BigTV English

Pawan Kalyan Vs Prakash Raj: జస్ట్ ఆస్కింగ్.. ఎవరు కరెక్ట్? ఎవరు రాంగ్?

Pawan Kalyan Vs Prakash Raj: జస్ట్ ఆస్కింగ్.. ఎవరు కరెక్ట్? ఎవరు రాంగ్?

War of Words Between Pawan Kalyan Vs Prakash Raj: పవన్ వర్సెస్ ప్రకాశ్ రాజ్.. ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న మ్యాటర్ ఇది. గంటకో ట్వీట్. రోజుకో రియాక్షన్స్ ఇద్దరి మధ్య నడుస్తున్నాయి. తిరుమల లడ్డూ విషయంపై మొదలైన డైలాగ్ వార్ కాస్తా చాలా దూరం వెళ్తోంది. జస్ట్ ఆస్కింగ్ అంటూనే పవన్ కు ప్రకాశ్ రాజ్ రోజూ చురకలు అంటిస్తున్నారు. నిజానికి అవి డైరెక్ట్ ఎటాక్ మాదిరిగానే ఉంటున్నాయి. తానొకటి చెబితే ప్రకాశ్ రాజ్ మరొకటి అర్థం చేసుకున్నారని పవన్ అంటుంటే.. కాదు కాదు.. తాను చెప్పినదాన్ని పవనే అపార్థం చేసుకున్నారంటూ ప్రకాశ్ రాజ్ అంటున్నారు. ఈ ఇద్దరి మధ్య రీల్స్ లో కనిపించిన శత్రుత్వం కాస్తా రియల్ గా మారుతోంది. ఇంతకీ ఎవరు కరెక్ట్? ఎవరు రాంగ్? జస్ట్ ఆస్కింగ్.


అవును.. నువ్ నంద అయితే నేను బద్రీ.. బద్రీనాథ్. ఇది ప్రకాశ్ రాజ్, పవన్ కల్యాణ్ మధ్య పాపులర్ డైలాగ్. ఇద్దరి మధ్య ఆ రీల్ ఫైట్ కాస్తా రియల్ ఫైట్ గా మారుతోంది. అవును తిరుమల లడ్డూ విషయంలో మొదలైన ఈ డైలాగ్ వార్ కాస్తా రోజుకో ట్వీట్, పూటకో డైలాగ్ అన్నట్లుగా మారింది. జస్ట్ ఆస్కింగ్ అంటూనే పవన్ కు ప్రకాశ్ రాజ్ కౌంటర్లు గట్టిగానే ఇస్తున్నారు. అదే సమయంలో పవర్ స్టార్ కూడా ఎక్కడా తగ్గడం లేదు. దీంతో ఇది హైవోల్టేజ్ పొలిటికల్ వార్ గా మారింది.

ఇద్దరూ ఎదురెదురు కూర్చున్నప్పుడు మంచి ఫ్రెండ్సే. మాట మంతి అంతా ఓకే. కానీ ఐడియాలజీ విషయానికొస్తే ఎవరి లెక్కలు వారివే. అందుకే ఈ పొలిటికల్ ఫైరింగ్ నడుస్తోంది. ఇద్దరూ కలిసి చివరగా ఒక ఫ్రేమ్ లో కనిపించింది వకీల్ సాబ్ అన్న సినిమాలో. గతంలోనూ చాలా సినిమాల్లో హీరో, విలన్ క్యారెక్టర్లలో ఈ ఇద్దరూ రీల్ డైలాగ్ లు విసురుకున్న వారే. కానీ విచిత్రంగా ఇప్పుడు రియల్ డైలాగ్ లు విసురుకుంటుండడమే హాట్ టాపిక్ గా మారింది.


సింపుల్ గా చెప్పాలంటే పవన్ కు, ప్రకాశ్ రాజ్ కు శత్రుత్వం ఏమీ లేదు. కానీ జనసేన బీజేపీతో కలిసి వెళ్లడం, రూట్ మార్చిన దగ్గర్నుంచి ప్రకాశ్ రాజ్ కథలో ట్విస్ట్ ఇచ్చారు. పవన్ ను పొలిటికల్ గా టార్గెట్ చేయడం మొదలు పెట్టారు. గతంలో పవన్ పొలిటికల్ పొత్తుల గురించి చాలా సార్లు చేసిన ట్వీట్స్ వైరల్ కూడా అయ్యాయి. సరే అప్పుడు వన్ సైడ్ ట్వీట్స్ తో మ్యాటర్ అక్కడితో ఆగిపోయింది. కానీ ఇప్పుడు తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం, సనాతన ధర్మ పరిరక్షణపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ప్రకాశ్ రాజ్ రియాక్షన్ మొదలు పెట్టడంతో ఈ మ్యాటర్ హీటెక్కింది.

