Maha Kumbh Mela Special Trains: ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగరాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాకు ఏపీ నుంచి ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే వెల్లడించింది. రైళ్ల వివరాలను తెలుపుతూ ప్రకటన విడుదల చేసింది. 07117 నెంబర్ గల ప్రత్యేక ఎక్స్ ప్రెస్.. ఈ నెల 14న తిరుపతి జంక్షన్ లో రాత్రి 11.45 గంటలకు బయల్దేరనుంది. ఈ రైలు రెండు రోజుల పాటు ప్రయాణించి.. రాత్రి 11.55 గంటలకు దానాపూర్ రైల్వే స్టేషన్ కు చేరుకుంటుంది. తిరిగి ఇదే రైలు(07118)అక్కడి నుంచి 17న మధ్యాహ్నం 3.15 గంటలకు బయల్దేరుతుంది. రెండు రోజుల పాటు ప్రయాణించి మధ్యాహ్నం 1.45 గంటలకు తిరుపతి జంక్షన్ కు చేరుకుంటుందని రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైలు రేణిగుంట, కోడూరు, రాజంపేట, కడప, ఎర్రగుంట్ల, తాడిపత్రి, గుత్తి, డోన్, కర్నూలు, గద్వాల్, వనపర్తిరోడ్డు, మహబూబ్‌నగర్, జడ్చర్ల, షాద్‌నగర్, ఉందానగర్, కాచిగూడ, మాల్కజ్ గిరి, చర్లపల్లి, ఖాజీపేట రైల్వే స్టేషన్లలో ఆగనుంది.
ఈ నెల 18న మరో ప్రత్యేక రైలు
అటు తిరుపతి-దానాపూర్ రూట్ లో మరో ప్రత్యేక రైలు(07119)ను షెడ్యూల్ చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైలు ఈ నెల 18న రాత్రి 11.45 గంటలకు తిరుపతి జంక్షన్ నుంచి బయల్దేరుతుంది. రెండు రోజుల పాటు ప్రయాణించి రాత్రి 11.55 నిమిషాల ప్రాంతంలో దానాపూర్ రైల్వే స్టేషన్ కు చేరుకుంటుంది. తిరిగి ఇదే రైలు(07120) దానాపూర్ నుంచి ఈ నెల 21న మధ్యాహ్నం 3.15 గంటలకు బయల్దేరుతుంది. రెండు రోజుల తరువాత మధ్యాహ్నం 1.45 గంటలకు తిరుపతి జంక్షన్ కు చేరుకుంటుంది. ఈ రైలు కూడా రేణిగుంట, కోడూరు, రాజంపేట, కడప, ఎర్రగుంట్ల, తాడిపత్రి, గుత్తి, గుంతకల్లు, ఆదోని, మంత్రాలయం రోడ్డు, రాయచూర్, కృష్ణ, యాద్గిరి, తాండూరు, వికారాబాద్, లింగంపల్లి, బేగంపేట, సికింద్రాబాద్, చర్లపల్లి, ఖాజీపేట స్టేషన్లలో హాల్టింగ్ తీసకుంటుంది.
మచిలీపట్నం నుంచి కుంభమేళాకు ప్రత్యేక రైళ్లు
అటు కుంభమేళాకు వెళ్లే భక్తుల కోసం మచిలీపట్నం నుంచి యూపీలోని దానాపూర్ వరకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించారు రైల్వే అధికారులు. వీటిలో ఓ రైలు మచిలీపట్నం నుంచి దానాపూర్ కు వెళ్లగా, మరో రైలు దానాపూర్ నుంచి మచిలీపట్నానికి వస్తుందని వెల్లడించారు. ఈ నెల 8, 16న మచిలీపట్నం నుంచి ఉదయం 11 గంటలకు బయలుదేరే ప్రత్యేక రైళ్లు.. మరుసటి రోజు రాత్రి 11.55కు దానాపూర్ చేరుకుంటాయి. అటు ఈ నెల 10, 18న దానాపూర్ నుంచి మధ్యాహ్నం 3.15కు బయలుదేరే ప్రత్యేక రైళ్లు తిరిగి రెండో రోజు తెల్లవారు జామున 3 గంటలకు మచిలీపట్నం వస్తాయి. ఇక ఈ రైళ్లు గుడివాడ, విజయవాడ, కొండపల్లి, ఖమ్మం, డోర్నకల్, మహబాబాబాద్, వరంగల్, జమ్మికుంట, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, సిర్పూర్ కాగజ్ నగర్, బల్లార్ష, చంద్రపూర్, సేవాగ్రామ్, నాగ్ పూర్, జుజ్ హర్ పూర్, ఇటార్సీ జంక్షన్, పిపారియా, జబల్ పూర్, కట్నీ, సత్నా, మాణిక్ పూర్ జంక్షన్, ప్రయాగరాజ్ ఛోకీ, మీర్జాపూర్, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ జంక్షన్, బక్సర్, ఆరా మీదుగా దానాపూర్ కు వెళ్తాయి. చేరుకుంటుంది.
Read Also: కుంభమేళాకు ఫ్రీ రైళ్లు.. టికెట్ లేకుండానే వెళ్లొచ్చు, కానీ ఓ కండీషన్!