వాధీనం చేసుకున్నారు. 2011లో అమెరికా వచ్చిన డాక్టర్ అజాజ్, 2018 తర్వాత మిషిగన్‌లో ఉంటున్నాడు. అక్కడే పని చేస్తున్నాడు కూడా. ప్రస్తుతం డాక్టర్ లీలలపై లోతుగా విచారణ చేస్తున్నారు అమెరికా పోలీసులు.

Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×