Hansika Motwani.. సొట్ట బుగ్గల సుందరి హన్సిక మోత్వాని (Hansika Motwani) కూడా లైంగిక వేధింపులు ఎదుర్కొన్నానని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది. మరోవైపు రెండు తెలుగు రాష్ట్రాలలో జానీ మాస్టర్ (Johnny Master) లైంగిక వేధింపుల కేసు సంచలనం సృష్టిస్తోంది. తన దగ్గర పని చేసే మహిళా కొరియోగ్రాఫర్ పై ఆయన లైంగికంగా దాడి చేశారని ఫిర్యాదు అందడంతో జానీ మాస్టర్ పై పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయడమే కాదు, ఆమె మైనర్ గా ఉన్నప్పటి నుంచి ఆమెపై దాడి చేస్తున్నాడు అని తెలిసి జానీ మాస్టర్ పై పోక్సో కేసు కూడా రిజిస్టర్ చేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
లైంగిక వేధింపులు కూడా ఎదుర్కొన్నాను..
ఇకపోతే గత మూడు రోజులుగా పరారీలో ఉన్న జానీ మాస్టర్ ను తాజాగా అరెస్టు చేశారు. గోవాలో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అంతేకాదు నాన్ బెయిలబుల్ కేసులు కూడా నమోదు చేసినట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఢీ జడ్జ్ గా వ్యవహరిస్తున్న హన్సిక మోత్వానీ కూడా కెరియర్ లో లైంగిక వేధింపులు ఎదుర్కొన్నట్లు వెల్లడించింది. గతంలో స్వయంగా ఆమె ఇలాంటి విషయాలు వెల్లడించడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.
నాడు అవమానించిన వారే.. నేడు నా కోసం పరితపిస్తున్నారు..
ఒక ఇంటర్వ్యూ ద్వారా అభిమానులతో పంచుకునే ప్రయత్నం చేయగా.. ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో వాటిని ఎలా ఫేస్ చేసిందో కూడా చెప్పుకొచ్చింది. హన్సిక మాట్లాడుతూ.. ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు డిజైనర్స్ నాతో చాలా రూడ్ గా బిహేవ్ చేసేవారు. ఈ మోడల్ లో బట్టలు నాకు చేయిస్తారా అని అడిగితే కుదరదు అంటూ మొహం మీదే చెప్పే వాళ్ళు అయితే నాకు డిజైనర్ బట్టలు ఇవ్వను అని చెప్పిన వాళ్లే ఇప్పుడు నా కోసం డిజైనర్లుగా పని చేయడానికి ఎగబడుతున్నారు అంటూ తెలిపింది.
ఆ హీరో పై లైంగిక ఆరోపణలు..
అలాగే లైంగిక వేధింపులపై మాట్లాడుతూ ఒక హీరో నన్ను బాగా ఇబ్బందికి గురి చేశాడు. డేట్ కి వెళ్దాం వస్తావా అంటూ విసిగించేవాడు అసభ్యకరంగా తాకుతూ నన్ను చిత్రవధకు గురి చేశాడు. అయితే ఆ హీరోకి తగిన రీతిలోనే బుద్ధి చెప్పాను అంటూ తెలిపింది హన్సిక. ఇకపోతే తనకు జరిగిన అన్యాయానికి తనదైన స్టైల్ లో తిప్పి కొట్టిన ఈమె అతడి పేరు మాత్రం బయట పెట్టలేదు. దీంతో ఆ హీరో ఎవరో అంటూ అభిమానులు సైతం తెగ వెతుకుతున్నారు.మొత్తానికైతే ఈమె తెలుగులో చాలామంది హీరోలతో పనిచేసింది. అయితే ఈమె పనిచేసిన హీరోలు ఎవరు కూడా ఆ కేటగిరీకి చెందినవారు కాదు మరి ఎవరా హీరో అంటూ అభిమానుల సైతం తలమునకలవుతున్నారని చెప్పవచ్చు.
హన్సిక కెరియర్..
ఇక హన్సిక విషయానికి వస్తే.. ఒకవైపు వరుస సినిమాలలో అవకాశాలు అందుకొని, మరొకవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ నిత్యం గ్లామరస్ ఫోటోషూట్లతో యువతను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. రోజుకొక గ్లామర్ ట్రీట్ అందిస్తూ యువతను రెచ్చగొడుతున్న ఈమెకు సోషల్ మీడియాలో విపరీతంగా ఫాలోవర్స్ ఉన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఢీ షో కి జడ్జిగా కూడా వ్యవహరిస్తోంది.