Kannappa Movie: మంచు విష్ణు (Manchu Vishnu) తన డ్రీం ప్రాజెక్టు కన్నప్ప సినిమా(Kannappa Movie) ద్వారా జూన్ 27వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. దాదాపు పది సంవత్సరాలపాటు ఈ సినిమా కోసం విష్ణు ఎంతో కష్టపడ్డారని, కన్నప్ప సినిమా చేయటం తన కల అని తెలిపారు. ఇక ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ జూన్ 27వ తేదీ విడుదల కావడానికి సిద్ధమవుతోంది. ఇక ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా మంచు విష్ణుతో పాటు మోహన్ బాబు వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు.
తాజాగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా మంచు విష్ణుకు దర్శకుడు(Director) గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ సినిమాకు బాలీవుడ్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్(Mukesh Kumar Singh) దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఈయన హిందీ మహాభారతం సిరీస్ కు దర్శకత్వం వహించిన నేపథ్యంలో ఈయన అయితే కన్నప్ప సినిమాని అద్భుతంగా చేయగలరనే ఉద్దేశంతోనే బాలీవుడ్ డైరెక్టర్ ను ఎంపిక చేశారని తెలుస్తుంది. అయితే ఇదే విషయం గురించి మంచి విష్ణుకు ప్రశ్న ఎదురు అయింది తెలుగులో ఎంతోమంది గొప్ప గొప్ప దర్శకులు ఉన్నారు.
తెలుగులో గొప్ప దర్శకులు…
మన టాలీవుడ్ ఇండస్ట్రీలో కొనసాగుతున్న దర్శకులు ఎన్నో పౌరాణిక చిత్రాలను, భక్తి సినిమాలను అద్భుతంగా తెరకెక్కిస్తూ మంచి గుర్తింపు పొందారు. మన తెలుగు దర్శకుల గురించి పాన్ ఇండియా స్థాయిలోనే కాకుండా హాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఎంతో గొప్పగా మాట్లాడుతున్నారు. ఇలా వీరందరినీ కాదని బాలీవుడ్ డైరెక్టర్ ఈ ప్రాజెక్టులోకి రావడం వెనుక కారణమేంటని ప్రశ్న వేశారు.
క్రిష్ జాగర్లమూడి…
ఈ ప్రశ్నకు విష్ణు సమాధానం చెబుతూ… టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది గొప్ప దర్శకులు ఉన్నారు. అయితే సీనియర్ దర్శకులలో మాత్రం ఈ సినిమాని ఎవరూ అనుకున్న స్థాయిలో చేయలేరనేది నా భావన, ఇక ప్రస్తుత దర్శకులలో కన్నప్ప లాంటి గొప్ప సినిమాని చేసే సత్తా ఉన్న డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి (Krish Jagarlamudi) అని తెలిపారు. ఆయనతో ఈ సినిమా చేయాలనే ఆలోచన నాకైతే వచ్చింది కానీ అప్పటికే క్రిష్ రెండు మూడు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.
ఇలా వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న క్రిష్ ఈ సినిమా కోసం కమిట్ అయితే సినిమా మరింత ఆలస్యం అవుతుంది. ఆ ఒక్క కారణంతోనే క్రిష్ వరకు వెళ్లలేదని తెలిపారు. ఇక నాన్న మహాభారతం కొన్ని ఎపిసోడ్స్ చూశారు. చాలా అద్భుతంగా చేయడంతో ముఖేష్ కుమార్ సింగ్ ను నాన్న సెలెక్ట్ చేశారని, అనుకున్న విధంగానే ముఖేష్ సినిమాని చాలా అద్భుతంగా తీర్చిదిద్దారంటూ ఈ సినిమా కోసం బాలీవుడ్ డైరెక్టర్ పనిచేయటం, తెలుగువారు పనిచేయకపోవడం గురించి మంచి విష్ణు క్లారిటీ ఇచ్చారు. ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న నేపథ్యంలో ఇతర భాష సెలబ్రిటీలు కూడా భాగమవుతున్న నేపథ్యంలో సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి.