BigTV English

OTT Movie : గురువారం 16 మంది పిల్లల్ని కిడ్నాప్ చేసే టీచర్… కేక పెట్టించే ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : గురువారం 16 మంది పిల్లల్ని కిడ్నాప్ చేసే టీచర్… కేక పెట్టించే ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie  : ముంబైలో ఒక సాధారణ గురువారం రోజు… ఒక ప్రీ-స్కూల్ టీచర్ 16 మంది చిన్న పిల్లలను బంధిస్తుంది. ఆమె ఒక సామాన్య స్త్రీ, కానీ ఆమె డిమాండ్‌ లు దేశాన్ని కుదిపేస్తాయి. పోలీసులు, మీడియా, ప్రభుత్వం ఆమె ఆటలో చిక్కుకుంటాయి. ఈ అమ్మాయి ఎవరు? ఆమె ఇలాంటి దారుణమైన చర్యకు ఎందుకు పాల్పడింది? ఆమె డిమాండ్లు ఏమిటి? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.


కథలోకి వెళ్తే…

నైనా జైస్వాల్ (యామి గౌతమ్), ఒక ప్రీ-స్కూల్ టీచర్. ఎప్పటిలా బిజీగా ఉండే ఓ గురువారం రోజు… తాను టీచర్ గా పని చేస్తున్న లిటిల్ డాట్స్ ప్లే స్కూల్‌లో 16 మంది చిన్న పిల్లలను ఆమె కిడ్నాప్ చేస్తుంది. ఆమె పిల్లలకు హాని చేయనని చెప్పినప్పటికీ, తన డిమాండ్‌ లను ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేస్తుంది. లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తుంది. ఈ ఊహించని చర్య ముంబై పోలీసులను, మీడియాను, దేశవ్యాప్తంగా ప్రజలను షాక్‌ లోకి నెట్టేస్తుంది.


ACP కేథరీన్ రావత్ (డింపుల్ కపాడియా) టెర్రరిస్ట్ లతో డీల్ చేయగల బెస్ట్ నెగోషియేటర్. నైనా సమస్యను పరిష్కరించే బాధ్యతను తీసుకుంటుంది. ఆమెతో కలిసి ఇన్‌స్పెక్టర్ జావేద్ ఖాన్ (అతుల్ కులకర్ణి), ఆమె అసిస్టెంట్ శివ నాథ్ (కరణ్వీర్ శర్మ) పని చేస్తారు. నైనా డిమాండ్‌ లు రాజకీయ, సామాజిక అంశాలతో ముడిపడి ఉంటాయి. ఇవి ప్రధానమంత్రి శ్వేతా చౌహాన్ (నీరజ్ కబి) కార్యాలయాన్ని కూడా కదిలిస్తాయి. నైనా చేస్తున్న ఈ పని వెనుక ఒక లోతైన వ్యక్తిగత, సామాజిక ఉద్దేశం ఉందని క్రమంగా తెలుస్తుంది. ఆ ఉద్దేశం ఆమె గతంలోని ట్రామాను, సమాజంలోని అన్యాయాలను వెలికితీస్తుంది.

కేథరీన్, నైనా ఉద్దేశాలను అర్థం చేసుకోవడానికి ఆమెతో సైకలాజికల్ గేమ్ ఆడుతుంది. అదే సమయంలో పిల్లలను జాగ్రత్తగా కాపాడటానికి ప్రయత్నిస్తుంది. నైనా డిమాండ్‌లు, ఆమె చర్యలు, ఆమె గతం క్రమంగా బయటపడుతూ… సమాజంలో మహిళల భద్రత, న్యాయం, సిస్టమ్ లోపాల వంటి అంశాలను మరోసారి ఆలోచించేలా చేస్తుంది. ఇంతకీ ఆ టీచర్ ఉద్దేశం ఏంటి? ఆమె డిమాండ్ లను గవర్నమెంట్ నెరవేర్చిందా? అసలు ఆమె డిమాండ్లు ఏంటి? చిన్న పిల్లలు ఆమె దగ్గర నుంచి సేఫ్ గా బయట పడ్డారా? అనే ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఈ సినిమాను చూడాల్సిందే.

Read Also : ఒకే ఒక్క ఫోన్ కాల్ తో కేసు సాల్వ్… గ్రిప్పింగ్ థ్రిల్లర్… ఈ లేడీ సింగమ్ అడ్వెంచర్ కు హ్యాట్సాఫ్

ఏ ఓటీటీలో ఉందంటే?

ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఇంటెన్స్ సస్పెన్స్ థ్రిల్లర్ పేరు ‘ A Thursday’. 2022లో రిలీజ్ అయిన ఈ మూవీ ముంబైలో జరిగే ఒక గ్రిప్పింగ్ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్. ఇది ఒక సాధారణ గురువారం రోజు జరిగే ఊహించని సంఘటనల చుట్టూ తిరుగుతుంది. Hotstarలో అందుబాటులో ఉన్న ఈ సినిమాకు IMDbలో 7.7 రేటింగ్ ఉంది. ఇందులో యామి గౌతమ్, డింపుల్ కపాడియా, అతుల్ కులకర్ణి, నీరజ్ కబి, కరణ్వీర్ శర్మ, మాయ సరావ్ తదితరులు నటించారు. దర్శకుడు బెహ్జాద్ ఖంబాటా.

Related News

Ghaati OTT : అనుష్కకు ఘోర అవమానం… 20 రోజుల్లో జీరో థియేటర్స్

Junior Movie: ఓటీటీలోకి జూనియర్ మూవీ..ఆ రోజే స్ట్రీమింగ్!

OTT Movie : టెర్రరిస్టులకే టెర్రర్ పుట్టించే ఆడపులి… ప్రతీ 5 నిమిషాలకో ట్విస్ట్… నరాలు కట్ అయ్యే సస్పెన్స్ థ్రిల్లర్

OTT Movie : షార్క్‌లను దేవతలుగా భావించే సైకో… ఆడవాళ్లను బలిచ్చి దిక్కుమాలిన పని… గ్రిప్పింగ్ సర్వైవల్ హారర్ థ్రిల్లర్

OTT Movie : తల్లీకూతుర్లు ఇద్దరితో ఒక్కడే… ఐఎమ్‌డీబీలో రేటింగ్ 9.1… తెలుగు మూవీనే మావా

OTT Movie : రోబోని కూడా వదలకుండా ఆటగాడి అరాచకం… అదిచ్చే షాక్ కు మైండ్ బ్లాంక్

OTT Movie : మనుషులకు తెలియకుండా మాయదారి పనులు… ఫ్యూచర్లో ఏఐ ఇంత డేంజర్ స్టంట్స్ చేస్తుందా మావా ?

OTT Movie : బాడీ బిల్డర్ తో ఆ పాడు పని… ఈ నలుగురు ఆడవాళ్ళూ అరాచకం మావా… సింగిల్ గా చూడాల్సిన మూవీ

Big Stories

×