Sai Rajesh: ఈమధ్య కాలంలో వరుస సక్సెస్ లు అందుకుంటూ.. బిజీ డైరెక్టరుగా మారిపోయారు అనిల్ రావిపూడి(Anil Ravipudi). ఇప్పుడు తాజాగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో మరోసారి పర్వాలేదనిపించుకున్నారు. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ (Venkatesh)హీరోగా నటించగా.. ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh), మీనాక్షి చౌదరి (Meenakshi Choudhary) హీరోయిన్లుగా నటించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు సమర్పణలో వచ్చిన ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 14వ తేదీన విడుదల అయ్యింది. కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా వచ్చిన ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్ ను బాగా మెప్పించింది. ముఖ్యంగా పాటలతోనే ఈ సినిమా ఫుల్ క్రేజ్ తెచ్చుకోగా.. మొదటి రోజు ఈ సినిమా రూ.45 కోట్ల గ్రాస్ వసూల్ చేసింది.
విమర్శలపై స్పందించిన అనిల్ రావిపూడి..
వాస్తవానికి ఇండస్ట్రీలోకి వచ్చిన తొలి రోజు నుంచి అనిల్ రావిపూడి కామెడీని నమ్ముకుని ఫ్యామిలీ ఆడియన్స్ టార్గెట్ గా సినిమాలు చేస్తున్నారు.అయితే కొంతమంది యూట్యూబ్ రివ్యూయర్స్ తోపాటు కొంతమంది ఆకతాయిలు అనిల్ రావిపూడిది క్రింజ్ కామెడీ (సిగ్గుపడేలా చేసే కామెడీ) అని ట్రోల్స్ చేస్తున్నారు. ముఖ్యంగా ఒక రకమైన జబర్దస్త్ కామెడీ అని, కథ ఉండదని, ఏదో నెట్టుకొచ్చేస్తాడని చేస్తున్న నేపథ్యంలో.. ఈ ట్రోల్స్ గురించి ఒక ఇంటర్వ్యూలో రియాక్ట్ అయ్యారు అనిల్ రావిపూడి.ఆయన మాట్లాడుతూ..” నేను ఇటువంటి ట్రోల్స్ పట్టించుకోను. నా ఆడియన్స్ ఉన్నారు. ముఖ్యంగా వాళ్ల కోసమే నేను సినిమాలు తీస్తాను” అని కామెంట్ చేశారు. అయితే ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా కూడా ఫ్యామిలీ ఆడియన్స్ ని ఒప్పిస్తున్నా సరే.. కొంతమంది మాత్రం ఎప్పటిలాగే టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు.
ట్రోలర్స్ కి కౌంటర్ ఇచ్చిన సాయి రాజేష్..
ఈ నేపథ్యంలోనే బేబీ (Baby) డైరెక్టర్ సాయి రాజేష్ (Sai Rajesh) అనిల్ రావిపూడిని టార్గెట్ చేస్తూ విమర్శలు చేసే వారిపై కౌంటర్లు వేసారు. ఈ మేరకు ఒక పోస్ట్ కూడా షేర్ చేశాడు సాయి రాజేష్. రాజేష్ తన పోస్ట్ లో.. “కొంతమంది అనిల్ రావిపూడి కంటెంట్ ని రాడ్ పూడి అంటున్నారు. కొంతమంది క్రిటిక్స్ క్రింజ్ అంటున్నారు. ఇంకొంతమంది యూట్యూబర్లు ఈయనను ట్రోల్స్ చేస్తూ వీడియోలు కూడా చేస్తున్నారు. అయినా ఈయన ఎప్పుడూ కూడా తన మార్గాన్ని మాత్రం మార్చుకోలేదు. ఇతని సినిమాల టికెట్స్ కొని నిర్మాతలకు ప్రాఫిట్స్ ఇచ్చే ఆడియన్స్ ని మాత్రమే ఇతడు గౌరవిస్తాడు. ముఖ్యంగా తన మనసు చెప్పిన మాటే వింటాడు. ఎవరి ట్రాప్ లో కూడా పడడు. ఈమధ్య 8 వరుస హిట్స్ అందుకుని సక్సెస్ఫుల్గా నిలిచాడు. వందల మంది కుటుంబాలు టికెట్లు కొనుక్కొని ఆయన సినిమాలు చూస్తున్నారు. ముఖ్యంగా వారి సమస్యలన్నీ మరిచిపోయి పగలబడి నవ్వుతూ కాస్త రిలీఫ్ అవుతున్నారు. మీరు కూడా మీ మనసు ఏం చెబితే అదే వినండి. ఎవరు చెప్పేది వినకండి. మనసా వాచా కర్మణా మీ పని మీరు చేయండి.. అనిల్ రావిపూడి కి కంగ్రాట్స్.. ప్రతి దర్శకుడు కూడా నీ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు” అంటూ సాయి రాజేష్ తెలిపారు. మరి ఇకనైనా ట్రోల్స్ ఆగుతాయేమో చూడాలి.