Illu Illalu Pillalu Today Episode june 19th: నిన్నటి ఎపిసోడ్ లో.. నర్మదా ప్రేమ ఇద్దరూ కలిసి శ్రీవల్లి దగ్గర కూర్చొని మా ఇద్దరి గురించి ఎవరు మామయ్యకి చెప్పారు అని ఆలోచిస్తూ ఉంటారు.. ఎవరో తెలియదు కానీ మావయ్యకి లేనిపోనివి చెప్పారు అని ప్రేమ అంటుంది.. మా గురించి ఎవరో లేనిపోనివన్నీ మావయ్యకి చెప్తున్నారు ఇంతకీ నువ్వు మీ పుట్టింటికి వెళ్ళావు కదా అక్క నువ్వు అటు నుంచి వచ్చావంటే కదా అనేసి నర్మదాలు అడుగుతారు. ఖచ్చితంగా శ్రీవల్లే ఊదేసి ఉంటుందని పసిగట్టేసిన ప్రేమ, నర్మదలు కూపీ లాగడానికి శ్రీవల్లి దగ్గరకు వెళ్తారు. నేను డాన్స్ క్లాస్‌కి వెళ్లిన విషయం నాకు నర్మద అక్కకి తప్ప మూడో కంటికి తెలియదు.. మరి ఈ విషయం మావయ్య గారికి ఎలా తెలిసి ఉంటుంది. మామయ్య గారికి ఎవరు చెప్పి ఉండొచ్చు అని గుచ్చి గుచ్చి అడుగుతుంది ప్రేమ. దాంతో శ్రీవల్లి.. అయ్యబాబోయ్.. వీళ్లకి నా మీద డౌట్ వచ్చేసింది అని అనుకుని.. ఏమో నాకేం తెలుసు.. నన్నెందుకు అడుగుతున్నారు? ఒకవేళ అత్తయ్య గారు చెప్పారేమో అని అంటుంది.. మొత్తానికి శ్రీవల్లి నోటి నుంచే అసలు నిజాన్ని బయటపెట్టారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. రామరాజు ధీరజ్ కలిసి రావడం చూసి వేదవతి సంతోషంతో పొంగిపోతుంది. తండ్రి కొడుకులు ఇద్దరు కలిసిపోయారని ఆనందంతో గంతులు వేస్తుంది. రామరాజు వేదవతిని పిలవగానే పరిగెత్తుకుంటూ వస్తుంది. ఏంటి విచిత్రం మీ ఇద్దరు కలిసి రావడం ఏంటి అని వేదవతి సంతోషంతో ఉరకలేస్తుంది. అయితే ఇక మీద నుంచి విని డెలివరీ బాయ్ జాబ్ చేయాల్సిన అవసరం లేదు చెప్పు బుజ్జమ్మ అని అంటాడు. ఈ వేదవతి మీరే కదా వాడ్ని నెలకు వాళ్ళ ఖర్చులకు సరిపోయిన డబ్బులు ఇవ్వమని అడిగారు. ఇప్పుడు మళ్లీ ఇలా అంటున్నారు ఏంటి అని అంటుంది.
సైకిల్ మీద కష్టపడుతూ ఇంటింటికి వెళ్లి ఫుడ్డు డెలివరీ చేసే అంత గతిని పట్టలేదు రామరాజు కొడుకులు కి అని అంటాడు. ఇకమీదట వాడి ఖర్చులు వాడి భార్య ఖర్చులు అన్నీ నేనే చూసుకుంటాను సాగర్ లాగా మిల్లు కొచ్చి ఏదో ఒక పని చేసుకోమను కాలేజ్ అయిన తర్వాత అని అంటాడు. ఆ మాట విని అందరూ సంతోషంగా ఉంటారు. కానీ ధీరజ్ మాత్రం ఆ విషయాన్ని ఒప్పుకోడు. అందరూ ఎంత చెప్పినా కూడా ధీరజ్ మొండిగానే ఉంటాడు. నేను అలాంటి పని చేయలేను అని చెప్పేస్తాడు. ఆ మాట వినగానే రామరాజు కోపంతో ధీరజ్ని కొడతాడు. ధీరజ్ నాన్న దగ్గర పని చేస్తూ నేను ఇలాగే ఉండడం నాకు ఇష్టం లేదు నేను జీవితంలో పైకి ఎదగాలని అనుకుంటున్నానని అంటాడు.
ఇంట్లో వాళ్ళు ఎంత నచ్చ చెప్పినా కూడా ధీరజ్ మాట వినకపోవడంతో రామరాజు కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఈ రామరాజు కొడుకు సైకిల్ మీద కష్టపడుతూ ఇంటింటికి వెళ్లి ఫుడ్ ఇవ్వడం చూడలేక నేను ఈ విషయం చెప్తే వాడికి నచ్చలేదు చూసావా అని అంటాడు. నాన్న మాటకు ఎదురు చెప్తావ్ ఏంటి రా అని చందు అంటాడు. కానీ ధీరజ్ ఏమి అనడు. నువ్వు తండ్రి మాటకు ఎదురు చెప్పడానికి చెప్పిన మాటని చెయ్యకపోవడానికి కారణం ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడమే అని ప్రేమను చూపిస్తాడు. ప్రేమ ఎమోషనల్ అయ్యి వెళ్ళిపోతుంది.
ఆ తర్వాత వేదవతి ఎక్కడుందో అని అందరూ వెతుక్కుంటూ ఉంటారు. నర్మద ప్రేమ అత్తయ్య గారు ఎక్కడున్నారో చూడాలని అనుకుంటారు. అంత గదిలో ఏదో సౌండ్ రావడంతో అక్కడికి వెళ్లి చూడగా వేదవతి కోపంగా గిన్నెలని బయటకు విసురుతుంది. అది గమనించిన కోడలు ఇద్దరు వంటగదిలోకి వెళ్తారు. అత్తయ్య గారు మీకు కోపం కి కారణం ఏంటో మాకు తెలుసు కానీ మీరు కాస్త శాంతంగా ఉండాలని అంటారు. వేదవతి తండ్రి మాట కొడుకు కొడుకు మాట తండ్రి వినకపోవడంతో నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు వీళ్ళిద్దరి మధ్యలో నలిగిపోతున్నానని అంటుంది.
Also Read : పార్వతికి ఝలక్ ఇచ్చిన రాజేంద్రప్రసాద్.. పల్లవికి చెక్ పెట్టబోతున్న శ్రీయా..
ఏది ఏమైనా కూడా పెళ్లయిన అబ్బాయిని అందరి ముందర అలా చంప మీద కొట్టడం తప్పు అత్తయ్యని ప్రేమ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అది చూసిన నర్మదా వేదవతి వీరిద్దరి మధ్య ఏదో జరుగుతుంది అని అనుకుంటారు. ఇక ఆ తర్వాత రామరాజు కోపంగా మిల్లుకి బయలుదేరుతాడు. ధీరజ్ మాట వినకపోవడంపై రామరాజు తిరుపతి తో అరుస్తాడు. ధీరజ్ ను సపోర్ట్ చేస్తూ తిరుపతి మాట్లాడటంతో రామరాజు కోపం వస్తుంది. తిరుపతిని దారిలోనే దించేస్తాడు రామరాజు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..