BigTV English

Sukumar New Movie : 1000 కోట్ల డైరెక్టర్‌కు ఇది గడ్డు కాలమే… ఇప్పుడు ఏం చేస్తాడో..

Sukumar New Movie : 1000 కోట్ల డైరెక్టర్‌కు ఇది గడ్డు కాలమే… ఇప్పుడు ఏం చేస్తాడో..

Sukumar New Movie : టాలీవుడ్ మాస్ డైరెక్టర్ సుకుమార్ పేరు తెగ వినిపిస్తుంది.. అల్లు అర్జున్ , సుకుమార్ కాంబోలో రీసెంట్ గా పుష్ప 2 వచ్చింది. కేవలం ఆరు రోజుల్లోనే 1000 కోట్ల క్లబ్ లోకి చేరిపియింది. ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. గతంలో వచ్చిన పుష్ప కు ఇది సీక్వెల్.. ఈ పుష్ప సిరీస్ మూవీస్ తో అతని క్రేజ్ ఎక్కడికో వెళ్ళిపోయిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.. అంతకు ముందు కేవలం తెలుగు ఇండస్ట్రీకి మాత్రమే పరిమితం అయిన ఆయన క్రేజ్.. ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో సత్తా చాటుతోంది.. ఇక ఇప్పుడు ఆయన 1000 కోట్ల సినిమాలే చేస్తారు. దాంతో ఆయనతో సినిమా చేసేందుకు బాలీవుడ్ స్టార్లు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. టాలీవుడ్ లో జక్కన్న తర్వాత ఆ స్థాయిలో సినిమాను తీయగలిగే డైరెక్టర్ గా క్రేజ్ సంపాదించుకున్నాడు సుకుమార్. ఆయనతో సినిమా చేస్తే కచ్చితంగా మార్కెట్, క్రేజ్ పెరుగుతాయని హీరోలు నమ్ముతున్నారు.. అయితే రేంజ్ పెరిగింది. ఇప్పుడు ఆ రేంజ్ లో ఉండే సినిమాలనే చేస్తాడా? అలా అందరు సాహసం చెయ్యలేరుగా? కోట్లు పెట్టుబడి పెట్టాతారా? ఇలాంటి సందేహాలు కూడా ఫ్యాన్స్ లో వినిపిస్తున్నాయి.


సుకుమార్ కు ఇది పరీక్షే..?

పుష్ప సిరీస్ లతో వెయ్యి కోట్లకు పై గ్రాస్ ను వసూల్ చేసే సినిమాను అయితే ఆయన తెరకెక్కించారు.. ఇప్పుడు రేంజ్ పెరిగింది కాబట్టి అన్ని భారీ బడ్జెట్ సినిమాలనే చెయ్యాలి. తక్కువలో చేస్తే క్రేజ్ తగ్గుతుంది. ఎక్కువ బడ్జెట్ ను అందరు నిర్మాతలు పెడతారా అంటే పెట్టడం కష్టం. అంటే ఇప్పుడు సుక్కు పరిస్థితి ముందు నుయ్యి.. వెనుక గొయ్యి అయ్యింది. ప్రస్తుతం ఆయన నెక్స్ట్ ప్రాజెక్టు ఎవరితో చేస్తారా అనే సందేహాలకు తెరపడింది.. తాజాగా ఈ విషయం మీద క్లారిటీ వచ్చేసింది. సుకుమార్ టీమ్ లో రైటర్ గా పనిచేస్తున్న శ్రీకాంత్ ఓ ఇంటర్వ్యూలో దీనిపై స్పందించాడు. ఇప్పటికే రామ్ చరణ్ తో ఓ సిట్టింగ్ అయిందని.. ఇద్దరూ ఓ మాట అనేసుకున్నట్టు హింట్ ఇచ్చేసాడు. ఇక పుష్ప-2 తో సుకుమార్ చాలా అలసిపోయాడని కాస్త బ్రేక్ తీసుకొనే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది.


ఇక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నాడు. తమిళ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ అవుతుంది. ఇక ఈ మూవీతో పాటుగా బుచ్చి బాబు తో మరో మూవీ చెయ్యనున్నాడు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ జోడిగా నటిస్తుంది. ఇటీవలే ఈ మూవీని పూజా కార్యక్రమాలతో మొదలు పెట్టారు. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ అప్డేట్ రానుందని సమాచారం. ఇక ఆ తర్వాత సుకుమార్ తో ఒక సినిమా చెయ్యనున్నాడని టాక్.. ఇప్పుడు సుక్కు మాటల్లో కన్ఫార్మ్ అయ్యింది. ఇక ఇప్పటికే వీరిద్దరి కాంబోలో సూపర్ హిట్ మూవీ రంగస్థలం సినిమా వచ్చింది. ఆ మూవీకి సీక్వెల్ గా సినిమా రాబోతుందా లేక కొత్త సినిమా అనేది తెలియాల్సి ఉంది..

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×