Bigg Boss 8 Telugu Latest Episode Highlights: బిగ్ బాస్ సీజన్ 8 చివరి వారానికి చేరుకుంది. ఇప్పటివరకు కంటెస్టెంట్స్ అంతా కలిసి రూ.54,30,000ను తమ ప్రైజ్ మనీ ఖాతాలో చేర్చగలిగారు. ఈ ప్రైజ్ మనీని మరింత పెంచడానికి, దాంతో పాటు కంటెస్టెంట్స్, ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడానికి పలువురు స్టార్ మా సీరియల్ ఆర్టిస్టులు హౌస్‌లోకి ఎంటర్ అవుతున్నారు. సోమవారం ప్రసారమయిన ఎపిసోడ్‌లో కొందరు సీరియల్ ఆర్టిస్టులు హౌస్‌లోకి రాగా వారితో పోటీపడి ప్రైజ్ మనీని పెంచుకున్నారు కంటెస్టెంట్స్. తాజాగా ప్రసారమయిన ఎపిసోడ్‌లో ‘బ్రహ్మముడి’ సీరియల్ ఫేమ్ కావ్య హౌస్‌లోకి ఎంటర్ అయ్యి బిగ్ బాస్‌తో సీక్రెట్‌గా తన మనసులో మాట బయటపెట్టింది.
సీక్రెట్ చెప్పాలి
‘బ్రహ్మముడి’ కావ్య అలియాస్ దీపికా ఎంత సరదాగా ఉంటుందో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ తెలుసు. అలాగే బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంటర్ అయిన తర్వాత కూడా తన అల్లరి ఏ మాత్రం తగ్గలేదు. ఎంటర్ అయిన వెంటనే కంటెస్టెంట్స్‌తో పాటు బిగ్ బాస్‌పై జోకులు వేసింది దీపికా. దీంతో వెంటనే తనను కన్ఫెషన్ రూమ్‌కు పిలిచారు బిగ్ బాస్. తనను ఏదైనా సీక్రెట్ చెప్పమని అడిగారు. అయితే తనను తరువాతి సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఎంపిక చేస్తేనే సీక్రెట్ చెప్తానని లేకపోతే చెప్పనని బిగ్ బాస్‌తోనే డీల్ మాట్లాడుకుంది దీపికా. దీంతో బిగ్ బాస్‌కు కోపం వచ్చింది. ఈ ఇంటికి కొన్ని నియమాలు ఉన్నాయని, దానికి తగినట్టుగానే నడుచుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. వెంటనే బిగ్ బాస్‌కు సారీ చెప్పింది దీపికా.
Also Read: అవినాష్‌కు గెలుపు శాతం ఎంతంటే.?
వెనకబడిన దీపికా
దీపికాతో కలిసి కంటెస్టెంట్స్ టాస్క్ ఆడే సమయం వచ్చేసింది. తనతో గేమ్ ఆడి గెలిస్తే ప్రైజ్ మనీలో రూ.11,472 పెరుగుతుంది. ఒక కంటైనర్‌లో నీళ్లు, ఆ నీళ్లలో కొన్ని వస్తువులు పెట్టి ఉంటాయి. సమయానుసారం బిగ్ బాస్ చెప్పిన వస్తువును ఆ కంటైనర్‌లో నుండి తీసి పక్కన ఉన్న గిన్నెలో వేయాల్సి ఉంటుంది. ఆ టాస్క్‌లో తనతో పోటీపడడానికి అవినాష్‌ను ఎంచుకుంది దీపికా. కానీ అవినాష్‌లాగా వేగంగా ఆడలేక ఆటలో వెనకబడిపోయింది. దీంతో ఈ టాస్క్‌లో అవినాష్ గెలిచి ప్రైజ్ మనీని పెంచాడు. చివరికి దీపికాను బిగ్ బాస్ హౌస్ నుండి వెళ్లమన్నప్పుడు కూడా గెస్ట్‌ను అలా పంపించొద్దని బిగ్ బాస్‌పైకే సీరియస్ అయ్యింది. దీంతో కంటెస్టెంట్స్ అంతా దీపికా తరపున బిగ్ బాస్‌కు సారీ చెప్పారు.
గట్టి పోటీ
దీపికా వెళ్లిపోయిన తర్వాత ‘మామగారు’ సీరియల్ ఫేమ్ ఆకర్ష్, సుహాసిని హౌస్‌లోకి ఎంటర్ అయ్యారు. కంటెస్టెంట్స్ అందరితో సరదాగా గడిపిన తర్వాత వారితో టాస్కులు ఆడే సమయం వచ్చేసింది. కంటెస్టెంట్స్ అంతా వీరితో ఆడి గెలిస్తే ప్రైజ్ మనీలోకి రూ.9,987 యాడ్ అవుతుంది. వారితో పోటీపడడానికి గౌతమ్, నిఖిల్‌ను ఎంచుకున్నారు. టాస్కులు అనేవి ఆకర్ష్, సుహాసినికి అలవాటు లేకపోయినా చివరివరకు కష్టపడి కంటెస్టెంట్స్‌కు గట్టి పోటీ ఇచ్చారు. కానీ టాస్క్‌లో చివరికి బీబీ పరివారమే గెలిచింది. ప్రైజ్ మనీ మరింత పెరిగింది. ఇలా ఒక్కొక్కరిని హౌస్‌లోకి పంపిస్తున్నందుకు తాము కూడా సంతోషంగా ఫీలవుతున్నామని కంటెస్టెంట్స్ బిగ్ బాస్‌కు తెలిపారు.