Nagachaithanya – Sobhitha : టాలీవుడ్ ఇండస్ట్రీలో రోజురోజుకీ సినీ సెలబ్రిటీల పెళ్లిళ్లు హాట్ టాపిక్ గా మారుతున్న విషయం తెలిసిందే. గత కొంతకాలంగా డేటింగ్ లో ఉంటున్న సెలబ్రిటీల జంటలు ఫ్యాన్స్ కి సడన్ షాక్ ఇస్తూ పెళ్లి పీటలు ఎక్కేస్తున్నారు. ఇటీవల చాలామంది సెలబ్రిటీలు పెళ్లితో ఒక్కటే అయ్యారు. రీసెంట్ గా అక్కినేని వారసుడు నాగచైతన్య, బాలీవుడ్ హాట్ బ్యూటీ శోభిత దూలిపాళ్ళతో నిశ్చితార్థం చేసుకున్నారు. సమంతతో విడిపోయిన రోజే వీరిద్దరూ ఎంగేజ్మెంట్ చేసుకోవడం హాట్ టాపిక్ అయ్యింది. వీరిద్దరూ కలిసి ఎక్కడ కనిపించిన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇకపోతే వీరిద్దరూ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఇక వీరిద్దరి గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. వీరిద్దరినీ కలిపింది ఓ స్టార్ హీరో అని ఓ వార్త చక్కర్లు కొడుతుంది. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరో తెలుసుకుందాం..
అక్కినేని హీరో నాగ చైతన్య, శోభిత పెళ్లి గురించి నిత్యం ఏదొక వార్త వినిపిస్తూనే ఉంది. డిసెంబర్ 4న ఈ జంట వివాహం చేసుకోనుంది. అక్కినేని ఇంట ఈ పెళ్లి చాలా సింపుల్ గా జరగనుంది. వీరి పెళ్లికి అన్నపూర్ణ స్టూడియో వేదిక కానుంది. అయితే శోభితతో నాగచైతన్య పరిచయం ఎలా? అసలు ఆ ఇద్దరూ కలిసి ఒక్కసారి కూడా నటించలేదు కదా? అయినా ఎలా జత కుదిరింది? అంటూ అభిమానులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.. దీనిపై ఇన్నాళ్లకు ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. అసలు వీరిద్దరూ కలవడానికి కారణం నాగార్జున అని చాలా మందికి తెలియదు.
అసలు విషయానికొస్తే.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అక్కినేని హీరో నాగార్జున మాట్లాడుతూ ఫ్యాన్స్ సందేహాలకు క్లారిటీ అయితే ఇచ్చాడు. ఆయన శోభిత గురించి మాట్లాడుతూ.. శోభిత గతంలో నాగార్జున నిర్మాణ సంస్థ అయిన అన్నపూర్ణ స్టూడియోస్‌లో పనిచేసిందని చెప్పాడు. అలా అక్కినేని కుటుంబంతో శోభితకు మంచి అనుబంధం ఏర్పడింది. ఓ ప్రాజెక్ట్ కోసం పని చేసిన శోభిత పనితనం వ్యక్తిత్వం ఆయనను విపరీతంగా ఆకర్షించాయి. తనని ప్రశంసించేందుకు ప్రత్యేకంగా హైదరాబాద్ లో ఉన్నప్పుడు తనను కలవాలని నాగ్ ఆహ్వానించారు. దాంతో శోభిత నేరుగా నాగార్జున ఇంటికే వచ్చేసింది. అక్కడ స్పెషల్ డిన్నర్ ప్లాన్ చేశారట.. ఆ సమయంలోనే నాగచైతన్య అనుకోకుండా లోపలికి వెళ్లాడట. అప్పుడు శోభితను నాగార్జున స్వయంగా చైకి పరిచయం చేసారు. ఇదే వారి మొదటి పరిచయం. ఆ తర్వాత ఆ ఇద్దరి నడుమా చాలా జరిగింది. మొదట్లో స్నేహం.. ఆ తర్వాత ప్రేమగా మారింది. చివరికి ఇప్పుడు ఈ జంట ఒకటి అవుతోంది.
అలా వైజాగ్ నుంచి మొదలై పరిశ్రమలో తనకంటూ ఒక సముచిత స్థానాన్ని ఏర్పరచుకోవడానికి.. తన కలలను సాధించుకోవడానికి శోభిత చాలా కష్టపడింది. విలువలు, కళకు కట్టుబడి ఉన్న అద్భుతమైన నటి.. చాలా మంచి వ్యక్తిత్వం ఉన్న అమ్మాయి అని నాగార్జున పొగిడేశాడు. ఇప్పుడు కొత్త కోడలు రాక కోసం నాగార్జున ఫ్యామిలీ అంతా ఎదురు చూస్తున్నారని చెప్పాడు. మొత్తానికి నాగ్ కు అన్ని విధాలుగా నచ్చిన అమ్మాయినే కోడలుగా రాబోతున్నందుకు సంతోషంగా ఉందని నాగార్జున చెప్పాడు. ఆ వీడియో వైరల్ అవ్వడంతో సమంత ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.