EPAPER

Vishwambhara : మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… అనుకున్న టైమ్ కే విశ్వంభర ఆగమనం

Vishwambhara : మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… అనుకున్న టైమ్ కే విశ్వంభర ఆగమనం

Vishwambhara : మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా సోషియో ఫాంటసీ మూవీ విశ్వంభర. అయితే ఈ మూవీ వాయిదా పడుతుంది అంటూ గత కొన్ని రోజులుగా  వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా విశ్వంభర మేకర్స్ ఆ వార్తలకు ఫుల్ స్టాప్ పెడుతూ మూవీ అనుకున్న టైమ్ కే వస్తుందనే భరోసాను మెగా ఫ్యాన్స్ కు కలిగించారు.


అనుకున్న టైమ్ కే విశ్వంభర ఆగమనం 

వశిష్ట దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న భారీ యాక్షన్ అండ్ ఫాంటసీ మూవీ విశ్వంభర. ఈ సినిమాలో చిరుతో త్రిష మరోసారి రొమాన్స్ చేయనుంది. ఇందులో త్రిషతో పాటు పలువురు హీరోయిన్లు కూడా కీలక పాత్రల్లో కన్పించబోతున్నారు. ఆస్కార్ విజేత, దిగ్గజ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం విశ్వంభర షూటింగ్ చాలా వరకు పూర్తయింది, కొన్ని సన్నివేశాలు, ఒక పాట చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉంది. ఇక సినిమాపై ఉన్న భారీ అంచనాలను దృష్టిలో పెట్టుకుని చిత్రబృందం పోస్ట్ ప్రొడక్షన్, విఎఫ్ఎక్స్ పనులను కూడా చురుకుగా చేస్తోంది. ఇక మూవీకి స్టార్ట్ చేసినప్పుడు చిరు 2025 సంక్రాంతిపై కర్చీఫ్ వేసిన విషయం తెలిసిందే. 2025 సంక్రాంతికి విశ్వంభర రిలీజ్ కానుంది అని అఫిషియల్ గా అనౌన్స్ చేశారు. కానీ ఇటీవల కాలంలో వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న సినిమాల సంఖ్య పెరిగిపోవడంతో విశ్వంభర పోస్ట్ పోన్ అవుతుంది అనే రూమర్లు చక్కర్లు కొట్టాయి. తాజాగా ఆ పుకార్లకు మేకర్స్ ఫుల్ స్టాప్ పెట్టారు.


Megastar Chiranjeevi's movie 'Vishwambhara' to release on Sankranthi 2025, makers unveil new poster

సంక్రాంతికే విశ్వంభర రాక ఫిక్స్  

సినిమాకు చేయాల్సిన సీజీఐ వర్క్, టైట్ షెడ్యూల్ కారణంగా విశ్వంభర వాయిదా పడుతుందేమో అనే ఆందోళన ఉన్నప్పటికీ, దర్శకుడు వశిష్ట తన సోషల్ మీడియా ద్వారా విడుదల తేదీ మారలేదనే విషయాన్ని వెల్లడించారు. ఈ ప్రకటన సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న మెగా ఫ్యాన్స్ కు ఊరటనిచ్చింది. మరోవైపు వెంకటేష్, బాలకృష్ణ వంటి సీనియర్ప్రా హీరోలు కూడా తమ కొత్త ప్రాజెక్టు లతో సంక్రాంతిని టార్గెట్ చేయడంతో మళ్లీ 2024 సంక్రాంతి రిపీట్ కాబోతోందా ? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఏడాది సంక్రాంతికి పలు పెద్ద, మిడ్ రేంజ్ సినిమాల మధ్య విడుదల విషయంలో గట్టి పోటీ నెలకొన్న సంగతి తెలిసిందే. అన్నీ అడ్డంకులను దాటుకుని హనుమాన్ చిన్న సినిమాగా రిలీజై, హిస్టరీని క్రియేట్ చేసింది. కానీ ఈసారి కూడా అదే రిపీట్ అయితే టాలీవుడ్ లో థియేటర్ల సమస్య ఏర్పడుతుంది. మరి ఆ సమస్యను ఎలా అధిగమిస్తారో చూడాలి.  ఏది ఏమైనప్పటికీ విశ్వంభర ఎటువంటి ఆలస్యం లేకుండా జనవరి 10 రిలీజ్ కానున్నట్టు డైరెక్టర్ మరోసారి అనౌన్స్ చేశారు. “10-1-2025 విజృంభణం… విశ్వంభర ఆగమనం!!” అంటూ పుకార్లకు ఫుల్ స్టాప్ పెడుతూ ట్వీట్ చేశారు డైరెక్టర్. ఆయన ట్వీట్ తో చిరు విశ్వంభర మూవీ రిలీజ్ పై వచ్చిన పుకార్లు, నెలకొన్న అనుమానాలన్నీ తొలగిపోయాయి మెగా అభిమానులకు.

Related News

BB4: పూజా కార్యక్రమాలకు ముహూర్తం ఫిక్స్.. ఫ్యాన్స్ సిద్ధం కండమ్మా..!

Viswam Collections : హీరోగా బుట్ట సర్దే టైమ్ వచ్చింది… విశ్వం ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఎంతంటే…?

Prasanth Varma : ఇదేం స్వార్థం ప్రశాంత్ గారు… మీ కథ అయినంత మాత్రాన మీరే డబ్బులు పెట్టాలా..?

Nithiin: మళ్లీ ఆ దర్శకుడినే నమ్ముకున్న నితిన్.. హిస్టరీ రిపీట్ అయ్యేనా?

Diwali 2024: దీపావళి బరిలో టైర్ -2 హీరోలు.. టఫ్ ఫైట్ షురూ..!

Citadel Honey Bunny: తల్లి పాత్రలో సమంత.. ఫ్యామిలీ, పర్సనల్ లైఫ్‌పై కాంట్రవర్షియల్ డైలాగ్

Rashmika Mandanna : డీప్ ఫేక్ ఎఫెక్ట్… టాప్ పొజిషన్‌ను దక్కించుకున్న నేషనల్ క్రష్

Big Stories

×