
Waltair Veerayya:మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్‌లో నటిస్తోన్న తాజా చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. కమర్షియల్ సినిమాలను తెరకెక్కించే దర్శకుడిగా పేరున్న బాబీ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ సినిమాను రూపొందించారు. సంక్రాంతి సందర్భంగా సినిమా జనవరి 13న రిలీజ్ అవుతుంది. సినిమా రన్ టైమ్ కూడా 2 గంటల 35 నిమిషాలుగా ఫిక్స్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి గత రెండు చిత్రాలు ఆచార్య, గాడ్ ఫాదర్ సినిమాలు అభిమానులు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. దీంతో వారు వాల్తేరు వీరయ్యపై భారీ అంచనాలే పెట్టుకున్నారు.
‘వాల్తేరు వీరయ్య’పై భారీ ఎక్స్‌పెక్టేషన్స్ రావటానికి మరో కారణం.. చిరంజీవితో పాటు మాస్ మహారాజ్ రవితేజ కూడా కీలక పాత్రలో నటిస్తుండటమే. ఇప్పటికే సినిమాకు సంబంధించిన ఫస్ట్ కాపీ సిద్ధమైందని టాక్. రెండు వారాల క్రితమే దీన్ని చిరంజీవి చూశారట. సినిమా చూడగానే డబుల్ బ్లాక్ బస్టర్ అని డైరెక్టర్ బాబీతో చెప్పేశారనే వార్తలు వినిపిస్తున్నాయి. చిరంజీవి నుంచి ఇలాంటి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ రావటంపై బాబీ కూడా హ్యాపీగా ఉన్నారని టాక్. శ్రుతీ హాసన్ ఇందులో హీరోయిన్‌గా నటించింది. సోమవారం రోజున వాల్తేరు వీరయ్య సినిమా టైటిల్ ట్రాక్ రిలీజ్ అవుతుంది. ఇప్పటికే విడుదలైన రెండు సాంగ్స్, చిరంజీవి, రవితేజ క్యారెక్టర్స్ గ్లింప్స్ అన్ని సినిమాపై అంచనాలను మరింతగా పెంచేశాయి.