Also Read: తిరుపతి లడ్డూ వివాదం.. నన్ను క్షమించండి అన్న రజనీకాంత్

విదేశాల్లో షూటింగ్ లో ప్రకాశ్ రాజ్ బిజీ.. ఇక్కడ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష, పాలనా వ్యవహారాల్లో బిజీ. అయినా సరే రెండువైపులా డైలాగ్ లు పేలుతూనే ఉన్నాయి. నువ్వు అర్థం చేసుకున్నది రాంగ్ అని రెండువైపుల నుంచి వినిపిస్తున్న మాట. మరి ఎవరు కరెక్ట్? అన్నది కూడా తేల్చుకునేందుకు రంగం సిద్ధమవుతోంది. తిరుమల లడ్డూ ప్రసాదంలో యానిమల్ ఫ్యాట్ కలిసిందన్న రుజువులతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన టీటీడీ బోర్డు చాలా ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలని, తమ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందంటూ సెప్టెంబర్ 20న పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. అంతే కాదు శ్రీవారికి జరిగిన అపచారానికి ప్రాయశ్చితం పేరుతో దీక్షను చేపట్టారు. దీనిపై కేంద్ర స్థాయిలో విచారణ చేపట్టాలని.. అలాగే సనాతన ధర్మాన్ని కాపాడేందుకు కేంద్రంలో ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. తాను అనుకున్నది, తన మనసులో మాట ఇలా ట్వీట్ రూపంలో జనంతో పంచుకున్నారు పవన్ కల్యాణ్.

సీన్ కట్ చేస్తే ప్రకాశ్ రాజ్ ఆల్ ఆఫ్ సడెన్ గా ఈ మ్యాటర్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఎక్కడో విదేశాల్లో షూటింగ్ లో బిజీగా ఉన్నానని చెబుతూనే షాట్ షాట్ గ్యాప్ మధ్యలో పవన్ కు కౌంటర్ గా ట్వీట్లు సంధిస్తున్నారు. జస్ట్ ఆస్కింగ్ అంటూ పవన్ పేరు ప్రస్తావించకుండా వరుసగా విరుచుకుపడుతున్నారు. చురకలు అంటిస్తున్నారు. నిజానికి ఇక్కడ ప్రకాశ్ రాజ్ ప్లేస్ లో వైసీపీ నాయకుడో మరొకరో ఉండి ఉంటే ఇంత హైప్ క్రియేట్ అయ్యేది కాదు. కానీ అవతల ఉన్నది నంద, ఇవతల ఉన్నది బద్రీ కాబట్టే ఇంత కథ నడుస్తోంది. ఇద్దరూ సినిమా స్టార్లు కావడంతో ట్వీట్లు, డైలాగ్ వార్స్ వైరల్ అవుతున్నాయి. మ్యాటర్ అక్కడితో ఆగకుండా ఫ్యాన్స్ కూడా రంగంలోకి దిగి ట్రోల్స్ చేసుకునే దాకా పరిస్థితి వెళ్తోంది.

పవన్ కల్యాణ్ చేసిన ఫస్ట్ ట్వీట్ కు ప్రకాశ్ రాజ్ చేసిన కౌంటర్ ట్వీట్ తో జస్ట్ ఆస్కింగ్ కథ మొదలైంది. పవన్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో జరిగిన ఘటన ఇది అని, విచారించి నేరస్థులపై చర్యలు తీసుకోవాలంటూనే.. మీరెందుకు అనవసర భయాలు కల్పించి, దీన్ని జాతీయస్థాయిలో చర్చించుకునేలా చేస్తున్నారని ప్రకాశ్ రాజ్ ప్రశ్నించారు. దేశంలో ఇప్పటికే ఉన్న మతపరమైన ఉద్రిక్తతలు చాలు అని చెబుతూనే.. కేంద్రంలో ఉన్న మీ స్నేహితులకు ధన్యవాదాలు అంటూ కోట్ చేయడం అగ్గి రాజేసింది. అక్కడితో ఒక ఎపిసోడ్ ముగిసిందని అంతా అనుకున్నారు. కానీ ట్వీట్ వార్ కాస్తా డైలాగ్ వార్ గా మారిపోయింది. ట్వీట్లల్లో ట్విస్టులతో పాటే పొలిటికల్ హీట్ కూడా పెరిగిపోయింది. కథ మారిపోయింది.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×