Deepika padukone: ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే (Deepika Padukone) ఈమధ్య కాలంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. ఎప్పుడైతే ప్రభాస్ (Prabhas ) ‘స్పిరిట్’ మూవీలో హీరోయిన్ గా అవకాశం అందుకొని, ఆ తర్వాత తప్పుకోవడం, అనవసరంగా చేసుకున్న అగ్రిమెంట్ ను పక్కనపెట్టి మరీ సినిమా స్టోరీని లీక్ చేయడం లాంటి తదితర కారణాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంది. అయితే ఆ తర్వాత తన మనసుకు నచ్చిందే చేస్తానని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది. అయితే ఇలాంటి సమయంలో ప్రముఖ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి (Vivek agnihotri)ఏకంగా పబ్లిక్ లో ఈమె పరువు తీసేలా కామెంట్లు చేయడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
దీపికా పరువు తీసిన డైరెక్టర్..
అసలు విషయంలోకి వెళ్తే.. జే. ఎన్.యూ. ప్రొటెస్ట్ లో పాల్గొన్న వివేక అగ్నిహోత్రి కి దీపికా గురించి ప్రశ్న ఎదురవ్వగా.. వివేక్ అగ్నిహోత్రి మాట్లాడుతూ..” కచ్చితంగా అక్కడ ఏం రాజకీయం జరుగుతుందో దీపికకు తెలియదని అభిప్రాయపడ్డారు. కేవలం పీఆర్ టీమ్ చెప్పిందని మాత్రమే ఆమె అక్కడికి వెళ్ళింది. అసలు ఎక్కడికి వెళ్తుంది? ఏం చేస్తుందో ? కూడా ఆమెకు తెలియక పోయి ఉండవచ్చు. గుడ్డిగా పీ ఆర్ టీమ్ ను నమ్మి ఆమె అక్కడికి వెళ్లి, కష్టాల్లో చిక్కుకుంది. ఒకరకంగా పీఆర్ సజెషన్స్ తోనే ‘ఛపాక్’ సినిమా ప్రమోషన్స్ కోసం అక్కడకు వెళ్ళింది. పాలిటిక్స్ అనేది ఒక గేమ్ లాంటిది. ఇరుక్కుందా మాడి మసైపోతుంది. అసలు ఈ విషయం ఆమెకు తెలియదేమో.. ఇక 2020లో జే. ఎన్.యూ స్టూడెంట్స్ పై గూండాల దాడికి వ్యతిరేకంగా విద్యార్థులు నిరసనకు దిగగా.. వారికి మద్దతు తెలిపేందుకు అక్కడికి వెళ్లి ఇప్పటికీ ఆ విషయంలో ట్రోల్స్ ఎదుర్కొంటూనే ఉంది. ఆమెకు నిర్ణయాలు తీసుకోవడం తెలియదు. అసలు ఆమెకు అంత సీన్ లేదు. పి ఆర్ టీం ఎలా చెబితే అలా చేస్తుంది” అంటూ వివేక్ అగ్నిహోత్రి ఆమె పరువు తీసేలా కామెంట్లు చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది.
పీ ఆర్ టీమ్ ను గుడ్డిగా నమ్ముతోందా?
దీపిక పీ ఆర్ టీమ్ ను గుడ్డిగా నమ్ముతుంది అనడంతో .. అందుకే దీపిక స్పిరిట్ మూవీ విషయంలో కూడా ఇలాంటి తప్పే చేసిందా అంటూ పలు కామెంట్లు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్. నిజానికి దీపిక డైరెక్టుగా స్పిరిట్ మూవీ గురించి స్పందించకపోయినా.. ఆమె పీ ఆర్ టీమ్ సినిమా స్టోరీని లీక్ చేయడం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఇదే విషయంపై ప్రముఖ స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) కూడా దీపిక #డర్టీ పీఆర్ టీమ్ అంటూ కూడా సంబోధించారు. పీఆర్ టీమ్ అంటే ఆమె పాపులారిటీని పెంచాలి కానీ ఇలా ఆమె కెరియర్ను దెబ్బతీసేలా ఉండకూడదని పలువురు సలహాలు ఇస్తున్నారు. మొత్తానికైతే దీపికా పదుకొనే ఇప్పుడు పీఆర్ టీం వల్లే చిక్కుల్లో పడుతోందని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
దీపికా పదుకొనే సినిమాలు..
దీపికా పదుకొనే విషయానికి వస్తే.. స్పిరిట్ మూవీ నుండి తప్పుకున్న తర్వాత ఈమెకు మరో తెలుగు సినిమాలో అవకాశం వస్తుందా? అని అందరూ అనుకున్నారు. కానీ అట్లీ (Atlee ), అల్లు అర్జున్ (Allu Arjun) కాంబినేషన్లో వస్తున్న సినిమాలో ఈమెనే హీరోయిన్గా తీసుకోవడం గమనార్హం. ఇంటర్నేషనల్ లెవెల్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా మేకింగ్ వీడియోని విడుదల చేయగా.. అందులో హాలీవుడ్ చిత్రాలకు పనిచేసిన వీఎఫ్ఎక్స్ కంపెనీలు.. ఈ సినిమా కోసం పనిచేస్తున్నాయి .మరి భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.