Sv Krishna Reddy : టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్స్ లలో అలనాటి డైరెక్టర్, హీరో ఎస్ వి కృష్ణారెడ్డి కూడా ఒకరు. ఎందరో స్టార్ హీరోలతో డైలాగులు చెప్పించాడు. అప్పటిలో ఈయన డైరెక్ట్ చేసిన ఎన్నో సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యాయి. కుటుంబ కథాచిత్రాల దర్శకుడిగా ఒక వెలుగు వెలిగారు. ఆయన నుంచి ఎన్నో సూపర్ హిట్లు వచ్చాయి. తన సినిమాలకి తానే సంగీతాన్ని సమకూర్చేవారు. అలా ఆయన దర్శకత్వంలో మ్యూజికల్ హిట్స్ గా నిలిచిన సినిమాలు కూడా ఉన్నాయి.. అలాంటి ఆయన చిరంజీవితో సినిమాను ఎందుకు క్యాన్సిల్ చేశారు. దానికి బలమైన కారణాలు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. ఏమన్నారో ఒకసారి చూసేద్దాం..
చిరంజీవితో సినిమా ఎందుకు క్యాన్సిల్ అయ్యిందంటే..?
డైరెక్టర్ కృష్ణా రెడ్డి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన సినిమాల గురించి ఎన్నో విషయాలను షేర్ చేశారు. ముఖ్యంగా తన సినిమాల టేకింగ్ స్టయిల్ గురించి ఎన్నో విషయాలను పంచుకున్నారు. అదే విధంగా చిరంజీవి తో సినిమా క్యాన్సిల్ అయ్యేందుకు కారణాలను బయటపెట్టారు. అంతేకాదు.. ఈ మూవీ స్టోరీని కూడా రీవిల్ చేశారు. కథ ఆయనకు నచ్చలేదు. నేను పూర్తిగా డిఫరెంట్ గా ఆలోచించాను. ఆయన వేరేలా అనుకున్నాను. కామెడీ మూవీ అనుకున్నా.. కానీ స్టోరీ నచ్చలేదట. క్యాన్సిల్ చేశారు అని నిజాలను బయటపెట్టారు..
ఇదే కాదు.. హీరో సూర్యతో కూడా ఒక సినిమా చెయ్యాల్సి ఉండేది కానీ కుదరలేదని నిజాన్ని బయట పెట్టారు. ఒకసారి నేను దాసరి నారాయణరావుగారి సిఫార్స్ తో హీరో సూర్యను కలిశాను. ఆయనకి కథను చెప్పాను .. ఆ కథ ఆయనకి బాగా నచ్చింది. ఆ విషయాన్ని ఆయన నా ఎదురుగానే జ్యోతిక గారికి కూడా చెప్పారు. కథ చెప్పడం పూర్తికాగానే శభాష్ అన్నారాయన. అయితే ఎందుకనో తెలియదుగానీ ఆ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు.. నా స్టోరీ నచ్చలేదేమో అని సరదాగా అన్నారు.
Also Read: జబర్దస్త్ లో పేమెంట్స్ ఇవ్వరా..? షాకింగ్ నిజాన్ని బయటపెట్టిన వెంకీ..
ఎస్ వి పర్సనల్ విషయానికొస్తే..
ఎస్వీ కృష్ణారెడ్డి 90వ దశకంలో తీసిన ఎన్నో చిత్రాలు ఎవర్ గ్రీన్ క్లాసిక్ హిట్స్‌గా నిలిచాయి. ఫ్యామిలీ కథలను ఎస్వీ కృష్ణా రెడ్డి తీయడం, దానికి రికార్డులు బద్దలవ్వడం కామన్‌గా జరుగుతుండేది. ఎస్వీ కృష్ణారెడ్డి కథను మాత్రమే పట్టుకుని తీసిన చిత్రాలు హిట్ అయ్యాయి. పెద్ద హీరో కదా? అని కథను కాస్త పక్కకు జరిపి.. హీరోకు తగ్గట్టుగా సినిమా తీస్తే తేడా కొట్టేశాయి. అలా బాలయ్య, నాగార్జునలతో ఎస్వీ కృష్ణా రెడ్డి తీసిన చిత్రాలు డిజాస్టర్లయ్యాయి.. కానీ కొన్ని సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ప్రస్తుతం సినిమాలు చేస్తున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే పూర్తి వివరాలు తెలిసే అవకాశాలు ఉన్నాయి.. ఏది ఏమైన ఈయన సినిమాలకు ఇప్పటికీ మంచి డిమాండ్ ఉంది..