BigTV English

Kayadu Lohar: చెప్పిన మాట నిలబెట్టుకున్నాడు.. అతడి రుణం తీర్చుకోలేనంటూ కాయదు ఎమోషనల్ పోస్ట్

Kayadu Lohar: చెప్పిన మాట నిలబెట్టుకున్నాడు.. అతడి రుణం తీర్చుకోలేనంటూ కాయదు ఎమోషనల్ పోస్ట్
Advertisement

Kayadu Lohar: ఏ హీరోకు అయినా, హీరోయిన్‌కు అయినా లైఫ్ టర్న్ అయిపోయే సినిమా ఒకటి ఉంటుంది. అంతకు ముందు వారు ఎన్ని సినిమాల్లో నటించినా కూడా ఆ ఒక్క సినిమా వల్లే వారి కెరీర్ సెట్ అయిపోతుంది. అలా యూత్‌కు లేటెస్ట్ క్రష్‌గా మారిపోయిన కాయదు లోహర్ కెరీర్‌ను మార్చేసిన మూవీ ‘డ్రాగన్’. అశ్వత్ మరిముత్తు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో పల్లవి అనే పాత్రలో ప్రేక్షకులను కట్టిపడేసింది కాయదు. ఒక్కసారిగా సోషల్ మీడియాలో సెన్సేషన్ కూడా క్రియేట్ చేసింది. అసలు దీనంతటికి కారణమయిన ఒక వ్యక్తి గురించి చెప్తూ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది కాయదు లోహర్ (Kayadu Lohar). ఇందులో భాగమయిన అందరికీ థాంక్యూ చెప్పుకుంది.


బాధగా అనిపించింది

‘డ్రాగన్ సినిమా నా జీవితాన్ని మార్చేసింది. డ్రాగన్.. నాకు ఇంకా గుర్తుంది అశ్వత్ మురుముత్తు మొదటిసారి ఈ సినిమా కథను నాకు జూమ్ కాల్‌లో వివరించాడు. అప్పుడు కీర్తి పాత్రలో నటించడం కోసం ఈ కథను చెప్పాడు. నాకు పర్ఫార్మ్ చేయడానికి మంచి క్యారెక్టర్ దొరికిందని చాలా ఎగ్జైట్ అయ్యాను. కానీ ఎందుకో మళ్లీ తను నాకు ఫోన్ చేయలేదు. నిజం చెప్పాలంటే నాకు చాలా బాధగా అనిపించింది. ప్రాజెక్ట్ చేజారిపోయిందని అనుకున్నాను. కానీ దాని వెనుక ఒక కారణం ఉంది. ఒక నెలరోజుల తర్వాత అశ్వత్ మళ్లీ నాకు ఫోన్ చేశాడు. ఈసారి పల్లవి పాత్ర గురించి చెప్పాడు. మీటింగ్ అయిపోయిన తర్వాత పల్లవి పాత్ర ఎందుకు? కీర్తి పాత్ర ఎందుకు కాదు? అని నేను కన్ఫ్యూజన్‌లో పడిపోయాను’ అని చెప్పుకొచ్చింది కాయదు లోహర్.


ప్రేమలో పడతారని చెప్పాడు

‘మీటింగ్ అయిపోయి తను వెళ్లిపోయాడు. అయిదు నిమిషాల తర్వాత మళ్లీ వచ్చి కాయదు.. డ్రాగన్, పల్లవి అనేవి నీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి. ఇద్దరు హీరోయిన్లు అని ఆలోచించకు. ఈ పాత్రకు దానికంటే ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. ప్రేక్షకులు నీతో, పల్లవితో ప్రేమలో పడిపోయేలాగా నిన్ను చూపిస్తానని మాటిస్తున్నాను అన్నాడు. అలాగే చేశాడు. నువ్వు ఇచ్చిన ప్రతీ మాట నిలబెట్టుకున్నందుకు థాంక్యూ అశ్వత్’ అంటూ దర్శకుడి గురించి మాత్రమే కాదు హీరో ప్రదీప్ గురించి కూడా చెప్పుకొచ్చింది కాయదు. ‘మీ కో స్టార్‌లో ఒక మంచి ఫ్రెండ్ దొరకడం చాలా అరుదు. అలా నాకు ప్రదీప్ దొరికాడు. నీ అనుభవాలు, పైకి ఎదగడానికి నువ్వు పడిన కష్టాలు అన్నీ కలగలిపితేనే నువ్వు’ అంటూ ప్రదీప్‌ను ప్రశంసించింది కాయదు.

Also Read: 20 ఏళ్ల క్రితం చెప్పావ్, ఇప్పుడు చేశావ్.. మాజీ భార్యకు హృతిక్ రోషన్ లేఖ

క్లోజ్ అయిపోయాం

‘ప్రదీప్.. నువ్వు చెప్పినవి అన్నీ నా మైండ్‌లో గుర్తుండిపోతాయి. మనం సెట్‌లో మాట్లాడుకోని రోజుల నుండి ఇప్పుడు ప్రతీ ఒక్కటి షేర్ చేసుకునేంత క్లోజ్ అయ్యాం. మనమిద్దరం ఎప్పుడూ ఎత్తుకు ఎదగాలనే ఆలోచనలోనే ఉంటాం. నువ్వు చాలా టాలెంటెడ్, గొప్ప నటుడివి’ అంటూ ‘డ్రాగన్’ కోసం కష్టపడిన ప్రతీ ఒక్కరి గురించి గొప్పగా చెప్పింది కాయదు లోహర్. ఇక తన ప్రొడ్యూసర్ అర్చన కల్పతి గురించి కూడా ప్రస్తావించింది. మొత్తానికి ‘డ్రాగన్’ తమిళంలోనే కాదు.. తెలుగులో కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. దీంతో ప్రదీప్ రంగనాథన్ కూడా తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరయ్యాడు. కాయదు అయితే యూత్‌కు క్రష్‌గా మారిపోయింది.

Related News

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Mouli: పోలీస్ గెటప్ లో అదరగొట్టేసిన లిటిల్ హార్ట్స్ హీరో.. ఇదిగో వీడియో!

Sree Leela: శ్రీలీల 150 కోట్ల యాడ్ ఫిలిం టీజర్ చూశారా..ఏంటి స్వామీ ఈ అరాచకం!

Influencer Bhavani Ram : కన్నీళ్లు తెప్పిస్తున్న ఇన్‌ఫ్లుయెన్సర్ భవాని స్టోరీ… అప్పుడు ట్రోల్ చేశారు.. ఇప్పుడు సంపాదన ఎంతంటే?

Lazawal Ishq Show: పాక్‌‌లో డేటింగ్ రియాల్టీ షో.. వెంటనే ఆపాలంటూ గోలగోల, ఎందుకంటే?

Venu Swamy: శత్రువుల నాశనం కోసం వేణు స్వామి పూజలు…నీటిపై తేలియాడుతూ అలా!

Big Stories

×