Rashmika Mandanna: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న గురించి రకరకాల వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. నిన్న మొన్నటివరకు ఆమె వరుస సినిమాలను చేస్తూ బిజీగా ఉందనే వార్త వినిపించగా ఇప్పుడు సినిమాలకు దూరం అంటూ మరో వార్త సోషల్ వినిపిస్తుంది. ఇండియన్ సినిమా దగ్గర ఫుల్ ఫామ్ లో ఉన్నటువంటి టాప్ మోస్ట్ హీరోయిన్స్ లో మన సౌత్ నుంచి ఉన్న హీరోయిన్స్ చాలా తక్కువే అని చెప్పాలి. మెయిన్ గా హిందీ సినిమా నుంచి హీరోయిన్స్ కనిపిస్తూ ఉంటారు కానీ సౌత్ నుంచి నార్త్ లోకి వెళ్లి న తర్వాత అక్కడే వరుస సినిమాలు చేస్తూ బిజీ అవ్వాలని అనుకుంటారు. నార్త్ లో అవకాశాలు వస్తే తెలుగులో భారీ ప్రాజెక్టులలో ఛాన్స్ వచ్చినా రిజెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు రష్మిక కూడా అదే పనిలో ఉందని ఓ వార్త ప్రచారంలో ఉంది. అందులో నిజమేంత ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..
టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం క్రేజీ హీరోయిన్ గా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. హీరోయిన్ ఇపుడు హిందీ సినిమాని రూల్ చేస్తుంది. కాగా ఆ హీరోయిన్ మరెవరో కూడా కాదు నేషనల్ క్రష్ రష్మిక మందన్నానే.. కాగా రష్మిక మందన్నా అవ్వడానికి కన్నడ బ్యూటీ అయినప్పటకీ అక్కడ నుంచి తెలుగులో ఎప్పుడైతే ఎంట్రీ ఇచ్చిందో అక్కడ నుంచి రష్మిక జాతకమే మారిపోయింది. ఈమె హిందీలో సినిమాలను చేస్తూ బిజీగా మారింది. మొదటి మూవీ యానిమల్, అలాగే నిన్న ఛావా ప్రేక్షకులకు దగ్గరైంది.
బాలీవుడ్ లో వరుస ఆఫర్స్ అది కూడా భారీ రెమ్యునరేషన్ లు కూడా ఆఫర్ చేస్తుండడంతో తెలుగు సినిమా అందాకా పక్కన పెట్టేస్తుంది అన్నట్టుగా రూమర్స్ మొదలయ్యాయి. కాగా ఇందులో ప్రస్తుతానికి నిజం లేదని తెలుస్తుంది. నిజానికి ఈ అమ్మడు చేతి నిండా సినిమాలతో బాగా బిజీగా ఉంది. తెలుగులో గత ఏడాది పుష్ప 2 మూవీ చేసింది. ఆ తర్వాత జెంట్ షూటింగ్ స్టేజిలో ఉన్నవి కాకుండా నెక్స్ట్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినిమాకి కూడా ఆమె పేరు వినిపిస్తుంది. కాగా ఇప్పటికే సుకుమార్ రష్మికకి భారీ హిట్స్ పుష్ప 1, పుష్ప 2 లు ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా వాటి తర్వాత మళ్ళీ మూడోసారి రామ్ చరణ్ తో సినిమాకి కూడా అవకాశం ఇవ్వనున్నట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి.. ఇక ఈమె తెలుగు సినిమాలకు గుడ్ బై చెప్పేస్తుందేమో అనే సందేహాలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.. ఏది ఏమైన తెలుగులో ఈమె లక్కీ హీరోయిన్ అయ్యింది. వరుసగా సినిమాలు చేసి బిజీ అయ్యింది. ఇప్పటివరకు ఈమె నటించిన ప్రతి మూవీ కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు హిందీ, తమిళ ఇండస్ట్రీలో వరుసగా సినిమాలు చేస్తుంది. అటు కన్నడ ఇండస్ట్రీలో కూడా సినిమాలు చేస్తున్నారని టాక్..