BigTV English

Nagarjuna : హాలో బ్రదరూ… ఈ వందతో అయినా… ఆ వంద కొట్టు

Nagarjuna : హాలో బ్రదరూ… ఈ వందతో అయినా… ఆ వంద కొట్టు

Nagarjuna : అక్కినేని నాగార్జున ఓ మైలు రాయి అందుకోవడానికి అతి దగ్గరలో ఉన్నాడు. ఇప్పటి వరకు ఆయన హీరోగా 99 సినిమాలు చేశాడు. చివరి సినిమా నా సామి రంగ. ఇది 2024 సంక్రాంతికి వచ్చి మంచి విజయాన్ని నమోదు చేసింది. ఇప్పుడు 100వ మూవీకి నాగ్ కోసం సన్నాహాలు చేస్తున్నాడు.


ఈ మైలు స్టోన్ మూవీతో అయినా… నాగార్జునకు ఓ కలల మిగిలిపోయిన రికార్డును అందుకుంటాడా… అక్కినేని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

అవును… ఎన్నో సినిమాలు చేసిన అక్కినేని ఫ్యామిలీకి 100 కోట్లు అనేది కలలానే ఉండేది. ఈ మధ్య అక్కినేని నాగ చైతన్య తండేల్ మూవీతో 100 కోట్ల క్లబ్‌లో చేరాడు. కానీ, నాగార్జున మాత్రం 99 సినిమాలు చేసినా… ఒక్క సినిమా కూడా 100 కోట్లను అందుకోలేడు.


ఇన్ని ఏళ్ల కెరీర్‌లో నాగ్ నుంచి ఒక్కటి అంటే ఒక్క 100 కోట్ల మూవీ కూడా రాలేదు. హైయెస్ట్ అంటే… 85 కోట్లే. 2016లో వచ్చిన సోగ్గాడే చిన్ని నాయన అనే మూవీకి ఈ 85 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. ఊపిరి మూవీ చివరి థియేట్రికల్ రన్ వరకు చూస్తే 90 కోట్లు లాక్కొచ్చింది. కానీ, అది ఓ మల్టీస్టారర్ మూవీ. కాబట్టి ఫుల్ క్రెడిట్ నాగార్జనకు మాత్రమే ఇవ్వలేం. క్రెడిట్ ఇచ్చినా… ఆ… మూవీ కూడా 100 కోట్ల మార్క్ అందుకోలేదు.

అలా… నాగార్జున కెరీర్‌లో ఉన్న ఆ కలను తీర్చుకునే టైం వచ్చేసింది అని అంటున్నారు ఆయన ఫ్యాన్స్. నాగార్జున చేస్తున్న 100వ మూవీని 100 కోట్లు కలెక్ట్ చేసేలా ప్లాన్ చేసుకోవాలని నాగ్‌ను కోరుతున్నారు.

ప్రస్తుతం నాగ్… కుబేర, కూలీ సినిమాలు చేస్తున్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత 100వ మూవీ స్టార్ట్ కాబోతుంది. దీని కోసం ఇప్పటి నుంచే… పనులు మొదలుపెట్టాడు నాగ్. అంతే కాదు… 100వ మూవీ కోసం కథలు కూడా వింటున్నాడట. ఓ నిర్మాత సాయంతో… 100వ మూవీకి సంబంధించి కథలు సెర్చింగ్ జరుగుతుందని టాక్.
ఈ మధ్యనే నితమ్ ఒరు వానంను డైరెక్ట్ చేసిన కార్తిక్ ఓ కథను వినిపించాడట. కథ కొంత వరకు నచ్చినా… చేయాల్సింది 100వ మూవీ… ముందు భారీ టార్గెట్ ఉంది కాబట్టి.. ప్రస్తుతం ఆలోచనలో పడ్డారట.

అయితే.. ఇలా ఇతర ఇండస్ట్రీ డైరెక్టర్లు కాకుండా.. తెలుగులోనే ఉండే ఓ పెద్ద డైరెక్టర్ తో సినిమా చేసి 100 కోట్లను కలెక్ట్ చేస్తు బెటర్ అని అక్కినేని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

ఏది ఏమైనా… నాగ్ ప్రస్తుతం చేస్తున్న కుబేర, కూలీ సినిమాలు షూటింగ్ అవ్వడానికి ఇంకా టైం పట్టేలా ఉంది. ఆ.. లోపు 100వ మూవీ స్టోరీ ఫైనల్ చేసి.. షూటింగ్ సెట్స్ పైకి వెళ్లాలని నాగ్ చూస్తున్నారు.

100 కోట్లు.. నాగ్ ఒక్కరే…

కాగా, 100 కోట్లు కలెక్ట్ చేయడంలో సీనియర్ హీరోలు అందరూ సక్సెస్ అయ్యారు. ఇటీవల వెంకీ కూడా సంక్రాంతికి వస్తున్నాం మూవీతో ఆ ఫీట్ అందుకున్నాడు. ఇక మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ 100 కోట్ల మార్క్ ను ఎప్పుడో టచ్ చేశారు. ఇప్పుడు ఓన్లీ నాగ్ మాత్రమే ఈ 100 కోట్లను టచ్ చేయాల్సి ఉంది. 100వ మూవీతో అయినా… 100 కోట్లను టచ్ చేస్తాడా…? చూడాలి మరి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×