BigTV English

Akkineni Family: అక్కినేని ఫ్యామిలీ ఫోటోలో ఆ స్టార్ హీరోయిన్ కూతురు.. ఎందుకు ఉన్నట్టు.. ?

Akkineni Family: అక్కినేని ఫ్యామిలీ ఫోటోలో ఆ స్టార్ హీరోయిన్ కూతురు.. ఎందుకు ఉన్నట్టు.. ?

Akkineni Family: లెజండరీ నటుడు  అక్కినేని నాగేశ్వరరావు   100 సంవత్సరాల వేడుకను అక్కినేని కుటుంబం అన్నపూర్ణ స్టూడియోస్ లో ఘనంగా నిర్వహించిన విషయం తెల్సిందే.  ఏఎన్నార్ 100 వ జయంతిని  కొడుకు నాగార్జున ఎంతో గొప్పగా నిర్వహించాడు.  అన్నపూర్ణ స్టూడియోస్ లోని అక్కినేని విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించారు. ఇంకా చెప్పాలంటే ఈ వేడుకలు ఇప్పుడే కాదు గత కొన్నిరోజులుగా క్రితమే మొదలయ్యాయి.


ఏఎన్నార్ 100 ఇయర్స్ సందర్భంగా ఆయన నటించిన కొన్ని ఐకానిక్ సినిమాలను  ప్రేక్షకుల కోసం రీ రిలీజ్ చేశారు. ANR100 ఫిల్మ్ ఫెస్టివల్..  హైదరాబాద్‌లో దేవదాసు 4K స్క్రీనింగ్‌తో ప్రారంభమైంది. 31 నగరాల్లో ఏఎన్నార్  యొక్క 10 ఐకానిక్ చిత్రాలను ప్రేక్షకులకు ఉచితంగా ప్రదర్శిస్తున్నారు. ఈ సందర్భంగా  ఏఎన్ఆర్ గౌరవార్థం ప్రత్యేక పోస్టల్ స్టాంపును ఏఎన్నార్ 100 ఇయర్స్ వేడుకలో  విడుదల చేశారు.

అంతేకాకుండా అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి సందర్భంగా ఈ ఏడాది ఏఎన్నార్ అవార్డ్ ను చిరంజీవికి ఇవ్వనున్నట్లు నాగార్జున అధికారికంగా  ప్రకటించాడు. అక్టోబర్ 28 న అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా ఈ అవార్డు ను ప్రదానం  చేయనున్నారు. ఇక ఈ వేడుకలో భాగంగా  అక్కినేని కుటుంబం 600 మంది అభిమానులకు దుస్తులు పంపిణీ చేశారు. ఇక    ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. 


తాజాగా అక్కినేని ఫ్యామిలీ ఫోటో ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.  ఈ ఫొటోలో అక్కినేని వారసులందరూ  కనిపించారు. అక్కినేని నాగార్జున- అక్కినేని అమల.. వారి కుమారులు అక్కినేని నాగ చైతన్య, అక్కినేని అఖిల్. ఇక నాగార్జున అన్న అక్కినేని వెంకట్- అక్కినేని జోత్స్న.. వారి పిల్లలు. ఇక నాగ్ సోదరి నాగ సుశీల.. ఆమె కొడుకు సుమంత్. ఇంకో సోదరి సరోజ అక్కినేని కొడుకు సుమంత్ , కూతురు సుప్రియ.. ఇంకో సోదరి సత్యవతి పిల్లలు.. వారి పిల్లలు కూడా కనిపించారు. అయితే ఈ ఫ్యామిలీ ఫొటోలో  అక్కినేని కుటుంబానికి సంబంధం లేని ఒక మహిళ ఉండడం విశేషం.

అయ్యొయ్యో ఎవరామె.. ?  ఎందుకు ఉంది .. ? అని తప్పుగా  అనుకోకండి. ఆమె ఎవరో కాదు మహనటి సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరి.  సావిత్రి బయోపిక్  మహానటి సినిమా తరువాత  విజయ చాముండేశ్వరి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్నో ఇంటర్వ్యూలలో తల్లి గురించి ఎన్ని విషయాలను పంచుకుంది.

ఇక ఏఎన్నార్ 100 ఇయర్స్ వేడుకకు ఆమె ముఖ్య అతిధిగా విచ్చేసింది.  వేడుక అనంతరం ఆమె  అక్కినేని ఫ్యామిలీ ఫొటోలో ఇదుగో ఇలా  కలిసిపోయింది.  దీంతో  ఈమె ఎవరో తెలియని వారు.. అక్కినేని ఫ్యామిలీలో ఉన్న ఈమె ఎవరు అని కొందరు.. అక్కినేని ఫ్యామిలీ ఫొటోలో  ఈమె ఎందుకు ఉంది అని ఇంకొందరు మాట్లాడుకుంటున్నారు.  ఏదిఏమైనా ఈ ఫోటో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×