BigTV English

Jagapathi Babu:- ర‌జినీకాంత్ ప‌ర్‌ఫెక్ట్‌గా మాట్లాడుతారు: జ‌గ‌ప‌తి బాబు…

Jagapathi Babu:- ర‌జినీకాంత్ ప‌ర్‌ఫెక్ట్‌గా మాట్లాడుతారు: జ‌గ‌ప‌తి బాబు…


Jagapathi Babu:- ఇటీవ‌ల విజ‌య‌వాడ‌లో సీనియ‌ర్‌ ఎన్టీఆర్ శ‌త జ‌యంతి వేడుక‌లు జ‌రిగిన‌ప్పుడు కోలీవుడ్ సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. సీనియ‌ర్ ఎన్టీఆర్‌ను పొగ‌డ‌టంతో పాటు ఆయ‌న‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అదే సంద‌ర్భంలో ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు గురించి మాట్లాడుతూ మంచి విజ‌న్ ఉన్న నేత అని, ఆయ‌న వ‌ల్ల‌నే ఈరోజు హైద‌రాబాద్‌ను చూస్తుంటే న్యూయార్క్‌లా అనిపిస్తుంద‌ని అన్నారు. అయితే దీనిపై వైసీపీ నాయ‌కులు తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు చేశారు.

కొంద‌రు ర‌జినీకాంత్‌ను జీరో అని అంటే, చంద్ర‌బాబుకి ఎలా స‌పోర్ట్ చేస్తార‌ని మ‌రొక‌రు అన్నారు. పోసాని కృష్ణ ముర‌ళి అయితే మాకు సూప‌ర్‌స్టార్ చిరంజీవే కానీ, ర‌జినీకాంత్ కాదంటూ కామెంట్స్ పాస్ చేశారు. ఇది పెద్ద వివాదాస్ప‌దంగా మారింది. తెలుగు సినీ ఇండ‌స్ట్రీలో ర‌జినీకాంత్‌కు చాలా మంది మిత్రులు ఉన్నారు. వారిలో జ‌గ‌ప‌తి బాబు ఒక‌రు. వీరిద్ద‌రూ క‌లిసి సినిమాల్లో న‌టించారు. తాజాగా ర‌జినీకాంత్ వ్యాఖ్య‌లు వివాదం కావ‌టంపై ఆయ‌న్ని ప్ర‌శ్నించిన‌ప్పుడు జ‌గ్గూ భాయ్ చాలా స్ప‌ష్టంగా తెలివిగా స‌మాధానం చెప్పారు.


‘ప‌ర్టికుల‌ర్‌గా ఈ విష‌యం అని కాదు కానీ.. ర‌జినీకాంత్ ఏ విషయంపై మాట్లాడినా ప‌ర్‌ఫెక్ట్‌గా మాట్లాడుతాడు. ఆయ‌న మాట‌లు క‌రెక్ట్‌గా ఉంటాయి. నిజాలే మాట్లాడుతారు’ అని అన్నారు. అంటే ర‌జినీకాంత్‌కు డైరెక్ట్‌గా కాక‌పోయినా, ఇన్ డైరెక్ట్‌గా జ‌గ‌ప‌తి బాబు త‌న మ‌ద్ద‌తుని తెలియ‌జేశారు. ఇప్పుడు జ‌గ‌ప‌తి బాబు కామెంట్స్ నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. ప్ర‌స్తుతం జ‌గ‌ప‌తి బాబు న‌టించిన చిత్రం రామ బాణం మే 5న రిలీజ్‌కి సిద్ధ‌మ‌వుతోంది. లక్ష్యం తర్వాత గోపీచంద్‌తో కలిసి జగపతి బాబు నటిస్తోన్న సినిమా ఇది. శ్రీవాస్ దర్శకుడు. ఓ వైపు ద‌క్షిణాది సినిమాల‌తో పాటు బాలీవుడ్ సినిమాల్లోనూ న‌టిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు జ‌గ్గూ భాయ్‌.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×