Pawan Kalyan OG : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో కెరీర్ మొదలు పెట్టిన పవన్ కళ్యాణ్ తన కెరీయర్లో వరుస హిట్ సినిమాలు కొట్టాడు. అవి కేవలం హిట్ సినిమాలు మాత్రమే కాదు బ్లాక్ బస్టర్లు అని చెప్పాలి. ఖుషి సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ దర్శకత్వం వహించిన జానీ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉండేవి. మొదటిసారి పవన్ కళ్యాణ్ దర్శకత్వం చేయడంతో అందరికీ ఒక రకమైన క్యూరియాసిటీ మొదలైంది. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన జానీ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది. ఆ తరువాత పవన్ కళ్యాణ్ ఒక హిట్ సినిమా కొట్టడానికి దాదాపు 10 సంవత్సరాలు పట్టింది.
గబ్బర్ సింగ్ సినిమాతో కం బ్యాక్
పవన్ కళ్యాణ్ కెరియర్ లో ఎన్ని సినిమాలు ఉన్నా కూడా గబ్బర్ సింగ్ సినిమాకు ఉన్న స్థాయి వేరు స్థానం వేరు. హరీష్ శంకర్ ఈ సినిమాను డిజైన్ చేసిన విధానం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులు తనను ఎలా అయితే చూడాలి అనుకుంటున్నారో అలా చూపించి బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకున్నాడు. అప్పటివరకు ఉన్న తెలుగు ఫిలిం ఇండస్ట్రీ రికార్డ్స్ అన్ని తిరగ రాసింది గబ్బర్ సింగ్ సినిమా. ఆ తర్వాత అత్తారింటికి దారేది సినిమా కూడా మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ సినిమా హిట్ అయిన వెంటనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. పాలిటిక్స్ లో ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమా తర్వాత గ్యాప్ ఇచ్చి మళ్లీ వకీల్ సాబ్ సినిమాతో రీయంట్రీ ఇచ్చారు.
రీ ఎంట్రీ తర్వాత స్పీడ్ పెంచాడు
పవన్ కళ్యాణ్ రీసెంట్రీ తర్వాత వరుసగా సినిమాలకు సైన్ చేశాడు. అన్నిటికంటే కూడా సుజీత్ దర్శకత్వంలో చేస్తున్న ఓ జి సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. సుజిత్ స్వతహాగా పవన్ కళ్యాణ్ అభిమాని కావడంతో ఈ సినిమా మీద క్యూరియాసిటీ నెలకొంది. ఇక ఈ సినిమాకి సంబంధించి భారీ కాస్ట్ కూడా ఉంది. ఈ సినిమాలో నటిస్తున్న హిమేష్ కు డెంగ్యూ ఫీవర్ వచ్చింది. ప్రస్తుతం ముంబైలో షూటింగ్ జరుగుతుంది. పవన్ కూడా పాల్గొంటున్నాడు. కానీ, విలన్ కి మాత్రం డెంగ్యూ వచ్చింది. ఒకవైపు విలన్ కు ఇలా జరగడంతో పాటు మరోవైపు వర్షాలు కూడా జోరున కురుస్తున్నాయి. చాలా రోజుల తర్వాత రీ స్టార్ట్ అయిన ఓజీ మూవీ షూటింగ్ మళ్లీ వాయిదా పడుతుందా..? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
Also Read : Prabhas: ప్రభాస్ అందుకే స్పెషల్, తన సినిమా కాంట్రవర్సీలో ఉన్న తను మాత్రం ఉండడు