Karla Sofia Gascon : థ్రిల్లర్ చిత్రం ‘ఎమిలియా పెరెజ్’ (Emilia Pérez) ఆస్కార్ 2025 (Oscar 2025) నామినేషన్లలో టాప్ లో నిలిచింది. ఈ మూవీ ఏకంగా 13 కేటగిరీల్లో నామినేషన్ల దక్కించుకుని వార్తల్లో నిలిచింది. ఈ సినిమాలో నటించినందుకు గాను కార్లా సోఫియా గాస్కాన్ (Karla Sofia Gascon) ఉత్తమ నటి కేటగిరీలో నామినేట్ అయ్యారు. అయితే కార్లా అకాడమీ అవార్డ్స్‌లో నామినేషన్ పొంది చరిత్రను సృష్టించింది. ఎందుకంటే ఆమె ఒక ట్రాన్స్ జెండర్. ట్రాన్స్ జెండర్ అయినంత మాత్రాన చరిత్ర కాదు… ఆస్కార్ చరిత్రలోనే నామినేట్ అయిన మొట్ట మొదటి ట్రాన్స్ జెండర్ క్లారానే. మరి ఆమె ట్రాన్స్ జెండర్ గా ఎలా మారింది? పర్సనల్ లైఫ్, మూవీ జర్నీ ఎలా మొదలైంది ? వంటి ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకుందాం పదండి.
కార్లా ప్రయాణం ఎలా మొదలైంది?
కార్లా స్పానిష్ నటి. 1972 మార్చి 31న జన్మించింది. 16 సంవత్సరాల వయస్సులో ఆమెకు యాక్టింగ్ పై మనసు మళ్ళింది. తన కలను సాకారం చేసుకోవడానికి కార్లా మాడ్రిడ్‌లోని ECAM (స్కూల్ ఆఫ్ సినిమాటోగ్రఫీ అండ్ ఆడియోవిజువల్ ఆఫ్ కమ్యూనిటీ ఆఫ్ మాడ్రిడ్) నుండి యాక్టింగ్ లో పట్టా పొందింది. లండన్‌లోని BBCలో కొన్నాళ్ళు టీచర్ గా పని చేసింది. 2000లో ఆమె స్పానిష్ డైలీ షోలలో నటించడం మొదలు పెట్టింది. ఆ తరువాత క్లారాకు అమెరికన్ సినిమాలలో ఛాన్స్ వచ్చింది. కార్లా కామెడీ మూవీ ‘ది నోబుల్ ఫ్యామిలీ’ హిట్ కావడంతో ఆమెకు మంచి ఫేమ్ దక్కింది. 2014లో విడుదలైన ‘ఎల్ సెనోర్ డి లాస్ సియోలోస్’ చిత్రంతో ఆమె మరింత పాపులర్ అయ్యింది.
2018లో ట్రాన్స్ జెండర్ గా టర్న్…
కార్లా 2018లో తాను ట్రాన్స్ జెండర్ గా మారనున్నట్టు ప్రకటించింది. అంతేకాదు ఆమె పుట్టినప్పుడు తల్లిదండ్రులు పెట్టిన పేరు ‘కర్సియా’. అదే పేరుతో స్వీయ చరిత్రను ‘కర్సియా: యాన్ ఎక్స్‌ట్రార్డినరీ’ అనే బుక్ గా రాసి విడుదల చేసింది. ఇందులో ఆమె తన కొత్త పేరును కార్లాగా ప్రకటించింది. లింగ మార్పిడికి సంబంధించి తాను ఎదుర్కొన్న సమస్యల గురించి ఇందులో స్పష్టంగా వెల్లడించింది. ఇక క్లారా నటి మారిసా గుటిరెజ్‌ను వివాహం చేసుకుంది. వారు ఒక నైట్‌క్లబ్‌లో కలుసుకున్నారు. వీరిద్దరికీ 2011లో కూతురు పుట్టింది. ఆమె వయసు 14 సంవత్సరాలు.
‘ఎమిలియా పెరెజ్’కు అవార్డుల వర్షం
‘ఎమిలియా పెరెజ్’ సినిమాతో కార్లాకు ప్రపంచవ్యాప్తంగా పేరు వచ్చింది. ఈ చిత్రంలో ఆమె ఎమిలియా అనే భయంకరమైన డ్రగ్స్ లీడర్ గా నటించింది. లాయర్ సహాయంతో ఆమె తన మరణాన్ని ఎలా ఫేక్ చేసిందో సినిమాలో చూపించారు. కార్లాతో పాటు ఇందులో సెలీనా గోమెజ్, అడ్రియానా పాజ్, మార్క్ ఇవానీర్, ఎడ్గార్ రామిరేజ్ కూడా ముఖ్యమైన పాత్రలు పోషించారు. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘ఎమిలియా పెరెజ్’ చిత్రానికి గానూ క్లారా ఉత్తమ నటి అవార్డును అందుకుంది. ఆమె గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ 2024కి కూడా నామినేట్ అయింది. ఇప్పుడు ఉత్తమ నటి ఆస్కార్ అవార్డును గెలుచుకుంటుందా లేదా ? అనేది మార్చి 3న వెల్లడికానుంది.