Krithi Shetty: ఈరోజుల్లో కేవలం ఒక్క భాషలో నటిస్తే అక్కడ మాత్రమే వారి ఫేమ్ పరిమితం అయిపోతుందని ఆలోచిస్తున్నారు నటీనటులు. అందులోనూ ముఖ్యంగా హీరోయిన్లు అయితే తెలుగులో డెబ్యూ చేయగానే ఇతర భాషా చిత్రాల్లో ఆఫర్లు కొట్టేయడానికి సిద్ధమయిపోతున్నారు. తెలుగులో హీరోయిన్‌గా అడుగుపెట్టడం, ఆ తర్వాత బాలీవుడ్‌లో కలలు నెరవేర్చుకోవడం అనేది ఎన్నో ఏళ్లుగా జరుగుతున్నదే. ఇప్పుడిప్పుడే టాలీవుడ్‌లో డెబ్యూ చేసిన యంగ్ హీరోయిన్లు కూడా బీ టౌన్ వైపే ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇంతలోనే యంగ్ బ్యూటీ కృతి శెట్టికి బాలీవుడ్‌లో ఓ స్టార్ కిడ్‌కు జోడీగా డెబ్యూ చేసే అవకాశం లభించిందని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
తెలుగులో అవకాశాల్లేవు
‘ఉప్పెన’ సినిమాతో హీరోయిన్‌గా అడుగుపెట్టింది కృతి శెట్టి (Krithi Shetty). ఆ మూవీలో తన పాత్ర పేరు బేబమ్మ కావడంతో ఇప్పటికీ చాలామంది ప్రేక్షకులు తనను బేబమ్మ అనే పిలుస్తుంటారు. ‘ఉప్పెన’ విడుదల కాకముందే దాదాపు అరడజను చిత్రాల్లో ఛాన్స్ కొట్టేసింది ఈ ముద్దుగుమ్మ. కాకపోతే ఆ మూవీ తర్వాత తనకు ఆ రేంజ్‌లో హిట్ దక్కలేదు. తను ఎక్కువగా పర్ఫార్మెన్స్‌కు సంబంధించిన కాకుండా కమర్షియల్ సినిమాలను ఎంచుకోవడంతో వెనకబడిపోయింది. ఆ తర్వాత శ్రీలీల ఎంట్రీతో కృతి క్రేజ్ పూర్తిగా తగ్గిపోయింది. అందుకే ఇప్పుడు తమిళ, మలయాళ, హిందీ ఇండస్ట్రీలపై తన కన్నుపడింది.
Also Read: తొలిసారి శ్రీదేవి మరణం పై నోరు విప్పిన నిర్మాత.. అదే ప్రాణం తీసింది అంటూ..?
బ్లాక్‌బస్టర్ ‘బేబి’
తెలుగులో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య హీరోహీరోయిన్లుగా నటించిన ‘బేబి’ (Baby) మూవీ ఏ రేంజ్‌లో హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సాయి రాజేశ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రేక్షకుల దగ్గర నుండి పాజిటివ్ టాక్ అందుకోవడం మాత్రమే కాకుండా కలెక్షన్స్ విషయంలో, అవార్డుల విషయంలో కూడా రికార్డులు క్రియేట్ చేసింది. ఈ సినిమాను ఎన్నో భాషల్లో రీమేక్ చేయడానికి రైట్స్ కోసం మేకర్స్ క్యూ కట్టారు. అలా ‘బేబి’ బాలీవుడ్ రీమేక్ రైట్స్ కూడా భారీ ధరకు అమ్ముడుపోయాయి. సాయి రాజేశే ఈ రీమేక్‌ను డైరెక్ట్ చేస్తుండగా.. ఇప్పుడు ఇందులో హీరో, హీరోయిన్ ఎవరు అనే విషయంపై వార్తలు మొదలయ్యాయి.
వీరే ఫైనల్?
ముందుగా ‘బేబి’ రీమేక్‌లో ఖుషి కపూర్ నటిస్తుందని వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు ఆ అవకాశాన్ని కృతి శెట్టి కొట్టేసిందని సమాచారం. ఇక ఒరిజినల్‌లో ఆనంద్ దేవరకొండ చేసిన పాత్ర కోసం ఇషాన్ ఖత్తర్, ఆర్యమాన్ డియోల్, అగస్త్య నందలను పరిగణనలోకి తీసుకున్నా ఫైనల్‌గా ఇర్ఫాన్ ఖాన్ కుమారుడు బాబిల్ ఖాన్ ఈ మూవీలో హీరోగా నటించే ఛాన్స్ ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి బాబిల్ ఖాన్ (Babil Khan), కృతి శెట్టి పెయిర్ ప్రేక్షకులకు చాలా రిఫ్రెషింగ్‌గా అనిపించే అవకాశం ఉంది. ఇక ఆనంద్ దేవరకొండతో పాటు ‘బేబి’లో విరాజ్ పాత్రకు కూడా సమానంగా ప్రాధాన్యత ఉంటుంది. ఇక ఈ పాత్రలో ఎవరు ఎంపికయ్యారనే విషయం ఇంకా బయటికి రాలేదు.