BigTV English

Devara: దేవర.. ఆ సెంటిమెంట్ కలిసొస్తే.. రికార్డులు బ్రేకే..?

Devara: దేవర.. ఆ సెంటిమెంట్ కలిసొస్తే.. రికార్డులు బ్రేకే..?

Devara: దేవర..  ఎట్టకేలకు నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా పాజిటివ్ టాక్ నే అందుకుంది. అరవింద సమేత తరువాత ఎన్టీఆర్ సోలోగా తెరకెక్కిన చిత్రం.. ఆర్ఆర్ఆర్ తరువాత మ్యాన్ ఆఫ్ మాసెస్ గా ఎదిగిన ఎన్టీఆర్ మొదటి చిత్రం కావడం ఒక ఎత్తు అయితే.. రాజమౌళి సెటిమెంట్ ను ఎన్టీఆర్ బ్రేక్ చేస్తాడా.. ? చేయడా.. ? అనే ఉత్కంఠ ఒక వైపు.. కొరటాల శివ ఆచార్య తరువాత హిట్ ను అందుకుంటాడా.. ? అనే ఆత్రుత ఇంకోవైపు పెట్టుకొని ఆడియెన్స్ సినిమాకు వెళ్లారు.


మొదటి షో నుంచి  దేవర సినిమా  మంచి టాక్ నే అందుకుంది. అంటే.. కథ అటుఇటుగా ఉన్నా.. ఎన్నో సినిమాలను గుర్తుచేస్తున్నా.. ఎన్టీఆర్ వన్ మ్యాన్ షో కోసం దేవర చూడొచ్చు అనే నమ్మకాన్ని కల్పించాడు కొరటాల. ఫుల్ గా ఫ్యాన్స్ కు ఎలివేషన్ సీన్స్ తో ఎన్టీఆర్ ను ఎలా చూడాలనుకున్నారో అలా చూపించాడు. ఇక అనిరుధ్ తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేశాడు. కొంతమందికి ఈ సినిమా అంతగా నచ్చకపోయినా.. మరికొంతమంది మాత్రం పర్లేదు చూడొచ్చు అని చెప్పుకొస్తున్నారు.

ఇక ఇవన్నీ పక్కన పెడితే.. డే 1 దేవర కలక్షన్స్ చూస్తే మతిపోతుంది. దేవర మొదటిరోజే దేవర మూవీ నాన్ SSR రికార్డులను బ్రేక్ చేసింది. అయితే ఇదంతా పక్కన పెడితే.. దేవర.. రాజమౌళి సెంటి మెంట్ ను బ్రేక్ చేశాడు అనే చెప్పాలి. అసలు జక్కన్న సినిమా తరువాత మరో సినిమా నిలబడదు. భారీ డిజాస్టర్ టాక్ ను తెచ్చుకుంటుంది. కానీ, దేవర నిలబడ్డాడు. రికార్డ్ కలక్షన్స్ రాబట్టాడు. రాబడతాడు. దానికి ఇంకో సెంటిమెంట్ కూడా కారణం అని చెప్పాలి.


ఎన్టీఆర్ మొదటి హిట్ స్టూడెంట్ నెం. 1 రిలీజ్ డేట్ సెప్టెంబర్  27. మొదటి రోజు ఈ సినిమా కూడా మిక్స్డ్ టాక్ ను అందుకుంది. వీకెండ్ లో ఈ చిత్రం వేగం పుంజుకొని..  బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు అదే సెంటిమెంట్ దాదాపు 23 ఏళ్ళ తరువాత దేవర విషయంలో జరగడం ఖాయమని అంటున్నారు. దేవర కూడా మొదటి రోజు మిక్స్డ్ టాక్ ను అందుకుంది. అదే రోజు రిలీజ్ అయ్యింది. నెగిటివ్ టాక్ రాలేదు కాబట్టి.. ముందు ముందు మంచి కలక్షన్స్ రాబట్టే ఛాన్స్ ఉంది.

అంతేకాకుండా ఈలోపు పెద్ద సినిమాలు కూడా లేవు. ఈ వీకెండ్ లోపు కనుక దేవర సక్సెస్ ట్రాక్  ఎక్కితే.. దేవరను ఆపడం ఎవరి తరం కాదు. మేకర్స్  సైతం ఈ సినిమాపై మంచి హాప్ నే పెట్టుకున్నారు. సక్సెస్ మీట్ ను కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు అంత హెవీగా నెగిటివ్ టాక్ కూడా రాలేదు దీంతో దేవర మరో రెండు రోజులు గట్టిగానే దూసుకెళ్తుందని చెప్పొచ్చు. ఒకవేళ ఆ సెంటిమెట్ కనుక వర్క్ అవుట్ అయితే.. ఎన్టీఆర్ కెరీర్ లో దేవర కూడా ఒక మైలు రాయిలా నిలిచిపోతుంది అని చెప్పాలి. మరి దేవర.. ఈ వీకెండ్ లోపు ఎలాంటి రికార్డ్స్ ను అందుకుంటుందో చూడాలి.

Tags

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×