E-Paper
Advertisement

VK Naresh: న‌రేష్ వాహ‌నంపై దాడి..ఆమె కార‌ణ‌మంటున్న సీనియ‌ర్ న‌టుడు

VK Naresh: న‌రేష్ వాహ‌నంపై దాడి..ఆమె కార‌ణ‌మంటున్న సీనియ‌ర్ న‌టుడు
Advertisement

VK Naresh:టాలీవుడ్ ఇండ‌స‌ట్రీలో సీనియ‌ర్ న‌టుడు వి.కె.న‌రేష్ నిత్యం ఏదో ఓ ర‌కంగా వార్త‌ల్లో వ్య‌క్తిగా నిలుస్తున్నారు. రీసెంట్‌గానే త‌న‌పై నెగిటివ్ వార్త‌ల‌ను రాసిన వారిపై సైబ‌ర్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారాయ‌న‌. ఇది గ‌డిచిన కొన్ని గంట‌లైనా కాక ముందే, మ‌రోసారి ఆయ‌న పోలీస్ స్టేష‌న్ మెట్లు ఎక్కాల్సి వ‌చ్చింది. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే.. న‌రేష్ విజ‌య్ కృష్ణ ఇల్లు హైద‌రాబాద్‌లోని నాన‌క్ రామ్ గూడలో ఉంది. అక్క‌డ న‌రేష్ ఖ‌రీదైన కార్‌వాన్ ఉంటుంది. దానిపై ఈరోజు కొంద‌రు గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు రాళ్ల‌తో దాడి చేసి అద్దాల‌ను ధ్వంసం చేశారు. దీనిపై న‌రేష్ త‌న పీఏ కుమార్ గౌడ్.. పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.

కేసు న‌మోదు చేసిన పోలీసులు న‌రేష్ ఇంటి ద‌గ్గ‌రున్న సీసీటీవీ ఫుటేజీల‌ను ప‌రిశీలిస్తున్నారు. న‌రేష్ త‌న ఫిర్యాదులో త‌న మూడో భార్య రమ్యా ర‌ఘుప‌తి పేరుని పేర్కొన్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇటీవ‌ల కొంత కాలంగా నరేష్ త‌న మూడో భార్య ర‌మ్యా ర‌ఘుప‌తితో గొడ‌వ ప‌డుతున్నారు. ఆమె నుంచి విడిపోవాల‌ని చూస్తున్నారు. ఇటీవ‌ల త‌న మూడో భార్య కొంత మంది వ్య‌క్తుల‌తో క‌లిసి త‌న‌ను చంప‌డానికి ప్ర‌య‌త్నిస్తుంద‌ని ఆయ‌న తెలిపారు. ఇందులో కోసం ఆమెకు ఓ పొలిటీషియ‌న్‌, పోలీస్ ఆఫీస‌ర్ కూడా సాయం చేస్త్తున్నార‌ని చెప్పారు. అంతే కాకుండా ఆమె నుంచి విడాకుల‌ను కోరుతూ ఆయ‌న కోర్టుకి కూడా వెళ్లారు.

Advertisement

వీకే న‌రేష్ ఇప్పుడు ప‌విత్రా లోకేష్‌తో రిలేష‌న్‌లో ఉన్నారు. ఈ విష‌యాన్ని ఆయ‌నే స్వ‌యంగా ప‌లు సంద‌ర్భాల్లో తెలిపారు. ఈ ఏడాదిలో ప‌విత్రా లోకేష్‌తో క‌లిసి కొత్త జీవితాన్ని ప్రారంభించ‌బోతున్న‌ట్లు ఆయ‌న ఓ వీడియో ద్వారా తెలియ‌జేసిన సంగ‌తి తెలిసిందే.

Taraka Ratna : తారకరత్న లక్ష్యాలు అవే…. ఆ రెండు కోరికలు తీరకుండానే..

Advertisement

Telugu Film Producers Council: నిర్మాతల మండలి అధ్యక్షుడిగా దామోదర్‌ ప్రసాద్‌ గెలుపు..

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×