CM Chandrbabu on Vijayasai Reddy: ఏపీ సీఎం చంద్రబాబు తొలిసారిగా విజయసాయిరెడ్డి రాజీనామా పై స్పందించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడంతో పాటు, తన ఎంపీ పదవికి కూడా విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయం ప్రస్తుతం ఏపీలో హాట్ టాపిక్ గా మారగా, వైసీపీ క్యాడర్ నివ్వెర పోయిందని చెప్పవచ్చు. అయితే ఇదే అంశంపై సీఎం చంద్రబాబు శనివారం మాట్లాడారు.
విజయసాయిరెడ్డి తన రాజీనామా ప్రకటనలో సీఎం చంద్రబాబుకు తనకు రాజకీయంగా మాత్రమే విభేదాలు ఉన్నాయని, వ్యక్తిగతంగా విభేదాలు లేవంటూ పేర్కొన్నారు. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో సైతం చిరకాల స్నేహం ఉన్నట్టు ప్రకటించారు. తెలుగుదేశం పార్టీతో కేవలం రాజకీయంగా మాత్రమే విభేధించానని, వ్యక్తిగత వైరాలు లేవన్నారు. ఈ కామెంట్స్ పై సీఎం చంద్రబాబు స్పందించారు.
Also Read: RK Roja: రోజాపై టీడీపీ ఎమ్మేల్యే జబర్దస్త్ పంచులు.. ఏకంగా అలా అనేశారేంటి?
సీఎం మాట్లాడుతూ.. సహజంగా రాజకీయ నేతలకు తామున్న పార్టీపై నమ్మకం లేనప్పుడే ఇంకొక పార్టీకి వెళ్లడం జరుగుతుందన్నారు. కానీ నిన్నటి వరకు వైసీపీలో కొనసాగిన విజయసాయిరెడ్డి, పార్టీ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకొని పార్టీకి దూరమయ్యారన్నారు. అలాగే ఈ అంశం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందినదిగా అభివర్ణించిన సీఎం చంద్రబాబు, ఇంతకంటే స్పందించడం మంచిది కాదంటూ మాట్లాడారు. మొత్తం మీద రాష్ట్రంలో వైసీపీ పని అయిపోయిందని గ్రహించే, విజయ సాయి రెడ్డి రాజీనామా చేసినట్లు చంద్రబాబు చెప్పకనే చెప్పారు.