BigTV English
Advertisement

Viswam Title Teaser Out: గోపీచంద్- శ్రీను వైట్ల సినిమా టైటిల్ టీజర్ వచ్చేసింది!

Viswam Title Teaser Out: గోపీచంద్- శ్రీను వైట్ల సినిమా టైటిల్ టీజర్ వచ్చేసింది!

Gopichand- Srinu Vaitla’s  Viswam Movie Update Title Teaser: మ్యాచో హీరో గోపీచంద్ కు పడి చాలాకాలం అయ్యింది. ఈ మధ్య భీమా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన గోపీచంద్.. బ్లాక్ బస్టర్ హిట్ ను అయితే అందుకోలేకపోయాడు. ఆయినా వెనుతిరగకుండా ప్రేక్షకులను మెప్పించడానికి కష్టపడుతూనే ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే ఈసారి ఒకప్పటి స్టార్ డైరెక్టర్ తో చేతులు కలిపాడు. ఎన్నో మంచి సినిమాలతో స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న శ్రీను వైట్ల గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న విషయం తెల్సిందే. ఈ మధ్యనే శ్రీను వైట్ల.. గోపీచంద్ తో ఒక సినిమాను ప్రకటించాడు.


పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను నిర్మిస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా టైటిల్ టీజర్ ను నేడు మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి విశ్వం అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు తెలుపుతూ ఒక వీడియోను రిలీజ్ చేశారు. మొదట నుంచి గోపీచంద్ సెంటిమెంట్.. అతని టైటిల్స్ చివరిలో సున్నా ఉండడం. ఇప్పుడు కూడా అదే సెంటిమెంట్ ను ఫాలో అయ్యినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ టీజర్ వీడియో ఆద్యంతం ఆకట్టుకుంటుంది.

ఒక పెళ్లి జరుగుతుండగా.. మధ్యలో గోపీచంద్ స్టైలిష్ లుక్ లో వస్తూ ఉండడం చూపించారు. ఇంకోపక్క వంటలను వండడం చూపించారు. పెళ్లి తంతు జరిగాకా గోపీచంద్.. వారందరిని చంపేసి.. ఆ వంట తినడానికి వెళ్తాడు. అక్కడ బిర్యానీ తింటూ.. ప్రతి మెతుకు మీద తినేవాడి పేరు రాసి ఉంటుంది.. ఈ భోజనం మీద నా పేరు రాసి ఉంది అని హిందీలో చెప్పే డైలాగ్ తో ఈ వీడియో ముగిసింది. ఇక ఈ వీడియోను బట్టి ఈసారి కూడా గోపీచంద్ కొత్త కథనే ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా చైతన్య భరద్వాజ్ నేపధ్య సంగీతం ఆకట్టుకుంటుంది. ఈ చిత్రంలో గోపీచంద్ సరసన కావ్య థాపర్ నటిస్తోంది. మరి ఈ సినిమాతో గోపీచంద్- శ్రీను వైట్ల ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.


Also Read: Aavesham: మలయాళ ఇండస్ట్రీ.. మరో హిట్ పట్టేసింది మావా..

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×