VV.Vinayak:డైరెక్టర్ గా ఎన్నో హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన అనుభవం ఉన్న దర్శకులలో వి.వి. వినాయక్
(V.V. Vinayak) ఒకరు.. ఒకప్పుడు ఈయన సినిమాలకు ఎంతో మంది ఫ్యాన్స్ ఉండేవారు.అలా స్టార్ హీరోలు వి.వి. వినాయక్ కి అడగడంతోనే డేట్స్ ఇచ్చేవారు.అలా వివి వినాయక్ ఆది, బన్నీ, లక్ష్మి, ఠాగూర్, అదుర్స్, సాంబ, కృష్ణ, అల్లుడు శీను, నాయక్, ఖైదీ నెంబర్ 150 (Khaidi No. 150) వంటి ఎన్నో హిట్ సినిమాలకు దర్శకత్వం వహించారు. అయితే అలాంటి వి.వి.వినాయక్ గత కొద్ది రోజులుగా రెస్ట్ మోడ్ లోనే ఉంటున్నారు. ఎందుకంటే ఆయన ఆరోగ్య పరిస్థితులు కాస్త బాగోలేవు. గత ఏడాది ఆయన తీవ్ర అనారోగ్యంతో హాస్పిటల్ లో చేరిన సంగతి మనకు తెలిసిందే.అయితే తాజాగా వివి వినాయక్ మళ్ళీ హాస్పిటల్ లో చేరినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
అనారోగ్య బారిన పడ్డ వివి వినాయక్..
ఇక విషయం ఏమిటంటే.. గత కొద్ది గంటల నుండి వి.వి. వినాయక్ మళ్లీ హాస్పిటల్ లో చేరారని, ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు అంటూ కొన్ని రూమర్లు వినిపిస్తున్నాయి. అంతేకాదు వి.వి.వినాయక్ హెల్త్ బాగో లేకపోవడంతో హాస్పిటల్లో చేరడం వల్ల ఈ విషయం తెలుసుకున్న నిర్మాత దిల్ రాజు (Dilraju), దర్శకుడు సుకుమార్(Sukumar) ఆయన్ని పరామర్శించారని, ప్రస్తుతం వివి వినాయక్ అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నారు అంటూ ఒక రూమర్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే ఈ రూమర్ క్షణాల్లో వైరల్ అవ్వడంతో చాలా మంది నెటిజన్స్ అసలు వివి వినాయక్ కి ఏమైంది.. ? ఎందుకు ఇలా తరచూ హాస్పిటల్ కి వెళ్లాల్సి వస్తోంది? అనే అయోమయంలో పడిపోయారు.
వి.వి.వినాయక్ ఆరోగ్యం పై క్లారిటీ ఇచ్చిన టీం..
అయితే తాజాగా వివి వినాయక్ హాస్పిటల్ లో చేరారు అనే విషయంపై ఆయన టీం క్లారిటీ ఇచ్చింది. వి.వి.వినాయక్ హాస్పిటల్ లో చేరారు అంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు.ఆయన ప్రస్తుతం ఇంట్లోనే ఆరోగ్యవంతంగా ఉన్నారు.ఆయన హాస్పిటల్ కి చేరినట్టు కొంతమంది రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదు.ఇలాంటి తప్పుడు వార్తలను క్రియేట్ చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అంటూ వివి వినాయక్ టీం క్లారిటీ ఇవ్వడంతో పాటు ఇలాంటి రూమర్లు క్రియేట్ చేసే వారికి వార్నింగ్ కూడా ఇచ్చింది. ఇక వి.వి.వినాయక్ టీం క్లారిటీ ఇవ్వడంతో ఈ రూమర్లు ఆగిపోయాయి. ఇక వి.వి. వినాయక్ గత ఏడాది అనారోగ్యం బారిన పడడంతో హాస్పిటల్ కి వెళ్ళగా ఆయనకి లివర్ పాడైందని లివర్ ట్రాన్స్పలాంటేషన్ చేశారు.
వి.వి.వినాయక్ సినిమాలు..
ఇక వి.వి. వినాయక్ సినిమాల విషయానికొస్తే.. బాలీవుడ్ లో ఛత్రపతి మూవీని రీమేక్ చేసి భారీ ఫ్లాప్ ని అందుకున్నారు. ఎన్నో అంచనాలతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బాలీవుడ్లోకి ఈ సినిమాతో ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. ఫలితం మాత్రం దక్కలేదు. ప్రస్తుతం వి వి వినాయక్ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) తో సినిమా ప్లాన్ చేస్తున్నట్టు టాలీవుడ్ ఇన్సైడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.