Manchu Vishnu: మంచు విష్ణు(Manchu Vishnu) కన్నప్ప సినిమా (Kannappa Movie)ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను శర వేగంగా నిర్వహిస్తున్నారు. అదేవిధంగా సినిమా షూటింగ్ సమయంలో సరదా సంఘటనలకు సంబంధించిన వీడియోలను కూడా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు. కన్నప్ప సినిమా ఆ పరమశివుడి మహత్వం గురించి శివుడి పై భక్తకన్నప్ప చాటుకున్న భక్తి గురించి కూడా తెలియజేయబోతున్నారు. ఈ సినిమా స్వయంగా మోహన్ బాబు నిర్మాణంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఏకకాలంలో ఐదు భాషలలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
న్యూజిలాండ్ లో షూటింగ్…
ఈ సినిమా ఎక్కువ భాగం న్యూజిలాండ్ (New Zealand) లోనే షూటింగ్ జరుపుకున్న విషయం తెలిసిందే. చిత్ర బృందం దాదాపు కొన్ని నెలల పాటు న్యూజిలాండ్ లో ఉంటూ అక్కడే ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకుని ఇండియా వచ్చారు. ఈ క్రమంలోనే తాజాగా న్యూజిలాండ్ లో చిత్ర బృందం సరదాగా గడిపిన ఒక వీడియోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఇది కాస్త సంచలనంగా మారింది . ఈ వీడియోలో మోహన్ బాబు మంచు విష్ణు ప్రభుదేవా వంటి తదితరులు ఉన్నారు. ఇక మంచు మోహన్ బాబు అక్కడున్నటువంటి లొకేషన్స్ అన్ని చూయిస్తూ ఈ ప్రాపర్టీస్ అన్నీ కూడా విష్ణువర్ధన్ బాబుకి కొన్నామని తెలిపారు.
న్యూజిలాండ్ లో 7 వేల ఎకరాలు….
ఈ బిల్డింగ్స్ తోపాటు ఈ ప్లేస్ అలాగే ఈ కొండలన్నింటిని కూడా విష్ణు కోసం కొన్నామని దాదాపు 7 వేల ఎకరాలు(7000 ) న్యూజిలాండ్లో విష్ణు బాబు కోసం కొనుగోలు చేసాము అంటూ ఈ సందర్భంగా మోహన్ బాబు తెలియజేయడంతో ఇది కాస్త సంచలనంగా మారింది. అయితే ఈయన సీరియస్ గా చెప్పారా? లేదంటే సరదాగా ఇలా చెప్పారా? అనేది తెలియదు కానీ మొత్తానికి ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఇలా మోహన్ బాబు పెద్ద ఎత్తున మంచు విష్ణుకి ఆస్తులు కొనుగోలు చేస్తున్న నేపథ్యంలోనే మంచు మనోజ్ గొడవలు పడుతున్నారా అంటూ కొంతమంది ఈ వీడియో పై స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.
న్యూజిలాండ్ లో భూములు అంత చీపా..
ఇలా న్యూజిలాండ్ లో 7000 ఎకరాలు కొనడం అంటే ఆశమాషీ విషయం కాదు. నిజంగానే విష్ణు అక్కడ 7000 ఎకరాలు కొన్నారా? న్యూజిలాండ్ లో భూములు మరి అంత చీప్ గా దొరుకుతున్నాయా అంటూ మరికొందరు ఈ వీడియో పై కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా మోహన్ బాబు చేసిన ఈ వ్యాఖ్యలు మాత్రం నెట్టింట తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇక మంచు విష్ణు చాలా రోజుల తర్వాత కన్నప్ప సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈయన చివరిగా నటించిన జిన్నా, మోసగాడు వంటి సినిమాలు ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ,ఆ అంచనాలను చేరుకోలేకపోయాయి. ఇక ఇప్పుడు కన్నప్ప సినిమా ద్వారా మరోసారి విష్ణు తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఆ శివయ్య కన్నప్ప సినిమా ద్వారా మంచు విష్ణుకి సక్సెస్ అందిస్తారా? లేదా అనేది తెలియాల్సి ఉంది.