BigTV English
Advertisement

OTT Movie : జలకన్యతో ప్రేమలో పడే సాహస వీరుడు … పిచ్చెక్కించే ఫాంటసీ థ్రిల్లర్

OTT Movie : జలకన్యతో ప్రేమలో పడే సాహస వీరుడు … పిచ్చెక్కించే ఫాంటసీ థ్రిల్లర్

OTT Movie : జలకన్యలు ఉన్నాయా లేవో తెలియదు గానీ వాటి గురించి వచ్చిన రకరకాల కథలు మాత్రం వున్నాయి. వీటి గురించి చాలా సినిమాలే తెరకెక్కాయి. తెలుగులో విక్టరీ వెంకటేష్ నటించిన సాహస వీరుడు సాగర కన్య అప్పట్లో ఒక సెన్సేషన్. ఆతరువాత ఇటువంటి సినిమాలు హాలీవుడ్లో చాలానే వచ్చాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే చైనీస్ మూవీ ఇటువంటి కథతోనే పిచ్చెక్కిస్తుంది. ఈ ఫాంటసీ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…


అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో

ఈ  చైనీస్ ఫాంటసీ థ్రిల్లర్ మూవీ పేరు ‘ది లెజెండ్ ఆఫ్ మెర్మైడ్ 2’ (The legend of Mermaid 2). 2021 లో వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. సాగర కన్యల చుట్టూ ఈ మూవీ స్టోరీ తిరుగుతుంది. ఈ చైనీస్ ఫాంటసీ థ్రిల్లర్ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

హీరో ఒక షిప్ లో ప్రయాణం చేస్తూ ఉంటాడు. అందులో చాలామంది స్మగ్లర్లు ఉంటారు. ఆ సముద్రానికి మంత్రగత్తే అయిన ఒక రాణి ఉంటుంది. ఆమె ఒక జలకన్య ను స్మగ్లర్లకు చూపించి ఒక డీల్ కుదుర్చుకోవాలనుకుంటుంది. ఆ జలకన్యను పట్టుకునే క్రమంలో ఒకరిని ఒకరు కొట్టుకుని  చనిపోతుంటారు. జలకన్య మాత్రం తప్పించుకుని సముద్రంలోకి దూకి పారిపోతుంది. అయితే హీరో దగ్గర జలకన్యకు చెందిన ఒక మని ఉంటుంది. కొంతకాలం క్రితం ఒక జలకన్యను హీరో ప్రేమిస్తాడు. అతన్ని కాపాడే క్రమంలో ఆ మణి ని జలకన్య హీరోకి ఇస్తుంది. ఆ తర్వాత జలకన్య కనిపించకుండా పోతుంది. మణి ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకి శక్తులు వస్తాయి. అందువల్లే ఇప్పుడు ఆ రాణి హీరో సాయం అడుగుతుంది. నిజానికి జలకన్యల మణితో శక్తులు పొందాలని చూస్తుంది రాణి. వాళ్లందరిని అంతం చేయడానికి కూడా సిద్ధపడుతుంది. ఈ విషయం తెలియని హీరో, రాణి కి సాయం చేయడానికి ఒప్పుకుంటాడు.

మరోవైపు సైతాన్ ఆవహించిన డ్రాగన్ నిద్రలేయడానికి సిద్ధంగా ఉంటుంది. అది నిద్రలేస్తే ప్రపంచం అంతమైపోతుంది. దానిని ఎదుర్కోవాలంటే జలకన్యల సాయం అవసరం అవుతుంది. ఆ తర్వాత జలకన్యలు ఉండే ప్రదేశానికి రాణి ని  తీసుకెళ్తాడు హీరో. ఆ ప్రాంతంలో తను ప్రేమించిన జలకన్య కూడా ఉంటుంది. ఆమెను చూసి హీరో చాలా సంతోషాపడతాడు. అయితే ఆ జలకన్య హీరోని ప్రేమించిన విషయం మరచిపోతుంది. చివరికి రాణి కుట్రను హీరో తెలుసుకుంటాడా? డ్రాగన్ నిద్ర లేస్తుందా? జలకన్య హీరోని ప్రేమించిన విషయం ఎందుకు మర్చిపోతుంది? ఈ విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘ది లెజెండ్ ఆఫ్ మెర్మైడ్ 2’ (The legend of Mermaid 2) అనే ఈ చైనీస్ ఫాంటసీ థ్రిల్లర్ మూవీని మిస్ కాకుండా చూడండి.

Related News

OTT Movie : టీనేజర్ల పాడు పనులు… బాయ్ ఫ్రెండ్ ను ఊహించుకుని… చిన్న పిల్లలు చూడకూడని మూవీ

OTT Movie : ఈ సినిమాను చూస్తే పోతారు మొత్తం పోతారు… డెడ్లీయెస్ట్ మూవీ ఎవర్… ఒంటరిగా చూసే దమ్ముందా ?

OTT Movie : మంత్రగాడి అరాచకం… అమ్మాయి దొరగ్గానే వదలకుండా అదే పని… చిన్న పిల్లలు చూడకూడని చిత్రం భయ్యా

OTT Movie : ఊహించిన దానికంటే ముందుగానే ఓటీటీలోకి ‘మాస్ జాతర’… ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే ?

OTT Movie : సోదరిని వెతుక్కుంటూ దెయ్యాల కొంపకు… నెక్స్ట్ ట్విస్ట్ కు గూస్ బంప్స్… ఏ ఓటీటీలో ఉందంటే?

OTT Movie : దొంగను దేవుడిగా మార్చే కోహినూర్ డైమండ్… బిచ్చగాళ్లతో కలిసి అరాచకం… కడుపుబ్బా నవ్వించే తమిళ కామెడీ మూవీ

OTT Movie : దెయ్యాలను తరిమికొట్టే సిస్టర్స్… కుర్రాడి ఎంట్రీతో కథలో ట్విస్ట్… తెలుగులోనూ హర్రర్ మూవీ స్ట్రీమింగ్

OTT Movie : నలుగురు కుర్రాళ్ళు ఒకే అమ్మాయితో… నెలలోపే ఓటీటీలోకి క్రేజీ క్రైమ్ కామెడీ చిత్రం

Big Stories

×