Waltair Veerayya Veera Simha Reddy : మెగాస్టార్ చిరంజీవి.. నటసింహ నందమూరి బాలకృష్ణ మధ్య సంక్రాంతి పోరుకి సర్వం సిద్ధమవుతున్నాయి. చిరంజీవి ఏమో వాల్తేరు వీరయ్య అంటూ సందడి చేయబోతుంటే బాలకృష్ణ మరో వైపు వీర సింహా రెడ్డి అంటూ బాక్సాఫీస్ పోరుకి సై అనేశారు. వీరితో పాటు ఆది పురుష్, వారసుడు, ఏజెంట్ చిత్రాలు కూడా సంక్రాంతి రేసులో ఉన్నప్పటికీ వాల్తేరు వీరయ్య, వీర సింహా రెడ్డి చిత్రాలపై మంచి అంచనాలున్నాయి. ఈ రెండింటి కోసం ఇటు ఫ్యాన్స్, ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వర్గాలు సైతం ఆసక్తికరంగా వెయిట్ చేస్తున్నాయి. కలెక్షన్స్ పరంగానే కాదు.. ప్రీ రిలీజ్ బిజినెస్ విషయాల్లోనూ రెండు సినిమాలు పోటీ పడుతున్నాయని మీడియా వర్గాల్లో టాక్ బలంగా వినిపిస్తోంది.
తాజా సమాచారం మేరకు ఓవర్ సీస్ హక్కుల విషయంలో వీర సింహా రెడ్డి కంటే వాల్తేరు వీరయ్య చిత్రానికే ఎక్కువ మొత్తం వచ్చింది. వాల్తేరు వీరయ్యలో మెగాస్టార్‌తో పాటు రవితేజ కూడా నటిస్తుండటంతో క్రేజీగా ఈ చిత్రం దాదాపు రూ.7 కోట్లకు పైగానే ఓవర్ సీస్ ధరను దక్కించుకుంది. ఇక వీర సింహా రెడ్డి సినిమా అయితే దాదాపు రూ.4 కోట్లకు అమ్ముడైంది. ఏదైతేనేం అఖండ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత కూడా బాలయ్య కంటే చిరంజీవికే ఓవర్ సీస్ హక్కుల విషయంలో ఎక్కువ ధర రావటం మెగా ఫ్యాన్స్‌కి సంతోషంగా ఉంది.
ఈ రెండు చిత్రాలను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించటం ఒక విశేషమైతే .. ఓవర్ సీస్ హక్కులను కూడా ఒకే డిస్ట్రిబ్యూటర్ దక్కించుకోవటం మరో విశేషం.