Fire Accident: రాష్ట్రంలో వరుస అగ్ని ప్రమాదాలు ప్రజలను ఆందోళన కలిగిస్తున్నాయి. ఏ వైపు నుంచి వస్తుందే తెలియక ప్రజలు భయాందోళనకు గురవుత్తున్నారు. నిత్యం ఏదొక ప్రదేశంలో అగ్నిప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా రంగా రెడ్డి జిల్లా సరూర్ నగర్ మణికంఠ టింబర్ డిపో దుకాణంలో అగ్నిప్రమాదం జరిగింది.
శనివారం తెల్లవారుజామున షార్ట్‌సర్క్యూట్ కారణంగా షాపులో మంటలు చెలరేగాయి. దీంతో సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. హుటా హుటినా ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అయితే ఈ ప్రమాదంలో షాపులో దాదాపు 80 నుంచి 85 లక్షల విలువ చేసే స్టాక్ ఉందని, ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారని డిపో యజమాని తెలిపారు. అగ్నిప్రమాదంలో ఎంత ఆస్తి నష్టం జరిగిందనేది ఇంకా స్పష్టత రాలేదు.
కాగా శుక్రవారం రాత్రి మహబూబ్‌నగర్‌లోని ఓహోటల్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అరేబియన్ నైట్స్ హోటల్ సెకండ్ ఫ్లోర్‌లో.. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఆరుగురు చిక్కుకుపోయారు. ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది.. వారిని బయటకు తీశారు. ఆరుగురికి తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది. వెంటనే గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగిందా..? లేక మరేదైనా కారణం ఉందా..? అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.
Also Read: యువతిపై గ్యాంగ్‌రేప్ పట్టించుకోని భర్త.. ప్రియుడితో కలిసి ఆమె ఏం చేసిందంటే..
మరోవైపు హైదరాబాద్‌లోని కేబీహెచ్‌బీలో ఓ వస్త్ర దుకాణంలో స్వల్ప అగ్ని ప్రమాదం జరిగింది. షాపు టెర్రస్‌పై నుంచి మంటలు వస్తున్నట్లు గమనించిన షాపు యాజమాన్యం.. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించింది.. అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేశారు. టెర్రస్‌పై పేరుకుపోయిన చెత్త, కట్టెలకు మంటలు అంటుకుని ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.