E-Paper
Advertisement

Khushboo:- ఖుష్బూ ఏంటా మాటలు.. మొన్న వెంకీ, నిన్న చిరు

Khushboo:- ఖుష్బూ ఏంటా మాటలు.. మొన్న వెంకీ, నిన్న చిరు
Advertisement

Khushboo:- ఖుష్బూ ఈ మధ్య పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతోంది. అక్క, అత్త క్యారెక్టర్లు చేస్తున్న ఖుష్బూ ఏకంగా రొమాన్స్ సీన్లలో నటించాలనుందని చెప్పింది. అది కూడా మెగాస్టార్ చిరంజీవితో. ఇప్పటి వరకు చిరంజీవితో నటించే ఛాన్స్ రాకపోవడంపై తెగ ఫీల్ అయిపోతోంది ఖుష్బూ. స్టాలిన్ సినిమాలో చిరంజీవికి అక్కగా నటించినప్పటికీ.. ఎప్పటికైనా సరే చిరంజీవితో ఆన్ స్క్రీన్స్ రొమాన్స్ చేయాలని ఉందంటూ తన ఫీలింగ్స్ ఎక్స్‌ప్రెస్ చేసింది. హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతున్నప్పుడు కొందరు తెలుగు హీరోలతో నటించింది ఖుష్బూ. కాని, చిరంజీవి పక్కన హీరోయిన్ ఛాన్స్ మాత్రం రాలేదు. అందుకే, ఈ మాటలు మాట్లాడుతోంది.

Advertisement

ఇక మొన్ననే విక్టరీ వెంకటేష్‌పై కామెంట్ చేసింది. తెలుగులో వెంకీకి ఫస్ట్ హీరోయిన్ ఖుష్బూనే. ఖుష్బూకు కూడా ఫస్ట్ సినిమా వెంకీతోనే. కలియుగ పాండవులు సినిమాతో ఇద్దరూ హీరో హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చారు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య బంధం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ వెంకీతో రోజూ మాట్లాడుతూ ఉంటానని చెప్పిన ఖుష్బూ.. తనకు ఎలాంటి సలహాలు కావాలన్నా, ఒత్తిడిలో ఉన్నా.. ఒక స్నేహితుడిలా సలహాలు ఇస్తాడంటూ చెప్పుకొచ్చింది.

వెంకీ ఇండివిడ్యువల్‌గా అయితే ఓకే గానీ.. గ్రూప్‌లో ఉంటే మాత్రం అసలు తను ఎవరూ తెలియనట్టే ప్రవర్తిస్తాడని ఓ కంప్లైంట్ చేసింది. అలనాటి హీరో హీరోయిన్లకు ఓ వాట్సాప్ గ్రూప్ ఉంది. ఇందులో చిరంజీవితో సహా వెంకీ, నాగార్జున ఇతర హీరో హీరోయిన్లు ఉన్నారు. ఆ వాట్సాప్ గ్రూపులో అందరూ చాటింగ్ చేస్తారట గానీ.. వెంకీ మాత్రం మెసేజ్ చేయడు అంటూ చెప్పుకొచ్చింది. అంటే, డైరెక్టుగా ఫోన్ చేసి మాట్లాడితేనే మాట్లాడతాడు. లేదా ఇండివిడ్యువల్‌గా చాట్ చేస్తే చేస్తాడు. అంతే తప్ప ఇలా గ్రూపులో మాత్రం మాట్లాడడట.

Advertisement

ఇక జగపతిబాబు కూడా ఖుష్బూ గురించి ఇంట్రస్టింగ్ మ్యాటర్ చెప్పారు. ఖుష్బూ తన చిన్నప్పటి ఫ్రెండ్ అంటూ బాంబ్ పేల్చాడు. ఇప్పటి వరకు కలిసి నటించకపోయినా… తాము ఇద్దరం మాట్లాడుకుంటూనే ఉంటామని, మంచి స్నేహితులమని చెప్పుకొచ్చాడు. రామబాణం సినిమాతో ఫస్ట్ టైం.. ఖుష్బూతో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు జగపతిబాబు. 

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×