BigTV English

Pushpa 2 Movie : నార్త్ ఇండియాలో పుష్ప బ్రాండ్ కొనసాగిందా..? అసలు ఆడియన్స్ ఏం అంటున్నారంటే..?

Pushpa 2 Movie : నార్త్ ఇండియాలో పుష్ప బ్రాండ్ కొనసాగిందా..? అసలు ఆడియన్స్ ఏం అంటున్నారంటే..?

Pushpa 2 Movie.. అల్లు అర్జున్ (Allu Arjun)హీరోగా సుకుమార్(Sukumar )దర్శకత్వంలో 2021లో తెరకెక్కిన చిత్రం పుష్ప(Pushpa). నాడు ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా బాలీవుడ్లో రికార్డులు క్రియేట్ చేసింది. దాదాపు అక్కడే రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసి రికార్డు సృష్టించింది. దీంతో ప్రతి ఒక్కరు కూడా ‘పుష్ప 2’ కోసం ఎదురుచూశారు. అలా దాదాపు సౌత్ ఆడియన్స్ తో పాటు నార్త్ ఆడియన్స్ కూడా ఎంతగానో ఎదురు చూడగా.. ఈ సినిమాను ఈరోజు కొన్ని ప్రదేశాలలో అర్ధరాత్రి నుంచే బెనిఫిట్ షో లు ప్రారంభమించారు.ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా సౌత్ ఇండస్ట్రీలో ఈ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది అనే విషయాన్ని కాస్త పక్కన పెడితే, బాలీవుడ్ లో ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా అసలు పుష్ప రేంజ్ లో సక్సెస్ సాధించిందా? అసలు పుష్ప-2కి అక్కడి ఆడియన్స్ ఎలా రియాక్ట్ అవుతున్నారు? వారి అభిప్రాయం ఏంటి? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.


పుష్ప-2 పై నార్త్ ఆడియన్స్ రియాక్షన్..

నార్త్ ఇండస్ట్రీలో పుష్ప 2 సినిమా అర్ధరాత్రి నుంచే షో ప్రారంభమైంది. ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ సినిమా కోసం అభిమానులు ముందస్తుగానే రికార్డ్ స్థాయిలో టికెట్ బుకింగ్ చేసుకున్నారు. ఇకపోతే వారి అంచనాలను అల్లు అర్జున్, సుకుమార్ అంచనాలను అందుకున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇకపోతే ఆడియన్స్ ఒక్కొక్కరిగా తమ అభిప్రాయాలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు. అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్ మరో లెవెల్ కి చేరిపోయింది. సుకుమార్ కూడా అద్భుతమైన టేకింగ్ తో ఆకట్టుకున్నారు. బిజిఎం అదిరిపోయింది. ఇక రష్మిక మందన్న శ్రీవల్లి గెటప్ లో ప్రాణం పెట్టి మరీ నటించింది.


చిన్నపాటి తప్పులు కానీ బ్లాక్ బస్టర్..

అయితే ఈ సినిమాలో మెయిన్ విలన్ గా చూపించిన ఫహాద్ ఫాజిల్ ను పుష్ప సినిమాలో సుకుమార్ సింహంలా చూపించారు. అక్కడ ఆయన క్యారెక్టర్ చూసిన తర్వాత పుష్ప-2 లో అంతకుమించి ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ ఇక్కడ మాత్రం జోకర్ ను చేసేశారు. ముఖ్యంగా సుకుమార్ ఫహాద్ పాత్రను తీర్చిదిద్దడంలో ఇక్కడ ఫెయిల్ అయ్యారు అంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాలో ఎమోషనల్ సన్నివేశాలు ఆడియన్స్ కి పెద్దగా కనెక్ట్ అవడం లేదు. అక్కడక్కడ చిన్నపాటి మైనస్ లు కనిపించినా సినిమా మాత్రం భారీ విజయాన్ని అందుకుంటుంది..

నార్త్ లో హైయెస్ట్ కలెక్షన్స్ గ్యారెంటీ..

ముఖ్యంగా జాతర సీక్వెన్స్ గురించి మాట్లాడుతూ.. ఈ సీన్ సినిమా చరిత్రలో నిలిచిపోతుంది. ఒక నార్త్ లోనే అత్యధిక కలెక్షన్స్ రాబట్టడం గ్యారెంటీ అంటూ సినిమాపై తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. మొత్తానికైతే పుష్ప రేంజ్ లో పుష్ప -2 కూడా భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకునేలా కనిపిస్తోంది అంటూ ఆడియన్స్ తమ అభిప్రాయాలను పంచుకున్నారు.మరి మొదటి రోజు ఎన్ని కోట్లు రాబడుతుందో చూడాలి..

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×