BigTV English
Advertisement

Suriya: నేను ఈ సినిమా కోసమే సిగరెట్ తాగాను, దయచేసి లైఫ్ లో మీరు ముట్టుకోవద్దు

Suriya: నేను ఈ సినిమా కోసమే సిగరెట్ తాగాను, దయచేసి లైఫ్ లో మీరు ముట్టుకోవద్దు

Suriya: కొన్ని సినిమాలు మన పైన ప్రభావం చూపిస్తాయి అని కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా మటుకు సినిమాలోని డైలాగ్స్ నిజం జీవితంలో కూడా వినిపిస్తుంటాయి. రీసెంట్ టైమ్స్ లో ఎవరిని కదిపిన తగ్గేదెలా అంటూ మాట్లాడడం మొదలుపెడతారు. అంటే ఒక సినిమా ఎంతలా ప్రభావం చూపిస్తుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ. అయితే కొన్ని సినిమాలు నుంచి నేర్చుకోవచ్చు కానీ ఈ నేర్చుకునే పర్సంటేజ్ పీపుల్ చాలా తక్కువగా ఉంటారు. ఎక్కువగా చాలామంది అభిమానులు ప్రేక్షకులు బ్యాడ్ థింగ్స్ కి అట్రాక్ట్ అవుతారు. అందుకే కొంతమంది హీరోలు కొన్ని సినిమాలు చేసేటప్పుడు ఇది కేవలం సినిమా కోసమే చేస్తున్నాను. దయచేసి మీరు వీటిని మీ నిజ జీవితంలో చేయకండి వీటికి దూరంగా ఉండండి అంటూ చెబుతూ వస్తారు. ఇలా చెప్పిన వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉంటారు.


దయచేసి సిగరెట్లు తాగకండి

కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో సూర్య నటిస్తున్న సినిమా రెట్రో. ఈ సినిమా మే ఒకటి నా ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ మరియు టీజర్ విపరీతమైన అంచనాలను పెంచాయి. అయితే ఈ ట్రైలర్ లో మనం గమనిస్తే సూర్య సిగరెట్ తాగుతూ కనిపిస్తుంటాడు. ఇదే విషయంపై ఒక తమిళ ఈవెంట్లో సూర్య మాట్లాడుతూ.. ” నేను కేవలం సినిమా కోసమే సిగరెట్ తాగాను, ఒక్కసారి మొదలుపెట్టామంటే దానిని వదులుకోవటం చాలా కష్టం. ఒక్క పఫ్ ఏ కదా అని మొదలుపెట్టినా కూడా దాన్ని వదులుకోవడం కుదరని పని” అంటూ తన అభిమానులకి చెప్పుకొచ్చాడు. ఇలా అభిమానుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్పే హీరోలు అరుదుగా ఉంటారు. బహుశా అందుకేనేమో సూర్య అభిమానులకి ఇంకా ఇంకా నచ్చుతూ ఉంటాడు.


కం బ్యాక్ ఫిలిం కానుందా.?

సూర్య ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. కేవలం తమిళ్ ప్రేక్షకులు మాత్రమే కాకుండా తెలుగులో కూడా ప్రేక్షకులు సూర్యను విపరీతంగా ఇష్టపడతారు. ముఖ్యంగా చాలామంది తెలుగు ప్రేక్షకులకు సూర్య ఒక తమిళ్ హీరో అనే ఫీలింగ్ లేదు. తన సినిమాలు రీ రిలీజ్ చేసినా కూడా అదే స్థాయిలో బ్రహ్మరథం పడుతుంటారు ఆడియన్స్ అయితే గత కొన్ని సంవత్సరాలుగా సూర్య సరైన హిట్ సినిమా చూసి చాలా రోజులైంది. అయితే ఈ సినిమాతో ఒక స్ట్రాంగ్ కం బ్యాక్ ఇవ్వనున్నాడు అని అందరికీ ఒక స్థాయి నమ్మకం ఉంది. కార్తీక్ సుబ్బరాజ్ టేకింగ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. కార్తీక్ తీసిన ప్రతి సినిమా టెక్నికల్ గా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. అయితే ఇది ఒక లవ్ స్టోరీ అంటూ చెప్పుకొచ్చాడు కార్తీక్. మరి ఈ లవ్ స్టోరీని కార్తీక్ ఎలా డీల్ చేశాడో మే ఫస్ట్ తెలియనుంది.

Also Read : Rajamouli: రాజమౌళి మహాభారతం సినిమాలో నాని ఫిక్స్.. క్లారిటీ ఇచ్చేశారు..

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×