Protein Rich Food: ప్రొటీన్ మన శరీరానికి చాలా అవసరం. చికెన్ , గుడ్లు వంటి నాన్-వెజ్ ఫుడ్స్‌లో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందని చాలా మంది అనుకుంటారు. కానీ ఇది నిజం కాదు. నాన్ వెజ్ కంటే ప్రొటీన్లు అధికంగా ఉండే శాకాహార ఆహారాలు చాలా ఉన్నాయి.
శాకాహారంలో కూడా ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. ప్రొటీన్లు పుష్కలంగా ఉండి శరీరానికి అవసరమైన పోషణను అందించే శాఖాహార ఆహారాలు చాలానే ఉన్నాయి. అలాంటి కొన్ని శాఖాహార విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
వెజిటేరియన్ ప్రొటీన్ రిచ్ ఫుడ్స్:
పప్పులు:
పప్పులు ప్రోటీన్ యొక్క అద్భుతమైన మూలం.మినప్పప్పు, శనగపప్పు, పెసర పప్పు,వంటి వివిధ రకాల పప్పులు ప్రొటీన్‌తో పుష్కలంగా ఉంటుంది. అంతే కాకుండా ఇందులోని ఫైబర్ శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. పప్పులను వివిధ రకాలుగా వండుకోవచ్చు. తరుచుగా మీ డైట్ లో పప్పులు చేర్చుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అంతే కాకుండా పప్పులు తినడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. ఫలితంగా ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండేందుకు అవకాశాలు కూడా ఉన్నాయి.
సోయాబీన్స్:
సోయాబీన్స్ లో ప్రోటీన్ పుష్కంగా ఉంటుంది. అంతే కాకుండా ఇందులో అవసరమైన అమైనో ఆమ్లాలు కూడా ఉంటాయి. అందుకే సోయాబీన్స్‌తో తయారు చేసిన సోయా మిల్క్, ఎడామామ్ మొదలైనవి చాలా ప్రాచుర్యం పొందాయి. సోయాబీన్స్ లో కాల్షియంతో పాటు ఇతర పోషకాలు కూడా ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి.
విత్తనాలు:
గుమ్మడికాయ గింజలు, పొద్దుతిరుగుడు గింజలు, చియా గింజలు, అవిసె గింజలు.. ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వుల యొక్క మంచి మూలం. వీటిని సలాడ్, పెరుగు లేదా స్మూతీలో కలుపుకుని తినవచ్చు. తరుచుగా వీటిని తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అంతే కాకుండా సీడ్స్ తినడం వల్ల ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి. ఆరోగ్య సమస్యలు రాకుండా చేయడంలో కూడా ఈ సీడ్స్ చాలా బాగా పనిచేస్తాయి.
నట్స్:
బాదం, జీడిపప్పు, వాల్‌నట్‌లు లో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు , విటమిన్ ఇ లు పుష్కంగా ఉంటాయి. అందుకే వీటిని అల్పాహారంగా లేదా స్నాక్స్‌గా కూడా తినవచ్చు. నట్స్ ప్రతి రోజు తినడం చాలా మంచిది.
Also Read: సోంపు తింటే.. మతిపోయే లాభాలు !
పన్నీర్:
పనీర్ అనేది పాలతో తయారు చేయబడిన శాఖాహారం. ఇది ప్రోటీన్ , కాల్షియం యొక్క మంచి మూలం. పనీర్‌ను కూరగాయలతో లేదా పప్పుతో కలిపి వంటకాల్లో వాడవచ్చు.
బ్రోకలీ:
బ్రోకలీ ఒక క్రూసిఫెరస్ కూరగాయ. ఇది ప్రోటీన్, ఫైబర్ , విటమిన్ సి యొక్క మంచి మూలం. బ్రోకలీ అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలగి ఉంటుంది. దీనిని
ఉడకబెట్టడం, కాల్చడం లేదా సూప్‌లో చేర్చుకుని కూడా తినవచ్చు.
గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసమే. పలు పరిశోధనలు.. అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించదని గమనించగలరు.