Janu Lyri:జాను లిరి (Janu Lyri).. గత రెండు రోజులుగా ఎక్కడ చూసినా.. ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఓపెన్ చేసినా ఈమె పేరే ఎక్కువగా వినిపిస్తోంది. కారణం రెండు రోజుల క్రితం ఈమె చనిపోతున్నాను అంటూ ఒక వీడియో రిలీజ్ చేసింది. దానితో అభిమానులు సైతం కంగారుపడ్డారు. ఇక మరుసటి రోజు తాను మళ్ళీ పెళ్లికి సిద్ధమయ్యాను అంటూ ఇంకో వీడియో రిలీజ్ చేసింది. పైగా సింగర్ దిలీప్ (Singer Dilip) ను రెండో వివాహం చేసుకోబోతున్నట్లు ఒక ఫోటో విడుదల చేసి, మళ్లీ డిలీట్ చేయడంతో పలు రకాల రూమర్లు వైరల్ అయ్యాయి. అయితే ఈ విషయంపై ఆమె క్లారిటీ ఇవ్వలేదు కానీ సింగర్ దిలీప్ స్పందిస్తూ.. “జాను, నేను ప్రేమించుకున్నాము. మా ఇరువురి కుటుంబాలు మా పెళ్ళికి అంగీకరించాయి. ఇక మీరు ఎటువంటి కామెంట్స్ చేసినా మాకు అభ్యంతరం లేదు” అంటూ తెలిపారు. దీంతో వీళ్ళిద్దరూ పెళ్లికి సిద్ధం అయిపోయారని అందరూ ఫిక్స్ అవుతున్నారు.
ఫోక్ డాన్సర్ తో ప్రేమ, పెళ్లి విడాకులు..
ఇకపోతే ఇదంతా బాగానే ఉన్నా ఈమె మొదటి భర్త ఎవరు? ఎందుకు విడిపోయారు? అనే విషయాలు మాత్రం ఇప్పుడు బాగా వైరల్ గా మారుతున్నాయి. కరీంనగర్ జిల్లాలోని గోదావరి ఖని ప్రాంతానికి చెందిన ఈమె మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. డాన్స్ పై ఉన్న ఆసక్తితోనే ఒక డాన్స్ మాస్టర్ దగ్గర చిన్నప్పటినుంచి డాన్స్ నేర్చుకుంది. అప్పట్లో రాజకీయ సభలలో కూడా ఫోక్ డాన్స్ చేస్తూ అందరిని ఆకట్టుకునేది. ఈ క్రమంలోనే టోనీ కిక్ (Tony kick) అనే మరో డాన్స్ తో పరిచయం ఏర్పడి, అతడిని ప్రేమ వివాహం చేసుకుంది.బెల్లంపల్లికి చెందిన టోనీని ప్రేమ పెళ్లి చేసుకున్న తర్వాత వీరిద్దరూ కలసి ఫోక్ పాటలకు డాన్స్ కూడా చేసేవారు. కాలక్రమేనా వీరి బంధానికి గుర్తుగా ఒక కొడుకు కూడా పుట్టాడు. అయితే ఏమైందో తెలియదు కానీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో ఇద్దరూ విడాకులు తీసుకున్నారు.
సింగర్ దిలీప్ తో మళ్ళీ పెళ్లికి సిద్ధమైన జాను..
ఇక భర్త నుంచి వేరుపడిన జాను ఫోక్ సాంగ్స్ చేయడం ప్రారంభించింది. మరొకవైపు టోనీ కూడా ఫోక్ సాంగ్స్ తో మంచి పేరు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం టీవీ షోలు కూడా చేస్తున్నాడు. అటు జాను ఒకవైపు కొడుకుని పోషిస్తూనే..మరొకవైపు తన వృత్తిని కొనసాగిస్తూ వస్తోంది. ఫోక్ సాంగ్స్ తో అదరగొట్టడమే కాకుండా బుల్లితెరపై ఢీ 18 డాన్స్ షోలో పాల్గొని ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఢీ షోలో జాను డాన్స్ చేసిందంటే ఆ వీడియోకి మిలియన్ల కొద్ది వ్యూస్ వచ్చేవి. అంతేకాదు అదే జోష్ తో టైటిల్ కూడా గెలుచుకుంది. ఇక కొడుకుతో ఒంటరిగా ఉంటున్న ఈమె దిలీప్ అనే ఫోక్ ఫింగర్ తో ప్రేమలో పడింది. ఇద్దరు కలిసి అనేక పాటలు కూడా పాడారు. ఈ క్రమంలోనే ప్రేమలో పడడంతో ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్నట్లు అఫీషియల్ గా ప్రకటించారు. ఇక కొడుకుతో కొత్త జీవితం ప్రారంభించబోతున్న జాను లిరి.. ఎప్పుడు పెళ్లి పీటలు ఎక్కుతుందో చూడాలి.
ALSO READ:Reba Monica: ఏంటి.. ఈ టాలీవుడ్ హీరోయిన్ కి పెళ్లైపోయిందా? ఫొటోస్ వైరల్..!